Honor Smartphone: స్మార్ట్‌ఫోన్ యూజ్ చేసుకునేవారు ఎప్పుడూ కోరుకునేది ఒక్కటే.. అదేంటో కాదు.. ఎక్కువసేపు వచ్చే బ్యాటరీ లైఫ్.. సాధారణంగా 5,000mAh లేదా 6,000mAh బ్యాటరీలకే మనం అలవాటు పడ్డాం.. కానీ... ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ హానర్ ఈ లెక్కలన్నింటినీ చెక్ పెడుతూ.. ఏకంగా 13,500mAh భారీ బ్యాటరీతో కొత్త ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇది ప్రీమియం లుక్‌లో అందుబాటులోకి రాబోతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన అన్ని రకాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రముఖ టెక్ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ అందించిన సమాచారం ప్రకారం.. హానర్ సంస్థ 13,300mAh బ్యాటరీ సెల్ ట్రయల్ ప్రోడట్స్‌ను ఇప్పటికే మొదలు పెట్టింది.. ఇది మార్కెట్లోకి సరికీ 13,500mAh వరకు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతటి శక్తివంతమైన బ్యాటరీతో పాటు వినియోగదారులకు మినీ ట్యాబ్లెట్ అనుభూతిని ఇచ్చేలా 7-అంగుళాల భారీ డిస్‌ప్లేను కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌లో అందించారు..
ఈ హానర్ ఈ భారీ బ్యాటరీ టెక్నాలజీని సామాన్యులకు అందుబాటులో ఉండే మిడ్-రేంజ్ బడ్జెంట్‌లోనే అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్ పేరు, ఛార్జింగ్ స్పీడ్‌తో పాటు బరువు, విడుదల తేదీకి సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు..
ఇక ఇదే కంపెనీ నుంచి 2025 సంవత్సరం ఏప్రిల్‌లో ఎంతో శక్తివంతమైన 8,000mAh బ్యాటరీతో హానర్ పవర్ మోడల్‌ను విడుదల చేసింది. ఇక 2026లోని జనవరిలో ఏకంగా 10,080mAh బ్యాటరీతో హానర్ పవర్ 2 ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ.. ఈ ఫోన్ కేవలం తక్కువ మందంతో చాలా సన్నగా ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది.. దీనికి 80W వైర్డ్ ఛార్జింగ్‌తో పాటు, ఇతర ఫోన్లను ఛార్జ్ చేసేందుకు 27W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభిస్తోంది. ఇప్పుడు ఏకంగా 13,500mAh బ్యాటరీతో హానర్.. 2027 సంవత్సరంలో ఇంతకంటే పెద్ద బ్యాటరీలతో అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.