• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /కరీంనగర్
  • /దసరా వేళ RTC ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి షాక్‌.. అక్టోబర్ 8 వచ్చినా జీతాలు రాలేదట!

దసరా వేళ RTC ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి షాక్‌.. అక్టోబర్ 8 వచ్చినా జీతాలు రాలేదట!

Rtc Outsourcing Salary Pending: దసరా, దీపావళి సమయాల్లో కూడా RTC ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి జీతాలు రాలేకపోవడంతో వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా చాలీచలని జీతాలతో నెట్టుకుని వస్తున్న వీరికి అక్టోబర్ 8వ తేదీ వచ్చినా.. జీతాలు పడకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు.

Reported ByDharmaraju Dhurishetty
Published: Oct 08, 2026, 01:20 PM IST|Updated: Oct 08, 2026, 01:21 PM IST
joinshare
దసరా వేళ RTC ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి షాక్‌.. అక్టోబర్ 8 వచ్చినా జీతాలు రాలేదట!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Amazon Saleలో OnePlus Nord 6 ధర ఎంత తగ్గిందో తెలుసా?

Amazon Saleలో OnePlus Nord 6 ధర ఎంత తగ్గిందో తెలుసా?

2

Dehradun iPhone Theft: ఓర్నాయనో.. ఐఫోన్ కొట్టేసి ఏకంగా దాని ఓనర్‌కే వాట్సాప్ మెస్సెజ్ లు చేసిన కేటుగాడు.. అసలు విషయం ఏమిటంటే..?..

3

Amazon సేల్ ధమాకా.. Samsung Galaxy S25 Ultra 5G పై రూ.51,500 భారీ డిస్కౌంట్!

4

టీచర్ ఉద్యోగానికి అంత డిమాండా?.. ఫిన్‌లాండ్ ఉపాధ్యాయుల జీతాలు, సౌకర్యాల వెనుక ఉన్న నిజాలివే!

5

కెమెరా ముందే కాదు... కార్గిల్ సరిహద్దుల్లో తుపాకీ పట్టిన ఏకైక నటుడు నానా పాటేకర్..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Rtc Outsourcing Salary Pending News: ప్రజా రవాణా వ్యవస్థలో ఎంతో అద్బుతమైన ప్రాత పోషిస్తూ.. RTC బస్సులు నిరంతరం రోడ్లపై తిరిగేలా ఎంతగానో శ్రమిస్తున్న కరీంనగర్ ఆర్టీసీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీతాల కష్టాలు అస్సలు తప్పడం లేదు.. ప్రతినెలా ఒకటో తేదీనే ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ఖాతాల్లో జీతాలు జమ చేస్తామంటూ 3 నెలల క్రితం కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీ.. ఆచరణలోనే ఆగిపోయింది.. సెప్టెంబర్ నెల అయిపోయి.. అక్టోబర్ 8వ తేదీ వచ్చినా.. ఇంకా జీతాలు ఖాతాల్లో పడకపోవడంతో కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది..

ప్రభుత్వం ప్రకటించిన.. తొలినాళ్లలో మొదటి నెల మాత్రమే 1వ తేదీన వేతనాలు చెల్లించారు.. ఆ తర్వాతి నెలలో ఒకటో తేదీ రాత్రి కొందరికి.. ఇక మరికొంతమందికి రెండో తేదీన వేతనాలు అందాయట.. ఇక ప్రస్తుత నెలకు వచ్చేసరికి ఏకంగా 8వ తేదీ దాటిపోయినా వేతనాల ఊసే లేకుండా పోయింది. అధికారులతో పాటు యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ప్రతినెలా వేతనాల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

అయితే, RTCలో పనులు చేస్తున్న ఔట్‌సోర్సింగ్ కార్మికులకు వచ్చేది అంతంతమాత్రం జీతాలే.. ఆ చాలీచాలని వేతనాలతోనే ఇంటి అద్దెలతో పాటు పిల్లల చదువులు, నిత్యావసర సరుకులు, కుటుంబ పోషణను నెట్టుకుంటూ వస్తున్నారు.. అలాంటిది సమయానికి జీతాలు అందకపోతే.. దసరా సీజన్‌ రావడంతో.. కుటుంబాలను ఎలా పోషించుకోవాలని వారు ప్రశ్నిస్తున్నారట.. ఇప్పటికే అప్పులు తెచ్చి పూట గడుపుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.

దసరా, దీపావళి వంటి పెద్ద పండుగలు వస్తున్న సమయంలో.. ఇలా జీతాలు నిలిచిపోవడం కార్మికులను తీవ్ర నిరాశకు గురిచేస్తోందని పలువురు కార్మికులు తెలుపుతున్నారు. పండుగ ఖర్చుల మాట అటుంచితే.. రోజువారీ అవసరాలకే ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే బస్సులు రోడ్డెక్కేలా..ఎంతో శ్రమించే తమకు జీతాలు వెయ్యకుండా ఇలా ఆపడం అన్యాయం అంటున్నారు..

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Karimnagar