EPFO అత్యవసర సెక్యూరిటీ అలర్ట్! ఈ 4 వివరాలు ఎవరికీ చెప్పకండి.. ఖాతా ఖాళీ అవుతుంది!
ప్రైవేటు రంగంలో పనిచేసే ప్రతి ఉద్యోగికి ఈపీఎఫ్ఓ ఖాతా ఉంటుంది. ఈ నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీ విభాగం ఒక హెచ్చరికను జారీ చేసింది. కేవలం అధికారిక ఈపీఎఫ్ వెబ్‌సైట్‌ను మాత్రమే ఉపయోగించాలని, ఎలాంటి మోసపూరిత వెబ్‌సైట్‌లను క్లిక్ చేయకూడదని సూచించింది. ఒకవేళ మీరు ఏదైనా అనుమానాస్పద వెబ్‌సైట్‌లో మీ UAN, పాస్‌వర్డ్, OTP, ఆధార్ లేదా బ్యాంక్ వివరాలను నమోదు చేస్తే, మీ ఖాతాలోని డబ్బు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకోవడం చాలా అవసరం.
EPFO Security Advisory: ప్రతి నెలా ఉద్యోగుల జీతం నుండి కొంత మొత్తం ఈపీఎఫ్ఓ కి జమ అవుతుంది. ఇందులో యజమాని, ఉద్యోగి ఇద్దరి వాటాలు ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో, ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇల్లు కట్టుకోవడం, ఇంటి మరమ్మతులు లేదా చదువుల కోసం ఈ డబ్బు ఎంతో ఉపయోగపడుతుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం వడ్డీని కూడా అందిస్తుంది. ఉద్యోగులు ప్రతి నెలా తమ డబ్బుల వివరాలను చూసుకుంటూ ఉంటారు. కాబట్టి సైబర్ సెక్యూరిటీ విభాగం ఈ అడ్వైజరీని జారీ చేసింది. కేవలం అధికారిక ఈపీఎఫ్ వెబ్‌సైట్ https://www.epfindia.gov.in
ను మాత్రమే ఓపెన్ చేయాలి. ఎలాంటి సందేహాస్పద వెబ్‌సైట్‌లను చూడకూడదు. అందులో పాస్‌వర్డ్, OTP, ఆధార్ లేదా బ్యాంక్ వివరాలను నమోదు చేయవద్దని X (ట్విట్టర్) వేదికగా ఈపీఎఫ్ఓ హెచ్చరించింది.
ఏదైనా మోసపూరిత లింకులు వస్తే వాటిని క్లిక్ చేయవద్దని, పొరపాటున కూడా ఇతరులకు షేర్ చేయవద్దని ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు సూచించింది. కేవలం అధికారిక వెబ్‌సైట్‌లు అయిన epfindia.gov.in లేదా epfo.gov.in మాత్రమే ఉపయోగించాలని తెలిపింది. ఈపీఎఫ్ఓ పేరుతో వచ్చే అన్-వెరిఫైడ్ మెయిల్స్, మెసేజ్‌లు లేదా సోషల్ మీడియా లింక్‌లను క్లిక్ చేయకూడదు. అలాగే, అనధికారిక వెబ్‌సైట్‌లలో పాస్‌వర్డ్, ఆధార్, బ్యాంక్ వివరాలు, OTPలను అస్సలు షేర్ చేయవద్దని ఆదేశించింది.
Read Also: రైలు టికెట్ బుకింగ్‌లో బిగ్ చేంజ్.. దశాబ్దాల తర్వాత PNR విధానంలో మార్పు! ఏం మారనుంది తెలుసా?
ఈపీఎఫ్ లాగిన్ అయ్యే ముందు వెబ్‌సైట్ URL సరిగ్గా ఉందో లేదో తనిఖీ చేసుకోండి. ఏదైనా వెబ్‌సైట్ అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే రిపోర్ట్ చేయండి. ఎందుకంటే అటువంటి సైట్‌లలో ఫిషింగ్ జరిగే అవకాశం ఉంది. అధికారిక సంస్థలు ఫోన్ కాల్స్, వాట్సాప్, మెయిల్స్ లేదా లాగిన్ వివరాల ద్వారా మీ వ్యక్తిగత వివరాలను, OTPలను అడగవు. కాబట్టి, ఇలాంటి మోసపూరిత సందేశాలు వచ్చినప్పుడు వాటిని క్లిక్ చేయకుండా సైబర్ సెక్యూరిటీ అధికారులకు సమాచారం అందించడం మంచిది.