SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

సముద్రంపై సరికొత్త అద్భుతం.. ఆకాశంలో 1500 డ్రోన్‌లతో వెల్‌కమ్! కార్డెలియా స్కై లగ్జరీ లైనర్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

కార్డేలియా స్కై ముంబై చేరుకున్న విషయం తెలిసిందే. మొత్తం 2400 మందికి పైగా ప్రయాణించే అత్యంత లగ్జరీ క్రూయిజ్ కోసం 1500 డ్రోన్లతో గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు. కార్డేలియా స్కై ముంబైలో అడుగుపెట్టింది, ప్రస్తుతం రెండు నౌకలను నడుపుతోంది. సముద్రంపై అద్భుతమైన టెక్నాలజీతో కూడిన ఈ క్రూయిజ్ ప్రారంభోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ముఖ్య అతిథులు, వ్యాపార భాగస్వాములు, మీడియా ప్రతినిధులు ముంబైలోని మహాలక్ష్మి రేస్‌కోర్స్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 1500 డ్రోన్ల నృత్య ప్రదర్శన ద్వారా దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ఆకాశంలో కార్డేలియా స్కై కు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.

Written By Renuka Godugu
Published: Oct 11, 2026, 08:25 PM IST | Updated: Oct 11, 2026, 08:31 PM IST
Image Credit: Floating Luxury Redefined Cordelia Sky
Join

కార్డేలియా క్రూయిజ్‌కు ఆకాశ కాంతులతో కూడిన డ్రోన్ షో ద్వారా ఘనస్వాగతం పలికారు. ఐదేళ్ల తర్వాత, కార్డేలియా క్రూయిజ్ ఇప్పుడు రెండు నౌకల సంస్థగా రూపాంతరం చెందడం విశేషం. మూడవ  క్రూయిజ్ కూడా రాబోతోంది. 2027లోకార్డేలియా సన్ గా కంపెనీగా ప్రకటించడంతో, మన దేశంలో అత్యంత లగ్జరీ క్రూయిజ్ నౌకల సంఖ్య మూడుకి చేరుకోనుంది. ఈ సమావేశంలో సీఈఓ జుర్గెన్ బైలోమ్ మాట్లాడుతూ, ఐదేళ్ల క్రితం కార్డేలియాను ప్రారంభించామని, ప్రతి భారతీయుడు ఈ లగ్జరీ క్రూయిజ్ ప్రయాణాన్ని ఒక ఉత్తమ ఎంపికగా మార్చుకోవాలని ఆకాంక్షించారు.

2021లో సేవలు ప్రారంభించినప్పటి నుండి ఇప్పటివరకు దాదాపు 8 లక్షల మంది ప్రయాణికులకు స్వాగతం పలికారు. ఇప్పుడు కార్డేలియా స్కై కూడా ఆ జాబితాలో చేరింది. రెండు కార్డేలియా ఎంప్రెస్స్ నౌకలు కలిపి సుమారు 3,596 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలవు. ఇక మూడవ తరం కార్డేలియా సన్ కూడా 2027 నాటికి రానుంది.

కార్డేలియాస్కై 2026 అక్టోబర్ 23 నుంచి ముంబై నుండి ప్రయాణం ప్రారంభిస్తుంది. ఇది సముద్రంలో రెండు రాత్రులు గడుపుతూ గోవా, లక్షద్వీప్ మార్గాల్లో విహారయాత్రను అందిస్తుంది. అలాగే చెన్నై నుండి బయలుదేరి ఫుకెట్, లాంగ్ కాకీ, కౌలాలంపూర్, సింగపూర్ వంటి ప్రాంతాలను సందర్శించే ఏడు రాత్రుల అంతర్జాతీయ ప్రయాణం కూడా అందుబాటులో ఉంటుంది.

Read Also: సముద్రంలో తేలియాడే విహార ప్రపంచం.. భారత్‌లో సరికొత్త టూరిజం విప్లవం! ముంబై చేరుకున్న లగ్జరీ క్రూయిజ్ 'కార్డెలియా స్కై'!
 

 

ప్రస్తుతం కార్డేలియా స్కై ముంబైని తన మొదటి హోమ్ పోర్టుగా చేసుకుంది. ఇందులో 2,400 మంది ప్రయాణికులు వెళ్లవచ్చు. 77 వేలకుపైగా డెక్‌లు, 11 బార్లు, 10 ఫుడ్ డ్రింకింగ్ వేదికలతో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. పిల్లల కోసం ప్రత్యేక గేమింగ్ జోన్స్, ఎంటర్టైన్మెంట్, స్విమ్మింగ్ పూల్స్, స్పోర్ట్స్ జోన్స్ అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు మ్యూజికల్ థియేటర్లు, పికిల్ బాల్, ఫిట్నెస్ సెంటర్లు కూడా ఉన్నాయి. లగ్జరీ సూట్స్, మినీ సూట్స్, ఇంటీరియర్ క్యాబిన్ల సౌకర్యం కలదు. ఈ క్రూయిజ్ అనుభవం పొందాలంటే తప్పక కార్డేలియా ఎక్కాల్సిందే. విదేశాలకు వెళ్లకుండానే మన భారతదేశంలో లగ్జరీ క్రూయిజ్ ఎంజాయ్ చేయవచ్చు. ఇక్కడ ఇండియన్, ఇటాలియన్ ఫుడ్ కూడా అందుబాటులో ఉంటుంది. ప్రయాణికుల అభిరుచికి తగ్గట్లుగా మరువలేని రుచికరమైన భోజనాన్ని, అత్యధిక లాంజ్‌లను ఇది అందిస్తుంది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES