• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Delhi: ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. 5వ తరగతి వరకు ఆన్‌లైన్, హైబ్రిడ్ క్లాసులు.. అసలు కారణం ఏమిటంటే..?..

Delhi: ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. 5వ తరగతి వరకు ఆన్‌లైన్, హైబ్రిడ్ క్లాసులు.. అసలు కారణం ఏమిటంటే..?..

Delhi air pollution: దేశ రాజధాని ఢిల్లీలో విపరీతంగా వాయు కాలుష్యం పెరిగిపోయింది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. దీనిలో భాగంగా 5వ తరగతి వరకు ఆన్‌లైన్, హైబ్రిడ్ క్లాసులను నడపాలని అన్ని స్కూళ్లకు ఆదేశాలు జారీ చేశారు.

Written ByInamdar Paresh
Published: Nov 07, 2026, 04:57 PM IST|Updated: Nov 07, 2026, 05:07 PM IST
joinshare
Delhi: ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. 5వ తరగతి వరకు ఆన్‌లైన్, హైబ్రిడ్ క్లాసులు.. అసలు కారణం ఏమిటంటే..?..
Image Credit: delhi pollution news(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Delhi: ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. 5వ తరగతి వరకు ఆన్‌లైన్, హైబ్రిడ్ క్లాసులు.. అసలు కారణం ఏమిటంటే..?..

Delhi: ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. 5వ తరగతి వరకు ఆన్‌లైన్, హైబ్రిడ్ క్లాసులు.. అసలు కారణం ఏమిటంటే..?..

2

RK Roja Emotional: వైసీపీ అభ్యర్థి ఓటమితో రోజా కంటతడి..ఆ వెంటనే కోపంతో కార్యకర్త చెంపదెబ్బ కొట్టేసింది!

3

మొఘల్ చక్రవర్తుల కాలంలోనూ దీపావళి వేడుకలు.. జష్న్ఎ చిరాఘాన్ అంటే ఏమిటో తెలుసా?

4

దీపావళి తర్వాత ఈ 4 రాశులకు జాక్‌పాట్.. నవంబర్ 14 నుంచి శుక్రుడి అనుగ్రహంతో పట్టిందల్లా బంగారమే!

5

Diwali Festival: దీపావళి అంటే ఆ గ్రామస్తులకు హడల్.. వందల ఏళ్లుగా పండగకు దూరం.. మహిళ పెట్టిన శాపం తెలిస్తే మైండ్ బ్లాంక్...

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Delhi govt ordered to schools operate in hybrid mode up to class 5:  దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలో ఇప్పటికే  అధికారులు అప్రమత్తమైన కూడా వాయు కాలుష్యంతో ప్రజలు తీవ్ర  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గడిచిన 24 గంటల సగటు గాలి నాణ్యత సూచిక (AQI) గురువారం నాటి 369 నుంచి శుక్రవారం నాటికి 382కి పెరిగింది. ఇది అతితీవ్రమైన వాయు కాలుష్యం 401 కన్నా కేవలం 19 పాయింట్లు తక్కువ. అయినప్పటికి కూడా దీనిపై అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పెరిగిపోతున్న వాయు కాలుష్యం నేపథ్యంలో 5వ తరగతి వరకు స్కూల్ విద్యార్థులకు హైబ్రిడ్ లేదా  ఆన్ లైన్ క్లాసుల్ని నిర్వహించాలని ఆయా స్కూళ్లకు విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులు పాఠశాలకు వెళ్లి లేదా ఆన్‌లైన్‌లో తరగతులకు హాజరుకావచ్చని తెలిపారు.
 

ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలతో పాటు MCD, NDMC, ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని స్కూళ్లకూ ఈ ఆదేశాలు వర్తిస్తాయని అధికారులు స్పష్టంచేశారు. GRAP-3 ఆంక్షల అమలుతో తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిర్ణయం  కొనసాగతుందని స్పష్టం చేశారు.
దీపావళి పండగ నేపథ్యంలో ఒకవైపు కాలుష్యంపెరిగిపోతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

AQI 400 దాటకముందే అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో రానున్న రోజుల్లో మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సైతం సిద్దంగా ఉన్నామని ఢిల్లీ ప్రభుత్వం తెల్చి చెప్పింది.ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ఇప్పటికే కూల్చివేతలు, తవ్వకాలు, మరమ్మత్తులు మొదలైన వాటిపై ఢిల్లీలో పరిమితుల్ని విధించారు.
మరోవైపు ప్రభుత్వ, పురపాలక, ప్రైవేట్ కార్యాలయాలను 50 శాతం సిబ్బందితో ఆఫీస్, మిగత వారు ఇంటి నుంచి షిఫ్ట్ ల వారిగా పనిచేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఉద్యోగులు ప్రభుత్వంను కోరుతున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Delhi
National News
Telugu News
School Holiday