• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Flipkart సేల్‌లో హెచ్‌ఎండీ వైబ్ 2 ప్రో 5G ధమాకా.. కేవలం రూ. 14,999కే మీ సొంతం!

Flipkart సేల్‌లో హెచ్‌ఎండీ వైబ్ 2 ప్రో 5G ధమాకా.. కేవలం రూ. 14,999కే మీ సొంతం!

Best 5g Phone Under 15000: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో హెచ్‌ఎండీ వైబ్ 2 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌తో లభిస్తోంది. అయితే, లాంచింగ్‌ ఆఫర్స్‌లో భాగంగా ఎన్నో రకాల ఆఫర్స్‌ లభిస్తున్నాయి. అయితే, దీనిపై ఏయే ఆఫర్స్‌ లభిస్తున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Reported ByDharmaraju Dhurishetty
Published: Oct 08, 2026, 12:50 PM IST|Updated: Oct 08, 2026, 12:52 PM IST
joinshare
Flipkart సేల్‌లో హెచ్‌ఎండీ వైబ్ 2 ప్రో 5G ధమాకా.. కేవలం రూ. 14,999కే మీ సొంతం!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
కెమెరా ముందే కాదు... కార్గిల్ సరిహద్దుల్లో తుపాకీ పట్టిన ఏకైక నటుడు నానా పాటేకర్..!

కెమెరా ముందే కాదు... కార్గిల్ సరిహద్దుల్లో తుపాకీ పట్టిన ఏకైక నటుడు నానా పాటేకర్..!

2

Success Story: రూ.50 వేలతో ప్రయాణం.. కష్టాలను జయించి.. ప్రపంచ స్థాయి టెక్నాలజీని సృష్టించిన తెలుగు ఇంజనీర్ సక్సెస్ స్టోరీ

3

Chittoor: చిత్తూరులో అమానవీయం.. కూతురి నగ్న ఫోటోలు వైరల్ చేస్తానని అల్లుడి వేధింపులు.. వెలుగులోకి షాకింగ్ ఘటన..

4

దసరా వేళ RTC ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి షాక్‌.. అక్టోబర్ 8 వచ్చినా జీతాలు రాలేదట!

5

Mandaadi Box Office: సూరి, సుహాస్‌కు ఊహించని బ్లాక్‌బస్టర్.. మండాడి కలెక్షన్లు ఎంతో తెలుసా?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Best 5g Phone Under 15000 Telugu News: ఎప్పటి నుంచో బడ్జెట్‌లో మంచి స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే, మీకు గుడ్‌ న్యూస్‌.. హెచ్‌ఎండీ (HMD) తమ కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీనిని కంపెనీ అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది HMD Vibe 2 Pro 5G పేరుతో అందుబాటులోకి వచ్చింది. మీరు కూడా రూ. 15 వేల లోపే మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది బెస్ట్‌ అప్షన్‌గా భావించవచ్చు. అంతేకాకుండా ఈ ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా అత్యంత తగ్గింపు ధరకే లభిస్తోంది. అయితే, దీనిపై అందుబాటులో ఉన్న డిస్కౌంట్‌ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ధర వివరాల్లోకి వెళితే..
ఈ హెచ్‌ఎండీ వైబ్ 2 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. ఇందులో 6GB ర్యామ్‌తో పాటు 128GB స్టోరేజ్ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ ఆఫర్స్‌లో భాగంగా రూ.14,999 ధరకే అందుబాటులో ఉంది.. ఇక రెండవ వేరియంట్‌ 8GB ర్యామ్‌తో పాటు 128GB స్టోరేజ్ వేరియంట్‌ రూ.16,999తో లభిస్తోంది.. ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్స్‌లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి కొన్ని రకాల ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.. ఇది ఇప్పుడు సిల్వర్ మిస్ట్, ఆక్వా గ్రీన్‌తో పాటు కాస్మిక్ పర్పుల్ కలర్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది..

ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ వివరాలు..
ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే.. ఇది 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుంది.. అంతేకాకుండా 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉండడమే కాకుండా.. గేమింగ్, కంటెంట్ చూసేవారికి ఇది అద్భుతమైన స్మూత్ అనుభూతి అందిస్తుంది. ఇది ఎంతో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఆక్టా-కోర్ 5G చిప్‌సెట్‌ ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉంటుంది.. అంతేకాకుండా మైక్రో ఎస్‌డీ కార్డ్‌తో స్టోరేజ్‌ను మరింత పెంచుకునే సదుపాయం కూడా అందుబాటులో ఉంది..

ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనుక భాగంలో మోస్ట్ పవర్‌ఫుల్ 64 మెగాపిక్సెల్ సోనీ ప్రధాన కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్‌ కెమెరాలను కూడా అందిస్తోంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్‌ భాగంలో చాలా ప్రత్యేకమైన 13 మెగాపిక్సెల్ కెమెరా సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది.. ఇందులో శక్తివంతమైన 6,000mAh భారీ బ్యాటరీని కూడా అందించారు. దీనికి తోడు 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Tech News
Telugu News