• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /మొఘల్ చక్రవర్తుల కాలంలోనూ దీపావళి వేడుకలు.. జష్న్ఎ చిరాఘాన్ అంటే ఏమిటో తెలుసా?

మొఘల్ చక్రవర్తుల కాలంలోనూ దీపావళి వేడుకలు.. జష్న్ఎ చిరాఘాన్ అంటే ఏమిటో తెలుసా?

Diwali In The Mughal Empire: మొఘల్ సమ్రాజ్యంలో కూడా దీపావళి పండగను కూడా జరుపుకునేవారని మీకు తెలుసా? అవును ఈ దీపాల పండుగను జష్న్-ఎ-చిరాఘాన్‌గా పిలిచేవారని అప్పటి చరిత్ర చెబుతోంది. అయితే, అప్పటి కాలంలో పండగను ఎలా జరుపుకునేవారో? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 07, 2026, 04:37 PM IST|Updated: Nov 07, 2026, 04:38 PM IST
joinshare
మొఘల్ చక్రవర్తుల కాలంలోనూ దీపావళి వేడుకలు.. జష్న్ఎ చిరాఘాన్ అంటే ఏమిటో తెలుసా?
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Delhi: ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. 5వ తరగతి వరకు ఆన్‌లైన్, హైబ్రిడ్ క్లాసులు.. అసలు కారణం ఏమిటంటే..?..

Delhi: ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. 5వ తరగతి వరకు ఆన్‌లైన్, హైబ్రిడ్ క్లాసులు.. అసలు కారణం ఏమిటంటే..?..

2

RK Roja Emotional: వైసీపీ అభ్యర్థి ఓటమితో రోజా కంటతడి..ఆ వెంటనే కోపంతో కార్యకర్త చెంపదెబ్బ కొట్టేసింది!

3

మొఘల్ చక్రవర్తుల కాలంలోనూ దీపావళి వేడుకలు.. జష్న్ఎ చిరాఘాన్ అంటే ఏమిటో తెలుసా?

4

దీపావళి తర్వాత ఈ 4 రాశులకు జాక్‌పాట్.. నవంబర్ 14 నుంచి శుక్రుడి అనుగ్రహంతో పట్టిందల్లా బంగారమే!

5

Diwali Festival: దీపావళి అంటే ఆ గ్రామస్తులకు హడల్.. వందల ఏళ్లుగా పండగకు దూరం.. మహిళ పెట్టిన శాపం తెలిస్తే మైండ్ బ్లాంక్...

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Diwali In The Mughal Empire: హిందూ సాంప్రదయంలో దీపావళి పండగకి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అయితే, కొన్ని వందల ఏళ్ల క్రితం మొఘల్ రాజభవనాలలో కూడా దీపావళిని అధికారికంగా, అత్యంత వైభవంగా నిర్వహించేవారనే చరిత్ర చెబుతోంది.. మొఘల్ పాలకులు ఈ దీపాల పండుగను జష్న్-ఎ-చిరాఘాన్‌గా పిలిచేవారట.. ఈ పేరుతో దర్బారుల్లో ఘనంగా పండగను ఎంతో ఘనంగా జరిపేవారని ఆనాటి గ్రంథాలు చెబుతున్నాయి. అయితే, ఈ పండగను అప్పుడు ఎలా జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.

మొఘల్ సామ్రాజ్యంలో పరమత సహనాన్ని మెరుగుపరిచే క్రమంలో అక్బర్ చక్రవర్తి దీపావళిని జరపడం ఆనవాయితీగా మార్చారని పురాణాలు చెబుతున్నాయి. అబుల్ ఫజల్ రచించిన ఐన్-ఇ-అక్బరీలో తెలిపిన వివరాల ప్రకారం.. దీపావళి సందర్భంగా రాజమందిరాల ప్రాంగణంలో దాదాపు 40 గజాల ఎత్తైన స్తంభంపై పెద్ద ఆకాశ దీపాన్ని ప్రతిష్ఠించేవారట.. పత్తి గింజల నూనెతో భారీ దీపాన్ని చక్రవర్తి స్వయంగా వెలిగించి దీపావళి వేడుకలను మొదలు పెట్టేవారని సమాచారం. కోట బురుజులతో పాటు గోడల వెంట వేలాది దీపాలను పెట్టడంతో పాటు ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ నగరాలు విద్యుత్ వెలుగులతో అందగా ముస్తాబు చేసేవారట..

అక్బర్ కుమారుడు జహంగీర్ చక్రవర్తి కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగించారని సమాచారం.. తన ఆత్మకథ తుజుక్-ఎ-జహంగీరీలో ఆయన దీపావళి పండుగను కూడా చాలా అద్భుతంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది.. దీపావళి రాత్రి లక్ష్మీదేవి పూజతో పాటు సంప్రదాయ పాచికలాట వంటి వేడుకల్లో దర్బారు ప్రముఖులతో కలిసి ఆయన పాల్గొనేవారట.. ఆ రాత్రి భారీ బాణసంచా ప్రదర్శనలతో పాటు మిఠాయిల పంపిణీ కూడా చేసేవారని సమాచారం..

మొఘల్ కాలపు మినియేచర్ పెయింటింగ్స్‌లో మొఘల్ రాణులతో పాటు రాకుమార్తెలు రాణివాసం లోపల చేతుల్లో బాణసంచా పట్టుకుని కాల్చుతున్న దృశ్యాలు నేటికీ మ్యూజియంలలో అందుబాటులో ఉన్నాయి. షాజహాన్‌తో పాటు ఆయన కుమారుడు దారా షికోహ్ కూడా ఈ సంస్కృతిని కొనసాగించారని సమాచారం. ప్రజలందరినీ ఏకతాటిపైకి తెచ్చే ఒక సామాజిక ఉత్సవంగా మొఘలులు దీపావళిని ఆదరించారని అప్పటి చరిత్ర చెబుతోంది..
 

Add Zee News as a Preferred Source
TAGS:
Trending News
Telugu News