కిలోల కొద్దీ బంగారంతో ప్రత్యేక వాక్‌వే.. దుబాయ్‌లో ఎక్కడ నిర్మిస్తున్నారో తెలుసా?
Dubai Gold Walkway 2026: అత్యంత తొందరలోనే దుబాయ్ గోల్డ్ వాక్‌వే ప్రారంభం కాబోతోంది. ఈ గోల్డ్ వాక్‌వేను డీరా ప్రాంతంలో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా పనులు పూర్తయినట్లు తెలుస్తోంది. అయితే, వంతెనకు సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Dubai Gold Walkway 2026 Telugu News: అద్భుతమైన కట్టడాలతో పాటు అరుదైన ప్రాజెక్టులతో ప్రపంచాన్ని ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరిచే దుబాయ్ మరో చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు బంగారాన్ని ఆభరణాలుగా ధరించడం లేదా పెట్టుబడిగా దాచుకోవడం మాత్రమే మనకు తెలుసు.. కానీ, ఇకపై స్వచ్ఛమైన బంగారంతో నిర్మించిన ప్రత్యేమైన వంతెనపై నడిచే అరుదైన అనుభూతిని పర్యాటకులకు అందించేందుకు దుబాయ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రపంచంలోనే మొట్టమొదటి, అత్యంత పొడవైన 24 క్యారెట్ల గోల్డ్ వాక్‌వే నిర్మాణ పనులు స్పీడ్‌గా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది..
దుబాయ్‌లోని డీరా ప్రాంతంలో ఉన్న దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్‌లో ఈ అరుదైన వాక్‌వే అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు వివరాలను దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్ సీనియర్ డైరెక్టర్ రషీద్ అల్ హమూదీ అధికారికంగా ఇటీవలే వెల్లడించారట.. 2026 ఏడాది చివరి నెలలోనే ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యి.. పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. అయితే, ఇది ఎప్పుడు ప్రారంభమవుతుందని మాత్రం ఆయన వివరించలేదు..
బంగారం, వజ్రాభరణాలు, బులియన్ వ్యాపారంతో పాటు అన్ని పెట్టుబడులకు సంబంధించిన సేవలను ఒకే వేదికపైకి తెచ్చే ఉద్దేశంతో 2026 జనవరిలో దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్‌ను ప్రారంభించిన్నట్లు తెలుస్తోంది. ఇందులో వెయ్యికి పైగా రిటైల్ దుకాణాలు కూడా అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా అందించిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇక్కడ కొత్త హోల్‌సేల్ గోల్డ్ ట్రేడింగ్ షాపుల సంఖ్య దాదాపు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. అలాగే బంగారం, విలువైన రత్నాలు, లగ్జరీ వాచీల రిటైల్ షోరూమ్‌లు కూడా 15 శాతం పెరిగినట్లు తెలుస్తోంది.
24 క్యారెట్ల గోల్డ్‌తో ఈ వాక్‌వే నిర్మిస్తున్నారనే న్యూస్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించిన వివరాలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ వాక్‌వే నిర్మాణంలో ఎంత పరిమాణంలో బంగారాన్ని వినియోగిస్తారు.. దీని పొడవు ఎంత ఉంటుంది? ఎలాంటి సాంకేతికతను వాడుతున్నారనే విషయాలపై అధికారులు ఇంకా పూర్తి స్పష్టత ఇవ్వలేదు.