• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /11,000mAh బ్యాటరీతో Honor X9e Pro ఫోన్‌.. 6 ఏళ్ల బ్యాటరీ లైఫ్, 108MP కెమెరా!

11,000mAh బ్యాటరీతో Honor X9e Pro ఫోన్‌.. 6 ఏళ్ల బ్యాటరీ లైఫ్, 108MP కెమెరా!

మోస్ట్‌ పవర్‌ఫుల్ Honor X9e Pro స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయ్యింది. దీనిని కంపెనీ పెద్ద కెమెరాతో తీసుకు వచ్చింది. అయితే, ఇది ఏకంగా 11,000mAh బ్యాటరీతో అందుబాటులోకి రావడానికి కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Reported ByDharmaraju DhurishettyEdited ByDharmaraju Dhurishetty
Published: Sep 25, 2026, 01:14 PM IST|Updated: Sep 25, 2026, 01:16 PM IST
joinshare
11,000mAh బ్యాటరీతో Honor X9e Pro ఫోన్‌.. 6 ఏళ్ల బ్యాటరీ లైఫ్, 108MP కెమెరా!
Image Credit: జీ తెలుగు న్యూస్

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Honor X9e Pro Launched: మొబైల్ మార్కెట్‌లో వినియోగదారుల దృష్టిని ఎంతగానో ఆకర్షిస్తూ.. ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ హానర్‌ తన కొత్త మోడల్‌ను ఇంటర్నేషనల్ మార్కెట్‌లోకి విడుదల చేసింది. మోస్ట్ పవర్‌ఫుల్ ఫీచర్స్‌తో Honor X9e Pro పేరిట లాంచ్ అయిన ఈ మొబైల్.. ఊహించని రీతిలో దీనిని కంపెనీ ఏకంగా 11,000mAh భారీ బ్యాటరీతో విడుదల చేసి టెక్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే, ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్‌తో పాటు స్పెషిఫికేషన్స్ వివరాలు.. ఇంత పెద్ద బ్యాటరీతో అందుబాటులోకి తీసుకు రావడానికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

6 ఏళ్ల లైఫ్..
ఈ మొబైల్‌ ప్రధాన ఆకర్షణ దీని భారీ బ్యాటరీయేనని నిపుణులు చెబుతున్నారు. ఇది ఎంతో శక్తివంతమైన 11,000mAh బ్యాటరీతో పాటు ఛార్జ్‌ చేసేందుకు 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ను కూడా అందిస్తూ వస్తోంది. అంతేకాకుండా ఇతర మొబైల్స్‌కి ఛార్జింగ్ అందించేందుకు ఇందులో కంపెనీ 27W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందించడం విశేషం.. అలాగే ఈ బ్యాటరీకి దాదాపు 6 ఏళ్ల పాటు బ్యాటరీ లైఫ్‌ను కూడా అందిస్తూ వస్తోంది. అయితే, దీనిని ఇంత పెద్ద బ్యాటరీ సమార్థ్యంతో అందుబాటులోకి తీసుకు రావడానికి ప్రధాన కారణం.. ఊహించని స్థాయిలో ఈ బ్రాండ్‌ జనాల్లోకి తీసుకెళ్లేందుకే ఈ మోడల్‌ను లాంచ్‌ చేసిన్నట్లు తెలుస్తోంది.

ఇక దీనిని కంపెనీ ఎంతో అద్భుతమైన డిజైన్‌తో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇది IP66, IP68, IP69తో పాటు IP69K రేటింగ్‌లతో విడుదల చేసింది. ఫలితంగా ఇది అన్ని వాతావరణాల్లో సైతం తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది ఏకంగా 10 మీటర్ల లోతు నీటిలో మునిగిపోయినా పని చేస్తుందని కంపెనీ క్లైమ్‌ చేస్తోంది. అంతేకాకుండా ఇది 3 మీటర్ల ఎత్తు నుంచి కింద పడినా తట్టుకునే డ్రాప్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉందని కంపెనీ తెలిపింది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.8 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుంది.. అలాగే ఇది 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో పాటు 2788 x 1280 పిక్సెల్స్ రిజల్యూషన్, 100 శాతం DCI-P3 కలర్ గేమట్‌కు సపోర్ట్‌ను కూడా అందిస్తోంది.. స్క్రీన్ ప్రొటక్షన్‌ కోసం ఇందులో మోస్ట్ పవర్‌ఫుల్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 (Gorilla Glass Victus 2) సపోర్ట్‌ను కూడా అందిస్తోంది.. ఇది శక్తివంతమైన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 5 (Snapdragon 6 Gen 5) ప్రాసెసర్‌తో అందుబాటులోకి రాబోతోంది.

ఫోటోగ్రఫీ లవర్స్‌ కోసం ఇందులో మోస్ట్ పవర్‌ఫుల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో కూడిన 108 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను అందుబాటులోకి తీసుకు వచ్చింది. అంతేకాకుండా అదనంగా 5 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్‌ కెమెరాను కూడా అందిస్తోంది.. సెల్ఫీల కోసం ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ కెమెరాను తీసుకువచ్చింది.. ఇవే కాకుండా చాలా రకాల కొత్త కొత్త ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంది.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News