Giant Anaconda Video: నిత్యం సోషల్ మీడియాలో ఎన్నో వింతలతో పాటు విశేషాలకు సంబంధించిన వీడియోలు మనం చూస్తూనే ఉంటాం. వాటిలో కొన్ని నవ్వులు నవ్వులు పుట్టిస్తుంటే.. మరికొన్ని మాత్రం వెన్నులో వణుకు పుట్టిస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. తాజాగా నెట్టింట చెక్కర్లు కొడుతున్న ఒక వీడియో చూస్తే ఎవరికైనా భయం పుట్టక మానదు.. సాధారణంగా చిన్న పాము పిల్ల కనిపిస్తేనే ఆమడ పరుగో.. పరుగు.. అంటూ పరుగులు తీస్తూ ఉంటారు.. కానీ ఓ యువకుడు మాత్రం దీనికి భిన్నంగా ఉన్నాడు. ఏకంగా ఒక ప్రమాదకరమైన భారీ అనకుండా తో కలిసి ఒకే మంచం పై నిద్రపోతూ ఉండడానికి సంబంధించిన వీడియో అందర్నీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వైరల్ అవుతున్న ఈ వీడియోను క్లియర్గా పరిశీలించి చూస్తే.. ఒక గదిలోని బెడ్ పై యువకుడు ప్రశాంతంగా పడుకొని ఉండడం మీరు గమనించవచ్చు.. అయితే, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అతడితో పాటే అదే మంచం పై సుమారు 30 అడుగులు కలిగిన అత్యంత పొడవు ఉన్న ఒక భారీ రాకాసి అనకొండ పాము కూడా ఉండడం మీరు చూడొచ్చు. ఆ యువకుడు ఏమాత్రం భయం.. బెదురు లేకుండా ప్రమాదకరమైన భారీ పాము శరీరాన్ని తన ఒంటిపై వేసుకొని హాయిగా సేద తీరుతూ ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతటి భారీ అనకుండా నెమ్మదిగా కదులుతూ అతడి శరీరంపై పాకుతూ అటు ఇటు వెళ్లడం మీరు క్లియర్‌గా చూడొచ్చు..
ఈ వీడియో సోషల్ మీడియా ఫ్లాట్‌ఫార్మ్స్‌లో విపరీతంగా వైరల్ అవుతుంది.. అప్లోడ్ చేసిన కొన్ని రోజుల్లోనే లక్షలాది వ్యూస్ అందుకుంది. అంతేకాకుండా వేల సంఖ్యలో షేర్లతో విపరీతంగా ట్రెండ్ అవుతూ వస్తుంది.. అతి పెద్ద అనకొండ పాము, మనిషికి ఎంతో దగ్గరగా ఉన్న దృశ్యాలను చూసి సోషల్ మీడియా వినియోగదారులు షాక్ అయిపోతున్నారు. అంతేకాకుండా చాలామంది వారి అభిప్రాయాలను కామెంట్లలో పంచుకుంటున్నారు.. యువకుడితో సరసాలు అంటే ఇదేనేమో అంటూ కొంతమంది కామెంట్ చేస్తుంటే.. ఇవి పెంపుడు పాములైనప్పటికీ ఇలాంటి వాటితో తప్పకుండా ఎంతో జాగ్రత్తగా ఉండాలని కొంతమంది కామెంట్లలో సూచిస్తూ ఉన్నారు..
ప్రస్తుతం చాలామంది ఇలా పాములను పట్టుకొని వ్యూస్ కోసం పడరాని పాట్లు పడుతున్నారని.. ఇలాంటి క్రమంలోనే కొంతమంది వాటి కాటు బారినపడి.. మరికొంతమంది అవి చుట్టుకొని చనిపోతున్నారని నిపుణులు తెలుపుతున్నారు. న్యూస్ కోసం ఇలాంటి ప్రాణాపాయక సాహసాలు చేయడం మాత్రం మంచిది కాదని పలువురు సోషల్ మీడియా వినియోగదారులు తీవ్రంగా హెచ్చరిస్తూ వస్తున్నారు. ఇలాంటి అత్యంత శక్తివంతమైన కండరాలు కలిగిన అనకొండలు ఎప్పుడైనా మనుషులాపై దాడి చేసే అవకాశాలు ఉన్నాయని.. ఇలాంటి పాములతో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తూ వస్తున్నారు..