SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

EPF Scheme 2026: ఉద్యోగులకు అలర్ట్..పీఎఫ్ కాంట్రిబ్యూషన్ తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!

EPF Scheme 2026: కేంద్ర ప్రభుత్వం నూతన ఈపీఎఫ్ (EPF) పథకం 2026 కింద ఉద్యోగుల పీఎఫ్ కాంట్రిబ్యూషన్లలో మార్పులు చేసే ప్రతిపాదనను సిద్ధం చేస్తోంది. దేశంలో మహమ్మారి లేదా ఇతర అత్యవసర విపత్తు పరిస్థితులు ఎదురైనప్పుడు ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఉపశమనం కల్పించేందుకు గరిష్టంగా మూడు నెలల వ్యవధి వరకు పీఎఫ్ కాంట్రిబ్యూషన్‌ను తగ్గించడం లేదా వాయిదా వేసేలా ఈ ప్రత్యేక నిబంధనలను ఉపయోగించుకోవచ్చు. దీనివలన ఉద్యోగుల చేతికి వచ్చే నెలవారీ జీతం పెరిగినప్పటికీ, దీర్ఘకాలిక భవిష్యత్ పొదుపు మొత్తం తగ్గే అవకాశం ఉంది.

Written By Harish Darla
Published: Sep 15, 2026, 02:45 PM IST | Updated: Sep 15, 2026, 02:52 PM IST
Join

EPF Scheme Contribution 2026: సాధారణంగా ప్రతి ఉద్యోగి జీతం నుంచి ప్రతి నెలా పీఎఫ్ (PF) వాటాను యాజమాన్యం మినహాయిస్తుంది. ఈ పొదుపు మొత్తం ఉద్యోగుల భవిష్యత్ అవసరాలను తీర్చుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే, 2026లో రాబోతున్న కొత్త ఈపీఎఫ్ పథకం నిబంధనల ప్రకారం, కొన్ని నిర్దిష్టమైన పరిస్థితులలో పీఎఫ్ వాటాలలో మార్పులు చేయడానికి వీలు కల్పిస్తున్నారు.

పీఎఫ్ కాంట్రిబ్యూషన్‌లో జరిగే మార్పులు..
ఈపీఎఫ్ పథకం 2026 కింద, కొన్ని పరిస్థితులలో ఉద్యోగుల పీఎఫ్ కాంట్రిబ్యూషన్‌ను తగ్గించే లేదా తాత్కాలికంగా వాయిదా వేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లభిస్తుంది. ఉదాహరణకు, ఒక ఉద్యోగి ప్రతి నెలా తన పీఎఫ్ ఖాతాలో రూ.4,000 జమ చేస్తుంటే, ప్రభుత్వం ఈ నిబంధనను అమలు చేసినప్పుడు రూ.4,000కి బదులుగా రూ.2,000 మాత్రమే జమ కావచ్చు. మిగిలిన రూ.2,000 ఉద్యోగి జీతంలోనే కలసి వస్తాయి. అయితే, ఈ మార్పులు తక్షణమే అమలు చేయరు. సాధారణ రోజుల్లో పీఎఫ్ కాంట్రిబ్యూషన్ మునుపటిలాగే కొనసాగుతుందని, కేవలం అత్యవసర వేళల్లో మాత్రమే ప్రభుత్వం ఈ నిబంధనను ఉపయోగిస్తుందని వెల్లడైంది.

ఏ పరిస్థితులలో ఈ మార్పు వర్తిస్తుంది?
దేశంలో అకస్మాత్తుగా మహమ్మారి వ్యాపించినప్పుడు లేదా ఏదైనా విపత్తు పరిస్థితులు ఏర్పడినప్పుడు ఉద్యోగులకు ఆర్థిక ఉపశమనం అందించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. గమనించాల్సిన విషయమేమిటంటే, ఇది శాశ్వత మార్పు కాదు. ప్రభుత్వం అత్యవసర పరిస్థితుల్లో గరిష్టంగా మూడు నెలల వరకు పీఎఫ్ కాంట్రిబ్యూషన్లను తగ్గించవచ్చు లేదా వాయిదా వేయమని ఆదేశించవచ్చు. ఈ మార్పులు కేవలం ఉద్యోగుల పీఎఫ్ వాటాకే కాకుండా, యజమాని (Employer) ఇచ్చే కాంట్రిబ్యూషన్‌కు కూడా వర్తిస్తాయి.

ఉద్యోగులపై పడే ప్రభావం..
పీఎఫ్ కోతలు తగ్గడం వల్ల ఉద్యోగుల చేతికి వచ్చే నెలవారీ నగదు పెరుగుతుంది. ఉదాహరణకు రూ.4,000 బదులు రూ.2,000 మాత్రమే కోత విధిస్తే, ఆ మిగిలిన రూ.2,000 ఉద్యోగికి చేతికి అందుతాయి. ఇది తాత్కాలిక ఉపశమనాన్ని అందించినప్పటికీ, పీఎఫ్ ఖాతాలో తక్కువ మొత్తం జమ అవ్వడం వల్ల భవిష్యత్ పొదుపు తగ్గుతుందనే విషయాన్ని ఉద్యోగులు గుర్తుంచుకోవాలి.

Also Read: యాపిల్ ఐఫోన్ 18 సంచలనం..మడతబెట్టే ఐఫోన్ వచ్చేసింది..ఒక్కోటి రూ.3 లక్షలు మాత్రమే!

Also Read: ఉద్యోగులకు ముఖ్య గమనిక..ఈపీఎఫ్ అడ్వాన్స్ కొత్తరూల్స్..ఎన్నిసార్లు విత్‌డ్రా చేయోచ్చు

 


 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

ZEENEWS TRENDING STORIES