Video Viral: మరో యువతితో ప్రియుడి డ్యాన్స్.. స్టేజీ మీద వచ్చి ప్రియురాలి రచ్చ రంబోలా.. వీడియో వైరల్..
Girl dance video row: తన ప్రియుడు మరో యువతితో డ్యాన్స్ చేయడంను ఆ ప్రియురాలు సహించలేక పోయింది. అతనిపై కోపంతో ఏకంగాస్టేజీ మీద ఎక్కింది. ఆతర్వాత చుక్కలు చూపించింది. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
Girl beats her boy friend funny video viral: సోషల్ మీడియాలో ప్రతిరోజు బోలేడు వీడియోలు వైరల్గా మారుతుంటాయి. కొన్ని వీడియోలు చూస్తుంటే ఫన్నీగా ఉంటాయి. మరికొన్ని వీడియోలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. మరికొన్నింటినిచూస్తే కడుపబ్బా నవ్వు తెప్పించేలా కూడా ఉంటాయి. ఈ క్రమంలో ప్రస్తుతం కొంత మంది కాలేజీలో ఈవెంట్ కు గ్రూప్ డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి నెట్టింట బాగా ట్రెండింగ్ గా మారింది. దీనిలో ఒక యువతి డ్యాన్స్ ఈవెంట్ మధ్యలోకి వచ్చి తన ప్రియుడికి చుక్కలు చూపించింది.
చాలా మంది యువతీ, యువకులు ఇటీవల ప్రేమల్లో ఎక్కువగా పడుతున్నారు. ముఖ్యంగా వీరు ప్రేమలో ఉన్నప్పుడు ఎవరైన మధ్యలో వస్తే వాళ్లకు చుక్కలు చూపిస్తారు. కొంత మంది తమ ప్రియుడు లేదా ప్రియురాలితో ఎవరైన చనువుగా ఉంటే అస్సలు భరించలేరు. చాలా పొసెస్సివ్ గా ఉంటారు.
కోపంలో ఎంతటి పనైన చేసేందుకు వెనుకాడారు.ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈవెంట్ లో గ్రూప్ డ్యాన్స్ నడుస్తొంది. అప్పుడు యువతి మధ్యలోకి వచ్చింది. మరీ అతగాడు ఆమె ప్రియుడో ఏంటో కానీ మరో యువతితో డ్యాన్స్ చేస్తుండటం చూసి ఆవేశంలో ఊగిపోయింది. ఆమెతో ఎలా డ్యాన్స్ చేస్తున్నావంటూ కోపంతో రచ్చ రచ్చ చేసింది. వెంటనే అతడ్ని పక్కకు లాగి వాగ్వాదంకు దిగింది. ఈ ఘటనతో డ్యాన్స్ చేస్తున్న అందరు షాక్ అయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.