SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

EPFO New Plan: PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. EPFO కొత్త ప్లాన్‌తో ప్రతి నెలా డబ్బులు పొందే ఛాన్స్..!

EPFO Systematic Withdrawal Plan: ఉద్యోగ విరమణ తరువాత పీఎఫ్ సొమ్ము కోసం ఇక ఒకేసారి ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా EPFO కొత్త విధానం తీసుకువచ్చింది. సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ పేరుతో కొత్త ప్రతిపాదన తీసుకువచ్చింది. పూర్తి వివరాలు ఇలా..

Written By Ashok Krindinti
Published: Nov 19, 2026, 15:15 IST | Updated: Nov 19, 2026, 15:34 IST
Image Credit: EPFO Systematic Withdrawal Plan (Source: AI Generated)
Join

EPFO Systematic Withdrawal Plan: EPF ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రిటైర్‌మెంట్ తరువాత పీఎఫ్ అకౌంట్‌లో దాచుకున్న మొత్తాన్ని ఒకేసారి తీసుకోకుండా.. అవసరాన్ని బట్టి ప్రతి నెలా లేదా మూడు నెలలకు ఒకసారి కొంత మొత్తాన్ని పొందే అవకాశం కల్పించాలని EPFO నిర్ణయించింది. ఇందుకోసం సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (SWP) తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. ఈ ప్రతిపాదనకు గురువారం జరిగిన EPFO సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) 240వ సమావేశంలో ఆమోదం లభించింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ విధానం అమల్లోకి వస్తే రిటైర్‌మెంట్ తరువాత కూడా మిగిలిన పీఎఫ్ సొమ్ముపై వడ్డీ పొందుతూ క్రమంగా డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉద్యోగ విరమణ తరువాత అర్హత కలిగిన ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాలోని మొత్తాన్ని ఒకేసారి విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది.

కొత్త ప్రతిపాదన ప్రకారం ఇకపై ఆ డబ్బును విడతల వారీగా పొందే వెసులుబాటు కల్పించనున్నారు. ఉద్యోగ విరమణ చేసిన వారు తమ PF మొత్తాన్ని EPFOలోనే కొనసాగిస్తూ.. నిర్ణీత వ్యవధుల్లో డబ్బులు తీసుకోవచ్చు. మిగిలిన సొమ్ముపై PF నిబంధనల ప్రకారం వడ్డీ పొందే అవకాశం ఉంటుంది. దీనివల్ల రిటైర్మెంట్ తర్వాత చేతిలో ఉన్న మొత్తం డబ్బును ఎలా నిర్వహించాలనే ఆందోళన కొంత తగ్గుతుంది. 

మూడు రకాల ఆప్షన్లు

ఖాతాదారుడు మరణిస్తే..

SWP విధానంలో డబ్బులు పొందుతున్న సమయంలో ఖాతాదారుడు మరణిస్తే.. మిగిలిన పీఎఫ్ మొత్తాన్ని అదే నిబంధనల ప్రకారం జీవిత భాగస్వామి లేదా నామినీ కొనసాగించే అవకాశం కల్పించాలని ప్రతిపాదిస్తున్నారు. దీనివల్ల పదవీ విరమణ తరువాత కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించవచ్చని భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనలో మరో ఆసక్తికరమైన అంశం ఉంది. ప్రస్తుతం ఉద్యోగుల పీఎఫ్‌కు ప్రధానంగా ఉద్యోగి, యజమాని వాటాల రూపంలో డబ్బులు జమ అవుతాయి. అయితే కొత్త విధానంలో ఉద్యోగి తనంతట తానే అదనపు మొత్తాన్ని పీఎఫ్ ఖాతాలో జమ చేసుకునే అవకాశం కల్పించాలని యోచిస్తున్నారు.

EPFO అందించే డిజిటల్ చెల్లింపు విధానాల ద్వారా ఈ మొత్తాలను జమ చేయవచ్చు. ఇందుకోసం యజమాని కూడా అంతే మొత్తం జమ చేయాల్సిన అవసరం ఉండదని ప్రతిపాదిస్తున్నారు. ఆదాయపు పన్ను చట్టం, EPFO నిర్దేశించే పరిమితులకు లోబడి ఈ అదనపు చెల్లింపులు ఉంటాయి. ఈ ప్రతిపాదన కేవలం ప్రస్తుతం EPF పరిధిలో ఉన్న ఉద్యోగులకే కాకుండా భవిష్యత్‌లో గిగ్ వర్కర్లు, ప్లాట్‌ఫామ్ వర్కర్లు, నిర్మాణ రంగ కార్మికులు, ఇంటి పనివారు, వీధి వ్యాపారులు వంటి అసంఘటిత రంగ కార్మికులకు కూడా విస్తరించే అవకాశం ఉంది. వీరు టిప్స్, బహుమతులు, గ్రాట్యుటీ వంటి రూపాల్లో వచ్చే చిన్న మొత్తాలను కూడా యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) అనుసంధానించిన డిజిటల్ చెల్లింపుల ద్వారా పీఎఫ్ ఖాతాల్లో జమ చేసుకునే విధానాన్ని పరిశీలిస్తున్నారు. ఇలా చిన్న మొత్తాలను దీర్ఘకాలిక పొదుపుగా మార్చుకోవచ్చని భావిస్తున్నారు.

EPFO అంచనాల ప్రకారం.. 55 ఏళ్లు దాటిన వారిలో పీఎఫ్ ఖాతాలో రూ.5 లక్షలకు పైగా నిల్వ ఉన్న సుమారు 6.32 లక్షల మంది ఈ ప్రతిపాదన అమలు అయితే తొలి దశలో ప్రయోజనం పొందే అవకాశం ఉంది. అయితే ఈ సంఖ్య అంచనా మాత్రమే. EPFO బోర్డు ఆమోదం తెలిపినా.. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్, మార్గదర్శకాలు విడుదల కావాల్సి ఉంది. విత్‌డ్రా చేసుకునే వ్యవధి, కనీస బ్యాలెన్స్, దరఖాస్తు విధానం, ఇతర నిబంధనలపై EPFO స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఆ తర్వాతే ఖాతాదారులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోగలరు.

ఇక్కడ ఉద్యోగులు ఒక విషయం గుర్తుంచుకోవాలి. EPFలోని డబ్బులు, ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS) కింద వచ్చే నెలవారీ పెన్షన్ రెండూ వేర్వేరు. కనీసం పదేళ్ల అర్హత కలిగిన సర్వీసు ఉన్న ఉద్యోగులు 58 ఏళ్ల వయసు నుంచి EPS నిబంధనల ప్రకారం నెలవారీ పెన్షన్ పొందేందుకు అర్హులు. కొత్త SWP విధానం మాత్రం PFలో జమ అయిన మొత్తాన్ని ఎలా విత్‌డ్రా చేసుకోవచ్చనే అంశానికి సంబంధించినది. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES