• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /సముద్రంలో తేలియాడే విహార ప్రపంచం.. భారత్‌లో సరికొత్త టూరిజం విప్లవం! ముంబై చేరుకున్న లగ్జరీ క్రూయిజ్ 'కార్డెలియా స్కై'!

సముద్రంలో తేలియాడే విహార ప్రపంచం.. భారత్‌లో సరికొత్త టూరిజం విప్లవం! ముంబై చేరుకున్న లగ్జరీ క్రూయిజ్ 'కార్డెలియా స్కై'!

భారత పర్యాటకానికి మరో విశిష్ట అనుభవం లభించనుంది.. అదే కార్డేలియా స్కై రెండో నౌక ముంబైకి చేరుకుంది. ఇందులో మొత్తం 2400 మంది పైగా విలాసవంతంగా ప్రయాణించవచ్చు. లగ్జరీ గదులతో పాటు బార్లు, స్విమ్మింగ్ పూల్స్ ఇతర గేమ్స్ జోన్స్ కూడా ఉన్నాయి. మొత్తానికి సముద్రంలో తేలియాడే ఒక అద్భుతమైన ప్రపంచం అని చెప్పవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

Written ByRenuka Godugu
Published: Oct 11, 2026, 07:58 AM IST|Updated: Oct 11, 2026, 08:05 AM IST
joinshare
సముద్రంలో తేలియాడే విహార ప్రపంచం.. భారత్‌లో సరికొత్త టూరిజం విప్లవం! ముంబై చేరుకున్న లగ్జరీ క్రూయిజ్ 'కార్డెలియా స్కై'!
Image Credit: Cordelia Sky Mumbai

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
సముద్రంలో తేలియాడే విహార ప్రపంచం.. భారత్‌లో సరికొత్త టూరిజం విప్లవం! ముంబై చేరుకున్న లగ్జరీ క్రూయిజ్ 'కార్డెలియా స్కై'!

సముద్రంలో తేలియాడే విహార ప్రపంచం.. భారత్‌లో సరికొత్త టూరిజం విప్లవం! ముంబై చేరుకున్న లగ్జరీ క్రూయిజ్ 'కార్డెలియా స్కై'!

2

టాలీవుడ్‌లో నెగెటివ్ ప్రాపగాండా.. కులం, ప్రాంతం పేరుతో విభజన ఎందుకు?

3

‘జైలర్ 2’ టికెట్ రేట్స్ హైక్స్.. తమిళనాడులో కంటే ఏపీ, తెలంగాణలోనే ఎక్కువ రేట్లు.. ఏంటి రాజా ఇది..!

4

అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ సినిమా ఆగిపోయిందా..? అసలేం జరగుతుంది..?

5

Kidnap Gang: బాలికలను కిడ్నాప్‌ చేసి బలవంతంగా పడుపు వృత్తిలోకి.. అతిపెద్ద గ్యాంగ్‌ అరెస్ట్‌

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ట్రావెలింగ్ అంటే ఇష్టం లేని వారు చాలా తక్కువగా ఉంటారు. ఎప్పుడూ రైలు, బస్సు లేదా విమాన ప్రయాణం మాత్రమే కాకుండా, సముద్ర తీరాన సేదతీరుతూ ప్రయాణించాలని చాలామంది అనుకుంటారు. అయితే, ముంబై వేదికగా కార్డేలియా స్కై ఇదివరకు కొద్దిమంది మాత్రమే అనుభవించారు. భారత క్రూయిజ్ పరిశ్రమలో ఇప్పుడు మరో కొత్త అధ్యాయం ప్రారంభమైంది.. రెండో క్రూయిజ్ నౌక ముంబైకి చేరుకుంది. క్రూజ్ ప్రయాణం చేయాలని చాలామంది కోరుకుంటారు. ఇదివరకు కేవలం క్రూయిజ్‌ జర్నీ అంటే బ్యాంకాక్‌ ఇతర బయట దేశాల్లో మాత్రమే లభించే ఈ అనుభవం. ఇప్పుడు ముంబైకి కూడా అందుబాటులోకి వచ్చింది.  సముద్ర మార్గంలో క్రూయిజ్‌లో ప్రయాణించాలని కోరుకునే వారి కోసం ఈ అద్భుతమైన క్రూయిజ్. ఇది కార్డేలియాకు చెందిన రెండో నౌక రాకతో ప్రయాణ సామర్థ్యం మరింత పెరగనుంది. దీనివల్ల మరింత మంది ప్రయాణించవచ్చు. మన దేశంలోని క్రూయిజ్ పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. ఐదేళ్ల తర్వాత కార్డేలియా స్కై రాక సాధ్యమైంది. అంతకుముందు కడేలియా ఎంప్రెస్స్ నౌక వచ్చింది. ఇది రెండో నౌక.

కార్డేలియా స్కై ప్రత్యేకతలు ఇవే..
కార్డేలియాకు చెందిన ఈ రెండో నౌక రాకతో మరింత మంది దీని అనుభవాన్ని పొందవచ్చు. ఈ క్రూయిజ్‌ సామర్థ్యం ప్రకారం మొత్తం 2400 మంది ప్రయాణికులు సులభంగా ప్రయాణించవచ్చు. ఇందులో మొత్తం 77,104 డెక్లు, 11 బార్లు, 10 ఫుడ్‌, డ్రింకింగ్‌ వేదికలు ఉన్నాయి. అత్యాధునిక లాంజ్‌లలో కేవలం భారతీయ వంటకాల మాత్రమే కాదు.. ఇటాలియన్, జపనీస్ వంటి రుచికరమైన వంటకాలను ప్రయాణికులకు బఫె రెస్టారెంట్లు, కెఫేల అనుభవాన్ని కూడా ఇస్తాయి. సముద్ర వీక్షణతో కూడిన భోజన సేవలను కూడా ఈ కార్డేలియా క్రూయిజ్ అందిస్తుంది.  క్రూయిజ్‌ ప్రయాణం మరువలేని జ్ఞాపకం. ఇదివరకు క్రూయిజ్‌లో ప్రయాణించిన వారు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు, వీడియోలు మీరు చూసే ఉంటారు. మీరు కూడా అలాంటి అనుభవాన్ని పొందాలనుకుంటే ఇది ఒక గొప్ప అవకాశం.

ఈ కార్డేలియా స్కైలో మొత్తం రెండు స్విమ్మింగ్ పూల్స్, 5 హాట్ టబ్స్‌, 30,000 చదరపు అడుగుల డెక్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ కోసం 930 సీట్ల మ్యూజికల్ థియేటర్, స్పోర్ట్స్ కోట్స్, పికిల్‌బాల్ ,ఫిట్‌నెస్ సెంటర్, పిల్లలకు ప్రత్యేకమైన గేమ్ జోన్స్‌ కూడా ఉన్నాయి. సముద్ర వీక్షణతో కూడిన లగ్జరీ సూట్స్, మినీ సూట్స్ , ఇంటీరియర్ క్యాబిన్‌లతో మంచి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి.

 

లాభాల బాటలోకి కార్డేలియా..
గతంలో నష్టాలు అనుభవించిన కార్డేలియా.. ఈ క్రూయిజ్‌ల రాకతో లాభాల బాటలోకి వెళ్ళింది. మాతృ సంస్థ వాటర్ వేస్ లీజర్ టూరిజం ప్రైవేట్ లిమిటెడ్, గత త్రైమాసికంలో రూ.8.9 కోట్ల నికర నష్టాన్ని చూసింది. కానీ ఇప్పుడు రూ.58.5 కోట్ల లాభాన్ని ఆర్జిస్తోంది. అంటే గత ఆదాయం రూ.101.5 కోట్ల నుండి రూ.132.9 కోట్లకు పెరిగింది. మొత్తం 31 శాతం పెరుగుదల. 

Add Zee News as a Preferred Source
TAGS:
National News