• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /ఢిల్లీ మహానగరాన్ని కమ్మేస్తున్న పొగ కాలుష్యం.. ఇప్పటికే వాహన కాలుష్యంతో ఢిల్లీ విలవిల..

ఢిల్లీ మహానగరాన్ని కమ్మేస్తున్న పొగ కాలుష్యం.. ఇప్పటికే వాహన కాలుష్యంతో ఢిల్లీ విలవిల..

Delhi Pollution: పంజాబ్ మంటలు.. ఢిల్లీని ముప్పుతిప్పలు పెట్టిస్తున్నాయి. గాలిలో కలిసిన పొగ… వాయు కాలుష్యానికి కారణమవుతోంది. ఢిల్లీలో పొగవాయువును పీల్చుకుని ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మంచు కురుస్తుండటంతో పొగ మంచుతో కలిసి మనుషుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వ్యవసాయ పొలాల్లో గడ్డి వ్యర్థాలను కాల్చడంతో ఢిల్లీని కమ్ముకున్న పొగతో గాలి నాణ్యత తీవ్రంగా పడిపోయింది. కాలుష్య నియంత్రణకు అధికార యంత్రాంగం కఠిన ఆంక్షలు అమలుచేస్తున్న తరుణంలో పొగ తీవ్ర శ్వాసకోశ సమస్యలకు కారణమవుతోంది. ఇంతకీ పంటపొలాలను ఎందుకు కాల్చుతున్నారు? ఈ పొగ సమస్యకు పరిష్కారమేంటి?

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 15, 2026, 05:59 AM IST|Updated: Nov 15, 2026, 06:00 AM IST
joinshare
ఢిల్లీ మహానగరాన్ని కమ్మేస్తున్న పొగ కాలుష్యం.. ఇప్పటికే వాహన కాలుష్యంతో ఢిల్లీ విలవిల..
Image Credit: Delhi Polllution (ZEE News Telugu/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
అదుర్స్‌కు సీక్వెల్‌గా ఎన్టీఆర్, అనిల్ రావిపూడి మూవీ ..?

అదుర్స్‌కు సీక్వెల్‌గా ఎన్టీఆర్, అనిల్ రావిపూడి మూవీ ..?

2

కార్తీక మాసంలో దీపదానం ఎలా చేయాలి? ఎవరికి దానం చేస్తే పుణ్యఫలం కలుగుతుంది?

3

తెలంగాణకు తుఫాన్ ఎఫెక్ట్.. నవంబర్ 20 నుంచి 22 వరకు భారీ వర్షాలు.. ఈ 6 జిల్లాలకు అలర్ట్!

4

కార్తీక మాసంలో తులసి ముందు నెయ్యి దీపం ఎందుకు వెలిగిస్తారు? అసలు రహస్యం ఇదే!

5

పుతిన్ దెబ్బకు భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Pollution Peaks in Delhi: ఢిల్లీకి పొరుగున ఉన్న పంజాబ్ లో వ్యవసాయ పొలాలను నూర్పిళ్ల తర్వాత గడ్డిని ఇష్టారాజ్యంగా కాల్చేస్తున్నారు. పంజాబ్ వ్యవసాయ పొలాల్లో మంటలతో ఢిల్లీ మహానగరాన్ని పొగ చుట్టుముట్టేస్తోంది.పంజాబ్‌లో పంట వ్యర్థాల  దహనం వల్ల వెలువడే దట్టమైన పొగ గాలుల ద్వారా ఢిల్లీకి చేరి, అక్కడ తీవ్ర వాయు కాలుష్యానికి మరియు పొగమంచుకు కారణమవుతోంది. నవంబర్ 2026 సీజన్‌లో ఇప్పటివరకు అధికారికంగా ఐదువేలకు పైగా పొలాల్లో మంటబెట్టారని సమాచారం. దీంతో ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్రంగా పడిపోయింది.

ఇప్పటికే ఢిల్లీ మహానగరం వాహనాల రద్ధీతో పొగ కాలుష్యం తీవ్రంగా ఉందని అధికార యంత్రాంగం ఆంక్షలు విధించి అమలు చేస్తోంది. ఇప్పటికే వాహనాల కాలుష్యంతో ఇబ్బంది పడుతున్న ఢిల్లీ మహానగర వాసులకు పంజాబ్ పంటపొలాల్లో మంటల్లోంచి వచ్చే పొగ ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పొలాల్లో పంట నూర్పిడి తర్వాత మిగిలిన గడ్డి, వ్యర్థాల నిర్వహణపై ఆసక్తిలేని రైతులు పంటపొలాల్లోనే వ్యర్థాలను కాల్చేస్తున్నారు.

పొగతో ఢిల్లీలో గాలి నాణ్యత తగ్గుముఖం..

వాహనాలను ఇష్టారీతిన తిరగనీకుండా అధికారులు చర్యలు చేపట్టారు. పంటపొలాల్లోని వ్యర్థాల నిర్వహణపై రైతులకు అవగాహన కల్పించకపోవడంతో పొలాల్లోనే కాల్చేస్తున్నారు. నవంబరు మాసంలో పంట నూర్పిళ్లు మొదలయ్యాయి. దీంతో పంజాబ్‌లో వరి పంట కోతల తర్వాత పొలాల్లో మిగిలిన గడ్డిని తగలబెట్టే ఘటనలు పెరుగుతున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 5 వేలకు పైగా చోట్ల మంటలు చెలరేగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

వరి కోతలకు, తదుపరి గోధుమ పంట సాగుకు మధ్య సమయం చాలా తక్కువగా ఉండటంతో రైతులు గడ్డిని తగలబెట్టే మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఉపగ్రహాల నిఘా సమయం దాటాక సాయంత్రం వేళల్లో రైతులు మంటలు పెడుతున్నారు. దీనివల్ల పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో వాస్తవ మంటల సంఖ్య గణనీయంగ పెరిగాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. పొగ కారణంగా ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో వాయు నాణ్యత సూచీ  వెరీ పూర్  స్థాయికి పడిపోయింది. కాలుష్య నియంత్రణ కోసం అధికారులు ఇప్పటికే కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.

పక్కనే పంజాబ్ పంటపొలాల్లో వ్యవసాయ వ్యర్థాల మంటలు..

శీతాకాలం ప్రారంభం కావడంతో గాలి వేగం తగ్గి, ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీనివల్ల పంజాబ్, హర్యానా వైపు నుండి వచ్చే పొగ ఢిల్లీ వాతావరణంలోనే చిక్కుకుపోయి దట్టమైన పొగమంచుగా మారుతోంది. కాలుష్య నియంత్రణ, యంత్రాల పంపిణీ విషయంలో ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాల మధ్య పరస్పర విమర్శలు కొనసాగుతున్నాయి.

పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో చెలరేగుతున్న భారీ వ్యవసాయ క్షేత్రాల్లో వ్యర్థాలను తగలబెట్టడం వల్ల ఉత్తర భారతదేశంలో కాలుష్య భారం మరింత పెరిగే అవకాశం ఉంది. వాయువ్య గాలులు పొగను, కాలుష్య కారకాలను మోసుకెళ్లే అవకాశం ఉంది. భారత పంజాబ్‌లో కూడా పంట వ్యర్థాలను తగలబెట్టే కేసులు పెరుగుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

వాయువ్య గాలులతో పాటు పొగ భారత భూభాగంలోకి ప్రవేశించి, హర్యానా, ఢిల్లీ, ఘజియాబాద్, ఉత్తర భారత దేశంలోని ఇతర ప్రాంతాలలో కాలుష్యాన్ని తీవ్రతరం చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరో 4 రోజుల పాటు వాయువ్య గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. కనీసం వారం రోజుల పాటు పశ్చిమ ఆటంకం లేకపోవడం కాలుష్య స్థాయిలను మరింత తీవ్రతరమయ్యే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు.

ఢిల్లీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న పంజాబ్ పొగ..

నాసాకు చెందిన ఫైర్ ఇన్ఫర్మేషన్ ఫర్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ నుండి వచ్చిన డేటా ప్రకారం, అక్టోబర్ 1 నుండి 29 మధ్య పాకిస్తాన్ పంజాబ్‌లో 13,241 పంట వ్యర్థాలను కాల్చిన సంఘటనలు నమోదయ్యాయి. అదే భారత పంజాబ్‌లో పొలాల్లో వ్యర్థాల దహనాల సంఖ్య 3,158గా నమోదైంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, తక్కువ గాలుల వేగం, భారత్, పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రాంతంలో పంట వ్యర్థాలను కాల్చడం వల్ల వెలువడే పొగ కలసి జాతీయ రాజధానిపై కాలుష్య కారకాలు బంధిస్తున్నాయి. రాబోయే రెండు మూడు రోజుల్లో ఢిల్లీ గాలి నాణ్యత మరింత క్షీణించి 'తీవ్రమైన' కేటగిరీలోకి ప్రవేశించే అవకాశం ఉందని పర్యావరణ నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

కాలుష్య నియంత్రణ కోసం అధికారులు ఇప్పటికే కఠిన ఆంక్షలు.. 
ఢిల్లీ మహా నగరంలో గాలి నాణ్యత  చాలా పేలవమైన  కేటగిరీలోకి జారిపోయిన నేపథ్యంలో, వాయు నాణ్యత నిర్వహణ కమిషన్   ఢిల్లీ-ఎన్‌సిఆర్ వ్యాప్తంగా గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్  రెండవ దశను అమలు చేసింది. రాబోయే నాలుగు రోజుల పాటు వాయువ్య మైదాన ప్రాంతాల్లో వాయువ్య గాలులు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. తగ్గుతున్న ఉష్ణోగ్రతలు,  బలహీనమైన గాలుల కారణంగా కాలుష్య కారకాలు వ్యాప్తి చెందకుండా నిరోధించబడి, భూమికి దగ్గరగా కేంద్రీకృతమై ఉండి, గాలి నాణ్యత మరింత క్షీణించే అవకాశాలున్నాయి. శీతాకాలానికి ముందు వచ్చే పొగమంచు ఈ ప్రాంతాన్ని కమ్మేయడంతో  ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరాల్లో ఒకటిగా నిలిచింది. పర్యావరణ నిబంధనలను ఉల్లంఘిస్తున్న ఇటుక బట్టీలపై పాకిస్తాన్ ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేయడంతో పాటు, పంట కోత తర్వాత పంట అవశేషాలను కాల్చవద్దని రైతులకు విజ్ఞప్తి చేసింది.
 

Add Zee News as a Preferred Source
TAGS:
National News
Delhi
Telugu News