• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /గుజరాత్‌లో మైనర్ బాలికపై తండ్రి అఘాయిత్యం.. ఛీఛీ.. వీడియోలు తీసిన తల్లి!

గుజరాత్‌లో మైనర్ బాలికపై తండ్రి అఘాయిత్యం.. ఛీఛీ.. వీడియోలు తీసిన తల్లి!

Gujarat Minor Case: కన్న కూతురును కంటికి రెప్పలా కాపాడాల్సిన ఒక తండ్రి కసాయిలా మారిపోయాడు. కూతురు వేరే అబ్బాయితో ఫోన్లో మాట్లాడుతుందనే కోపంతో ఏకంగా ఒక రూమ్‌లో బంధించి.. ఆ మైనర్ బాలికపై లైం**గిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ఈ సమయంలో తల్లి ఆ వీడియోలను చిత్రీకరిస్తూ ఆనందించిందట. ఈ ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది.

Reported ByDharmaraju Dhurishetty
Published: Oct 06, 2026, 01:20 PM IST|Updated: Oct 06, 2026, 01:22 PM IST
joinshare
గుజరాత్‌లో మైనర్ బాలికపై తండ్రి అఘాయిత్యం.. ఛీఛీ.. వీడియోలు తీసిన తల్లి!
Image Credit: జీ తెలుగు న్యూస్

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
బెంగళూరు ట్రాఫిక్ దెబ్బ.. విద్యార్థులు ఏడాదికి 53 స్కూల్ డేస్ రోడ్లపైనే!

బెంగళూరు ట్రాఫిక్ దెబ్బ.. విద్యార్థులు ఏడాదికి 53 స్కూల్ డేస్ రోడ్లపైనే!

2

జ్ఞానానికి మించిన సంపద లేదు.. తండ్రి మనసు గెలుచుకున్న చిన్న కొడుకు కథ!

3

నల్లనాగుతో యువకుడి ఆటలు.. ఒక్కసారిగా పడగవిప్పి ముఖంపై దాడి.. వీడియో!

4

చిన్ననాటి వేధింపుల కోపం.. 75 ఏళ్ల తాతను క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చం**పిన 20 ఏళ్ల మనవరాలు!

5

ఆశ, అసూయ మనుషులను ఎలా నాశనం చేస్తాయో తెలిపే "భార్య అత్యాశ" నీతి కథ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gujarat Minor Case In Telugu: రక్త సంబంధానికే.. మచ్చ తెచ్చి అత్యంత హీనమైన ఘటన గుజరాత్ లోని కచ్ జిల్లాలో వెలుగు చూసింది. కంటికి రెప్పలా.. కాలికి ముల్లు గుచ్చకుండా.. కాపాడాల్సిన కన్నవారే ఆ బాలిక పాలిట శత్రువులుగా మారిపోయారు.. 14 ఏళ్ల మైనర్ కుమార్తె పై. తండ్రి లైం**గిక దాడికి పాల్పడగా.. ఆ దారుణాన్ని అడ్డుకోవాల్సిన తల్లి.. స్వయంగా వీడియోలు, ఫోటోలు తీసి హీనమైన చర్యకు పాల్పడింది.. బాధితురాలు ఎంతో ధైర్యం చేసి.. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అధికారులు రంగంలోకి దిగి నిందితులైన దంపతులను అరెస్టు చేశారు.

పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. అంజార్ డివిజన్ పరిధిలో ఎప్పటినుంచో నివాసం ఉంటున్న ఈ కుటుంబంలో కొద్దిరోజుల క్రితం ఒక వివాదం ప్రారంభమైంది.. బాలిక ఆగ్రాకు చెందిన ఒక బాలుడితో ఫోన్లో తరచుగా మాట్లాడుతుందని.. తల్లి గమనిస్తూ వచ్చిందట.. ఈ విషయాన్ని భర్తకు చెప్పడంతో ఆగ్రహంతో ఆ మైనర్ బాలిక తండ్రి.. చేతిలోని మొబైల్‌ను పగలగొట్టి.. అనంతరం ఆమెను ఇంట్లోనే బంధించి బయటకు వెళ్లకుండా కట్టడి చేశారట..

అంతేకాకుండా అక్కడితో ఆగకుండా.. బాధితురానికి పచ్చి మంచినీరు కూడా అందించకుండా తీవ్రంగా శారీరక చిత్రహింసలకు కూడా గురి చేశారట.. ఈ క్రమంలోనే తండ్రి ఆ మైనర్ బాలికపై ఎన్నోసార్లు లైం**గిక దాడికి పాల్పడినట్లు దర్యాప్తులో భాగంగా తేలింది. ఈ దారుణం జరుగుతున్న సమయంలో తల్లి ఏమాత్రం కన్నబిడ్డ అని అడ్డుకోకుండా. తన ఫోన్లో ఆధారమైన దృశ్యాలను రికార్డు చేసిందట..

తల్లిదండ్రుల ఈ దారుణమైన వేధింపులు భరించలేక ఆ మైనర్ బాలిక.. ఇటీవల వారి కళ్ళు కప్పి ఇంట్లో నుంచి పరారైపోయింది.  నేరుగా సమీపంలోని బంధువుల ఇంటికి చేరుకొని జరిగిన ఘోరాన్ని వివరించింది. వెంటనే వారు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు.. అయితే, అంజార్ పోలీసులు వెంటనే స్పందించి బాలికను సురక్షితమైన ప్రాంతానికి తరలించారట. అనంతరం ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. బాధితురాని వాంగ్మూలం ఆధారంగా తల్లిదండ్రులపై ప్రత్యేకమైన చట్టాల కింద కేసు నమోదు చేశారు.

అంతేకాకుండా తండ్రి పై పోక్సో చట్టం కింద కఠినమైన కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. అలాగే నిందితులను ఇద్దరిని అరెస్టు చేసి పోలీసులు.. నేరానికి సంబంధించిన కీలకమైన ఆధారాలతో ఉన్న స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఇతర ఎలక్ట్రిక్ పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.. అంతేకాకుండా ఈ ఘటనపై ఉన్నతమైన పోలీసు అధికారులు సమగ్ర దర్యాప్తును కూడా కొనసాగించమని ఆర్డర్స్ వేసినట్లు తెలుస్తోంది.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Trending News