భారతీయ రైల్వే టిక్కెట్‌పై పీఎన్‌ఆర్ నెంబర్ ఉంటుంది. దీని ద్వారా మీ రైలు స్టేటస్, సీట్, ఫుడ్ బుకింగ్ కూడా చేయవచ్చు. అయితే, ఇండియన్ రైల్వే సంచలన నిర్ణయం తీసుకుంది. టిక్కెట్ బుకింగ్ విధానంలో భారీ మార్పు రానుంది. దశాబ్దాల తర్వాత పీఎన్‌ఆర్ నిబంధనల్లో మార్పు తీసుకురానుంది. డిసెంబర్ నుంచి పీఎన్‌ఆర్ సిరీస్‌లో మార్పులు తీసుకు రానున్నారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
1/5
రైల్వే
భారతీయ రైల్వే అతిపెద్ద రవాణా వ్యవస్థ.. ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేస్తూ సేవలను అందిస్తోంది. అయితే, ఇటీవల పైలట్ ప్రాజెక్టున 14210 పీఎన్‌ఆర్ సిరీస్‌లో మార్పులు చేసింది. దీనిపై PNR500 చేర్చింది.
2/5
రైల్వే PNR నిబంధన
డిసెంబర్ నుంచి అన్ని రైళ్లపై ఇక 1,3,5,7 తో బేసి సంఖ్యలతో ప్రారంభం కానుంది. ఇప్పుడున్న పీఎన్‌ఆర్ మొదటి మూడు అక్షరాలు ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబై డేటాబేస్ కలిగి ఉంటుంది.
3/5
రైల్వే PNR నిబంధనల మార్పు
అయితే దశాబ్దాలుగా ఉన్న వ్యవస్థలో మార్పులు చేస్తున్నారు. ఇప్పటికే రిజర్వేషన్ వ్యవస్థను కూడా ఆధునీకరించారు. దీనికి పాత పీఎన్‌ఆర్ నెంబర్‌లు కూడా అడ్డుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటిని కూడా మారుస్తున్నారు.
4/5
IRCTC కొత్త రూల్స్,
అయితే, పాత పద్ధతిలో టిక్కెట్ బుక్ చేఉకుని ప్రయాణం చేయాల్సిన వారు.. ఏదైనా కారణాల వల్ల తేదీ మార్చాలనుంటే కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రైల్వే ప్రయాణం చేసివారు తమ టిక్కెట్‌న్ కేన్సల్ చేసి మళ్లీ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
5/5
రైల్వే రిజర్వేషన్
ఇక భారతీయ రైల్వే ప్రయాణంలో 60 రోజులు ముందుగానే టిక్కెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. తత్కాల్ టిక్కెట్‌లు కూడా ఒక రోజు ముందుగా విడుదల చేస్తారు. కానీ, వాటిని బుక్ చేసుకోవడం అంత ఈజీ కాదు.