• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /EPFO అత్యవసర సెక్యూరిటీ అలర్ట్! ఈ 4 వివరాలు ఎవరికీ చెప్పకండి.. ఖాతా ఖాళీ అవుతుంది!

EPFO అత్యవసర సెక్యూరిటీ అలర్ట్! ఈ 4 వివరాలు ఎవరికీ చెప్పకండి.. ఖాతా ఖాళీ అవుతుంది!

ప్రైవేటు రంగంలో పనిచేసే ప్రతి ఉద్యోగికి ఈపీఎఫ్ఓ ఖాతా ఉంటుంది. ఈ నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీ విభాగం ఒక హెచ్చరికను జారీ చేసింది. కేవలం అధికారిక ఈపీఎఫ్ వెబ్‌సైట్‌ను మాత్రమే ఉపయోగించాలని, ఎలాంటి మోసపూరిత వెబ్‌సైట్‌లను క్లిక్ చేయకూడదని సూచించింది. ఒకవేళ మీరు ఏదైనా అనుమానాస్పద వెబ్‌సైట్‌లో మీ UAN, పాస్‌వర్డ్, OTP, ఆధార్ లేదా బ్యాంక్ వివరాలను నమోదు చేస్తే, మీ ఖాతాలోని డబ్బు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకోవడం చాలా అవసరం.

Written ByRenuka Godugu
Published: Oct 08, 2026, 05:02 PM IST|Updated: Oct 08, 2026, 05:06 PM IST
joinshare
EPFO అత్యవసర సెక్యూరిటీ అలర్ట్! ఈ 4 వివరాలు ఎవరికీ చెప్పకండి.. ఖాతా ఖాళీ అవుతుంది!
Image Credit: EPFO Security Advisory:

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
హౌతీలపై యుద్ధానికి 20 వేల మంది సిరియా సైనికులు? సౌదీ ప్లాన్ ఇదే!

హౌతీలపై యుద్ధానికి 20 వేల మంది సిరియా సైనికులు? సౌదీ ప్లాన్ ఇదే!

2

EPFO అత్యవసర సెక్యూరిటీ అలర్ట్! ఈ 4 వివరాలు ఎవరికీ చెప్పకండి.. ఖాతా ఖాళీ అవుతుంది!

3

Ajit Agarkar Salary: చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్ జీతం ఎంతంటే..? మొత్తం ఆస్తుల విలువ తెలుసా..!

4

Donald Trump: 'నేను 8 యుద్ధాలు ఆపాను. నాకే నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి': డొనల్డ్‌ ట్రంప్‌

5

ఇదేం అరాచకం సామి.. ప్రేక్షకులపై పగపట్టిన కమల్, శంకర్‌లు ..! ‘భారతీయుడు 3’తో సాధించేదేమిటి..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

EPFO Security Advisory: ప్రతి నెలా ఉద్యోగుల జీతం నుండి కొంత మొత్తం ఈపీఎఫ్ఓ కి జమ అవుతుంది. ఇందులో యజమాని, ఉద్యోగి ఇద్దరి వాటాలు ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో, ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇల్లు కట్టుకోవడం, ఇంటి మరమ్మతులు లేదా చదువుల కోసం ఈ డబ్బు ఎంతో ఉపయోగపడుతుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం వడ్డీని కూడా అందిస్తుంది. ఉద్యోగులు ప్రతి నెలా తమ డబ్బుల వివరాలను చూసుకుంటూ ఉంటారు. కాబట్టి సైబర్ సెక్యూరిటీ విభాగం ఈ అడ్వైజరీని జారీ చేసింది. కేవలం అధికారిక ఈపీఎఫ్ వెబ్‌సైట్‌ https://www.epfindia.gov.in
ను మాత్రమే ఓపెన్ చేయాలి. ఎలాంటి సందేహాస్పద వెబ్‌సైట్‌లను చూడకూడదు. అందులో పాస్‌వర్డ్, OTP, ఆధార్ లేదా బ్యాంక్ వివరాలను నమోదు చేయవద్దని X (ట్విట్టర్) వేదికగా ఈపీఎఫ్ఓ హెచ్చరించింది.

ఏదైనా మోసపూరిత లింకులు వస్తే వాటిని క్లిక్ చేయవద్దని, పొరపాటున కూడా ఇతరులకు షేర్ చేయవద్దని ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు సూచించింది. కేవలం అధికారిక వెబ్‌సైట్‌లు అయిన epfindia.gov.in లేదా epfo.gov.in మాత్రమే ఉపయోగించాలని తెలిపింది. ఈపీఎఫ్ఓ పేరుతో వచ్చే అన్-వెరిఫైడ్ మెయిల్స్, మెసేజ్‌లు లేదా సోషల్ మీడియా లింక్‌లను క్లిక్ చేయకూడదు. అలాగే, అనధికారిక వెబ్‌సైట్‌లలో పాస్‌వర్డ్, ఆధార్, బ్యాంక్ వివరాలు, OTPలను అస్సలు షేర్ చేయవద్దని ఆదేశించింది.

Read Also: రైలు టికెట్ బుకింగ్‌లో బిగ్ చేంజ్.. దశాబ్దాల తర్వాత PNR విధానంలో మార్పు! ఏం మారనుంది తెలుసా?
 

 

⚠️ साइबर सुरक्षा सलाह: केवल EPFO की आधिकारिक वेबसाइट का उपयोग करें और किसी भी संदिग्ध लिंक पर क्लिक न करें। अपना UAN, पासवर्ड, OTP, आधार, PAN या बैंक विवरण किसी के साथ साझा न करें। सतर्क रहें, सुरक्षित रहें। #FraudAlert #EPFO #EPFOWithYou #HumHainNa #ईपीएफओ https://t.co/sADqLtFKQq

— EPFO (@officialepfo) October 7, 2026

 

ఈపీఎఫ్ లాగిన్ అయ్యే ముందు వెబ్‌సైట్ URL సరిగ్గా ఉందో లేదో తనిఖీ చేసుకోండి. ఏదైనా వెబ్‌సైట్ అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే రిపోర్ట్ చేయండి. ఎందుకంటే అటువంటి సైట్‌లలో ఫిషింగ్ జరిగే అవకాశం ఉంది. అధికారిక సంస్థలు ఫోన్ కాల్స్, వాట్సాప్, మెయిల్స్ లేదా లాగిన్ వివరాల ద్వారా మీ వ్యక్తిగత వివరాలను, OTPలను అడగవు. కాబట్టి, ఇలాంటి మోసపూరిత సందేశాలు వచ్చినప్పుడు వాటిని క్లిక్ చేయకుండా సైబర్ సెక్యూరిటీ అధికారులకు సమాచారం అందించడం మంచిది.

Add Zee News as a Preferred Source
TAGS:
EPFO