EPF Deduction Hike Update: కేంద్ర ప్రభుత్వం ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) వేతన పరిమితిని నెలకు రూ. 15,000 నుంచి రూ. 25,000కు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 12 ఏళ్ల విరామం తర్వాత జరిగిన ఈ సవరణ వల్ల దేశవ్యాప్తంగా మరో 51 లక్షల మందికి పైగా ఉద్యోగులకు కొత్తగా సామాజిక భద్రత లభిస్తుంది. రిటైర్మెంట్ సేవింగ్స్‌కు ఇది ఎంతగానో మేలు చేసినప్పటికీ, ప్రస్తుతం ఉద్యోగుల నెలవారీ టేక్-హోమ్ శాలరీపై మాత్రం స్పష్టమైన ప్రభావం చూపనుంది.
EPF Scheme 2026: కేంద్ర ప్రభుత్వం నూతన ఈపీఎఫ్ (EPF) పథకం 2026 కింద ఉద్యోగుల పీఎఫ్ కాంట్రిబ్యూషన్లలో మార్పులు చేసే ప్రతిపాదనను సిద్ధం చేస్తోంది. దేశంలో మహమ్మారి లేదా ఇతర అత్యవసర విపత్తు పరిస్థితులు ఎదురైనప్పుడు ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఉపశమనం కల్పించేందుకు గరిష్టంగా మూడు నెలల వ్యవధి వరకు పీఎఫ్ కాంట్రిబ్యూషన్‌ను తగ్గించడం లేదా వాయిదా వేసేలా ఈ ప్రత్యేక నిబంధనలను ఉపయోగించుకోవచ్చు. దీనివలన ఉద్యోగుల చేతికి వచ్చే నెలవారీ జీతం పెరిగినప్పటికీ, దీర్ఘకాలిక భవిష్యత్ పొదుపు మొత్తం తగ్గే అవకాశం ఉంది.