దీపావళి రాత్రి మణికర్ణిక ఘాట్‌లో వింత ఆచారం.. అఘోరాలు అర్ధరాత్రి ఏం చేస్తారో తెలుసా?
Diwali Celebrations: కొన్ని ప్రదేశాల్లో కొంతమంది దీపావళి వేడుకలను వింతగా జరుపుకుంటూ ఉంటారు.. అలా జరుపుకునే ప్రాంతాల్లో కాశీతో పాటు పశ్చిమ బెంగాల్ ప్రత్యేకమైనదిగా భావించవచ్చు. ఈ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో స్మశాన వాటికల్లో అఘోరాలు దీపాలు వెలిగిస్తూ ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారట..
Varanasi Diwali Celebrations: లోకమంతా దీపాల వెలుగులు.. రంగురంగుల విద్యుత్ దీపాలు లక్ష్మీదేవి పూజలతో దీపావళి సంబరాల్లో మునిగిపోతుంది.. కానీ అదే కార్తిక అమావాస్య అర్ధరాత్రి కాశీలోని మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్‌లతో పాటు పశ్చిమ బెంగాల్‌లోని తారాపీఠ్ శ్మశాన వాటికల్లో దృశ్యం పూర్తిగా భిన్నంగా ఉంటుందని ఎవరికైనా తెలుసా? భయంతో పాటు భక్తి ఆధ్యాత్మిక రహస్యాలు కలిసే.. ఆ వాతావరణంలో అఘోరాలు, తాంత్రిక సాధకులు చేసే నిషా పూజ అత్యంత రహస్యమైందిగా భావించవచ్చు. అసలు ఈ పూజ ప్రత్యేకత ఏంటి? దీపావళి సమయాల్లో మాత్రమే జరపడానికి గల కారణాలు? వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
శైవ, శాక్త సాంప్రదాయాల్లో కార్తిక అమావాస్య రాత్రిని మహా రాత్రి లేదా కాలరాత్రిగా చెప్పుకుంటూ ఉంటారు. సాధారణంగా అందరూ సిరిసంపదల కోసం లక్ష్మీదేవిని ఆరాధిస్తే.. తాంత్రిక సాధకులు భవబంధాల నుంచి విముక్తితో పాటు మోక్షాన్ని కోరుకుంటూ మహాకాళి అమ్మవారిని పూజిస్తూ ఉంటారు.. అంతేకాకుండా ఈ సమయాల్లో చాలామంది అఘోరాలు కాలభైరవుడిని కూడా పూజిస్తారు. స్మశానం వారికి భయం కలిగించే స్థలంగా వారు అస్సలు భావించారట.. వారు దానిని కేవలం జనన మరణాల చక్రాన్ని ఛేదించే పవిత్రమైన వేదికగా కూడా చెప్పుకుంటారట.. అక్కడ నిరంతరం రగిలేచితి మంటలను సాక్షిగా ఉంచి వారు ఈ విశేష పూజను మొదలుపెడతారట..
ఈ అమావాస్య సమయంలో మణికర్ణికా ఘాట్‌లో ఎప్పుడు మండుతూనే ఉండే చేతుల వద్ద అఘోరాలు ధ్యానంలో మునిగిపోతూ ఉంటారు.. వారు చితి భస్మాన్ని శరీరంపై ధరించి మట్టి ప్రమిదలలో ఆవనూనెతో లేదా నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తారట కొందరు సాధకులు చితిబోగ్గులతో పాటు పుర్రెల సమీపంలో దీపాలు ఉంచి రుద్ర సాధన చేస్తారని కూడా సమాచారం. లౌకిక వాసనలను దహనం చేసి అంతర్గత జ్ఞాన దీపాన్ని వెలిగించడమే ఈ దీపారాధన పరమార్ధమని వారు విశ్వసిస్తూ ఉంటారట.. అందుకే వారు కాలుతున్న చితి దగ్గర కూడా దీపాలు వెలిగిస్తూ ఉంటారట..
బెంగాల్‌లోని వీర్భూమ్ జిల్లాలో ఉన్న తారాపీఠ్ మహాశ్మశానం తాంత్రిక విద్యలకు ప్రసిద్ధిగా చెప్పుకుంటూ ఉంటారు.. ఇక్కడ సాధకులు కౌలచార పద్ధతిలో అర్ధరాత్రి సమయంలో తారా దేవిని పూజిస్తూ ఉండడం ఒక సాంప్రదాయంగా వస్తుందట.. ఏంటి నా కపాలాలతోపాటు ఎముకలు సింధూరంతో మాతృదేవతలకు యంత్రాలను రచిస్తారట.. పంచమకారుల సంకేతాలతో మంత్రోచ్ఛారణలు చేస్తూ.. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున వరకు హోమాలు నిర్వహిస్తూ ఉంటారని సమాచారం స్మశానంలోని నిశ్శబ్దాన్ని ఈ సమయాల్లో గంటల నాదంతో సందడి సందడిగా పూజలు చేస్తూ ఉంటారట..