SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Frog VS Snake Video: ఇదెక్కడి విడ్డూరం.. పామును గుటుక్కున మింగిన భారీ కప్ప.. వీడియో వైరల్..

Frog swallowing Snake video: డ్రైనేజీ ఛాంబర్ వద్ద ఒక భారీ కప్ప పాముపై దాడి చేసింది. దీంతో ఇంట్లో వాళ్లు ఈ శబ్దాలు ఏంటని చూడగా అప్పటికే కప్ప పామును గుటుక్కున మింగేసింది. భద్రాద్రి కొత్త గూడెంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్గా మారింది.

Written By Inamdar Paresh
Published: Nov 17, 2026, 19:19 IST | Updated: Nov 17, 2026, 19:27 IST
Image Credit: frog attacks on snake video
Join

Frog swallowing large rat snake bhadradri kothagudem: పాములకు చెందిన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. నెటిజన్లు కూడా వీటిని చాలా ఆసక్తిగా చూస్తున్నారు. అందుకే ఒకప్పుడు పాములంటే భయంతో పారిపోయిన వారంతా ప్రస్తుతం వాటితో స్టంట్ లు చేస్తున్నారు. కోబ్రాలు కన్పిస్తే పొరపాటున కూడా వదలడంలేదు. వీడియోలు, రీల్స్ చేస్తున్నారు. తమ పైత్యంతో వారి ప్రాణాల్ని సైతం డెంజర్ లోకి నెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో భద్రాద్రికొత్త గూడెంలో భారీ సర్పంను కప్ప రెప్పపాటులో మింగేసింది. నార్మల్ గా కప్ప మీద పాము దాడి చేయడం మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ సీన్ పూర్తిగా రివర్స్ లా మారింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది.

 

 


భద్రాద్రి కొత్త గూడెంలోని బూర్గంపాడులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.  స్థానికంగా ఉండే సారయ్య అనే వ్యక్తి తన ఇంట్లోని ఆవరణలో భారీ శబ్దాలు రావడంను గమనించాడు. వెంటనే అలర్ట్ అయి డ్రైనేజీ ఛాంబర్ వద్ద వెళ్లి చూశాడు. అక్కడ భారీ కప్ప పామును మింగుతుండం చూసి ఆశ్చర్యపోయాడు. 

అది దాని నుంచి విడిపించుకుందామని చూసి సాధ్యపడట్లేదు. వెంటనే అతను తన ఫోన్ లో కప్ప పామును మింగుతున్న ఘటనను వీడియో తీసుకున్నాడు. తొలుత అసలు పాము కాదని భావించారు. కానీ జాగ్రత్తగా చూసేసరికి అది పాముగా గుర్తించి బాబోయ్ అంటూషాక్ అయ్యారు.  ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES