Delhi DURGA Scheme Telugu News: దేశ రాజధాని ఢిల్లీలో మహిళలతో పాటు ట్రాన్స్‌జెండర్లను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు, ప్రజా రవాణాలో మహిళల భద్రతను పటిష్టం చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సీఎం రేఖా గుప్తా అధ్యక్షతన జరిగిన కీలకమైన ఢిల్లీ క్యాబినెట్ ప్రతిష్టాత్మక దుర్గ(DURGA) పథకానికి అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద మొదటి విడతలో 1,300 పింక్ కలర్ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలను లబ్ధిదారులకు అందించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ పథకానికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మొదటి దశలో ప్రవేశపెట్టబోతున్న 1,300 పింక్ ఈ-ఆటోలలో 1,170 ఆటోలను మహిళా డ్రైవర్లతో పాటు 130 ఆటోలను ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేకంగా అందించబోతున్నట్లు తెలిపింది. ఢిల్లీలోని మొత్తం 13 రెవెన్యూ జిల్లాల పరిధిలో సమాన ప్రాతినిధ్యం కల్పిస్తూ పరదర్శకంగా ఆటోలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైతున్నట్లు తెలుస్తోంది.. ప్రతి జిల్లాకు గరిష్టంగా 90 మహిళలకు.. 10 మంది ట్రాన్స్‌జెండర్లకు ఈ-ఆటోల పర్మిట్లు అందించబోతున్నట్లు ప్రభుత్వం నిర్ణయించుకుంది..
దరఖాస్తు చేసుకునే.. అభ్యర్థుల వయస్సు 20 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాల్సి ఉంటుంది.. అంతేకాకుండా దరఖాస్తుదారులు తప్పనిసరిగా.. ఢిల్లీ నివాసితులై ఉండాల్సి ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది.. అలాగే ఓటర్ ఐడీతో పాటు, లైట్ మోటార్ వెహికల్ (LMV) డ్రైవింగ్ లైసెన్స్, పబ్లిక్ సర్వీస్ వెహికల్ (PSV) బ్యాడ్జ్ కలిగి ఉండాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.. అలాగే కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షలకు మించకూడదని ప్రభుత్వం తెలిపింది.. దరఖాస్తుదారు కుటుంబ సభ్యుల పేరిట ఎలాంటి వాహనం లేదా త్రీ-వీలర్ ఉండకూడదని సూచించింది..
ముగ్గురి కంటే ఎక్కువ మంది సంతానం ఉన్న మహిళలు ఈ పథకానికి అనర్హులని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది.. ట్రాన్స్‌జెండర్లకు సంబంధిత జిల్లా మేజిస్ట్రేట్ (DM) కార్యాలయం జారీ చేసిన అధికారిక ట్రాన్స్‌జెండర్ సర్టిఫికేట్ తప్పనిసరని వెల్లడించింది. మంజూరైన ఈ-ఆటోను మూడు సంవత్సరాల పాటు వేరొకరికి అమ్మడంతో పాటు బదిలీ చేయడం లేదా ఇతరులకు అప్పగించడంపై పూర్తి నిషేధం విధించిన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది..
ఈ ఆటోలు రోడ్లపై సులభంగా గుర్తించేందుకు వీలుగా ప్రత్యేక DURGA లోగోతో పాటు బ్రాండింగ్‌తో గులాబీ కలర్స్‌తో మాత్రమే అందుబాటులోకి తీసుకు వచ్చింది. అలాగే ఆటోల చార్జింగ్ సమస్యలు రాకుండా ఉండేందుకు.. ఢిల్లీ మెట్రో (DMRC) పరిధిలోని దాదాపు 70 మెట్రో స్టేషన్ల పార్కింగ్ ప్రాంతాల్లో EV చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది..
ఈ పథకం కోసం.. ఢిల్లీ ప్రభుత్వం త్వరలోనే ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.. అర్హత కలిగిన అభ్యర్థులు తమ వ్యక్తిగత, వాహన డ్రైవింగ్ పత్రాలతో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం సూచించింది. లాస్ట్-మైల్ కనెక్టివిటీని బలోపేతం చేయడానికి, పర్యావరణ పరిరక్షణకు ఈ పథకం ఎంతగానో సహాయపడుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.