Elnino reduce tips: ముంచుకొచ్చిన ఎల్ నినో గండం.. ప్రజలు తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే..?..
Elnino impact on Telangana: ఎల్ నినో ప్రభావంతో పంటలు సకాలంలో పండగ రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి ఇంకా చేయ్యిదాటక ముందే ప్రజలు కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
Elnino crisis impact prepared ness precautions tips: గతంలో ప్రపంచ దేశాలు కరోనా మహామ్మారికి గజగజ వణికిపోయాయి. అచ్చం అలాంటి మరో మహమ్మారి ఎల్ నినో రూపంలో ప్రపంచదేశాలకు చుక్కలు చూపిస్తుంది. ఇప్పటికే అనేక దేశాల్లో ఆహరకొరత ఏర్పడింది. పంటలు పూర్తిగా ఎండిపోయి వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలో పడింది.ఇక భారత్ కూడా ఎల్ నినో ప్రభావంతో అల్లాడిపోతుంది.
ఎల్ నినో ప్రభావం నుంచి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే కొంతైన సమస్యల నుంచి బైటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.ఎల్ నినో ప్రభావం వేళ.. ప్రజలునీటిని చాలా చాలా తక్కువగా ఉపయోగించాలి. అంతే కాకుండా విద్యుత్తును అదుపులో అవసరమైన మేరకే వినియోగించాలి.
1. ఇళ్లల్లో పనిచేసే పనివాళ్లు గిన్నెలు తోమడానికి, బట్టలు ఉతకడానికి నల్లా తిప్పేసి.. పనిచేస్తూ, మధ్య మధ్యలో చెవిలో ఇయర్ ఫోను పెట్టుకుని చేత్తో పనులు చేసుకుంటూ విపరీతంగా నీటిని దుర్వియోగం చేస్తుంటారు. ఇలాంటి వాటిని పూర్తిగా నియంత్రించాలి.
2. ఇంట్లో, అన్ని గదుల్లో ఒకే సారి లైట్లు వేసేసి ఉంచడం , ఎవ్వరూ లేక పోయినా ఫ్యాన్లు, ఏసీలు, టీవీలు ఆన్ చేసేసి అటూ ఇటూ ఎటో తిరగడంవంటివి మానేయాలి.
3. ఎక్కడ అవసరం ఉంటే అక్కడే కరెంటు వినియోగించండి.
4. పండగలనీ, పెళ్లిళ్లని, గృహ ప్రవేశాలనీ, షాపింగ్ మాల్స్ , కొత్త కొత్త భవనాలు ప్రారంభం కోసం బిల్డింగ్ అంతా లైట్లతో అలంకరించి గొప్పలకు పోయి కరెంటును దుర్వినియోగం చేయోద్దని నిపుణులు సూచిస్తున్నారు.ఆలయాలకు, మసీదులకు, చెర్చిలపై అలకరణ లైట్స్ తీసేయాలని సూచిస్తున్నారు. అలా వినియోగించే వారిపై చర్యలు తీసుకోవడం, ఫైన్ వేయడం చేయాలని సూచిస్తున్నారు.
5. మోటార్ ఆన్ చేసేసి ఓవర్ హెడ్ ట్యాంక్ నిండిపోయి, పోర్లిపోతున్నా కొంత మంది పట్టించుకోరు. అలా గంటల పాటు బోర్ వేసి మర్చిపోతూ, నీటిని విపరీతంగా రోడ్లపై వదిలేయడం మానుకొవాలి.
6. శుక్రవారం ఇళ్లు కడగటం ,వేడుకల్ని బోర్ వేసేసి పెద్ద ధారతో ఇల్లంతా కడిగేసి నీటి వృథా చేయడం మానుకొవాలి. మగ్గుతో అయ్యే పనికి డ్రమ్ముడు నీళ్లు వృధా చేసుకొవడం మానుకొవాలి.
7. ఇక కార్లు, టూ వీలర్స్.. ఇతర వాహనాలు రోజూ కడియేయడం మానేయండి..
8. ఆడవాళ్ళు గిన్నెలు తోముతూ వటింటింట్లో, మగాళ్లు మీసాలు గడ్డాలు గీసుకుంటూ వాష్ రూమ్ లో నల్లా వదిలేసి వృథా చేయడం మానేయాలి.
9. ఎల్నినో...2026 మానవాళికి మరో పెను ముప్పు మారక ముందే ప్రజలు మేల్కొవాలని నిపుణులు పై సూచనలు ఖచ్చితంగా పాటించాలని సూచిస్తున్నారు.