SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

పెళ్లిళ్లు, విహారయాత్రలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ఒకేసారి వందల రైలు టికెట్లు బుక్ చేసుకునే అవకాశం!

Book Hundreds of Train Tickets: మీరు మీ కుటుంబం లేదా స్నేహితులతో కలిసి గుంపుగా ఎక్కడికైనా రైలు ప్రయాణం చేయాలనుకుంటున్నారా? అయితే సౌత్ వెస్టర్న్‌ సెంట్రల్ రైల్వే కొత్త నియమాలను ప్రకటించింది. టికెట్ బుకింగ్ నిబంధనల్లో భారీ మార్పులు వచ్చాయి. ఇకపై మీరు కేవలం 6 టికెట్లకే పరిమితం కాకుండా, అవసరమైనన్ని టికెట్లను గరిష్ట పరిమితి వరకు బుక్ చేసుకోవచ్చు.

Written By Renuka Godugu
Published: Nov 22, 2026, 14:27 IST | Updated: Nov 22, 2026, 14:33 IST
Image Credit: Book Hundreds of Train Tickets:
Join

Book Hundreds of Train Tickets: మీరు మీ కుటుంబం లేదా స్నేహితులతో కలిసి గుంపుగా ఎక్కడికైనా రైలు ప్రయాణం చేయాలనుకుంటున్నారా? అయితే సౌత్ వెస్టర్న్‌ సెంట్రల్ రైల్వే కొత్త నియమాలను ప్రకటించింది. టికెట్ బుకింగ్ నిబంధనల్లో భారీ మార్పులు వచ్చాయి. ఇకపై మీరు కేవలం 6 టికెట్లకే పరిమితం కాకుండా, అవసరమైనన్ని టికెట్లను గరిష్ట పరిమితి వరకు బుక్ చేసుకోవచ్చు.

ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పెళ్లి కోసం లేదా ఏదైనా విహారయాత్రకు గుంపుగా వెళ్లేటప్పుడు, కుటుంబంతో లేదా స్నేహితులతో ప్రయాణించేవారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ప్రతిపాదన ఇంకా అధికారికంగా ప్రారంభం కాలేదు. అయితే రాబోయే రోజుల్లో భారతీయ రైల్వే జోన్లలోని అన్ని స్టేషన్లలో దీనిని అమలు చేసే అవకాశం ఉంది.

సౌత్ వెస్టర్న్‌ రైల్వే బల్క్ రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఇందులో ఒకేసారి ఎన్ని టికెట్లైనా బుక్ చేసుకోవచ్చు. రిజర్వేషన్ సూపర్‌వైజర్ లేదా స్టేషన్ మేనేజర్ ఈ టికెట్ బుకింగ్‌కు ఆమోదం తెలిపితే, అధికారికంగా గ్రూప్ టికెట్ బుకింగ్ పూర్తవుతుంది.
ఈ సదుపాయం స్లీపర్, 2 ఏసీ, 3 ఏసీ, 1 ఏసీ అన్ని తరగతులకు వర్తిస్తుంది. రిజర్వేషన్ కన్ఫర్మ్ టికెట్లు లభించవచ్చు, లేదా ఆర్ఏసీ లేదా వెయిటింగ్ లిస్ట్ స్థితి కనిపించవచ్చు.

బుకింగ్ ప్రక్రియ పూర్తయిన వెంటనే కన్ఫర్మ్ కావచ్చు. ఈ కొత్త రైల్వే టికెట్ బుకింగ్ నిబంధనలు గ్రూప్‌లుగా ప్రయాణించేవారికి ఎంతో ఉపయోగపడతాయి. పెళ్లిళ్లు, శుభకార్యాలు, విహారయాత్రలకు, పాఠశాల లేదా కళాశాల విద్యా పర్యటనలకు, టోర్నమెంట్లలో పాల్గొనే వారికి కూడా ఇవి ఉపయోగకరంగా ఉంటాయి.

సౌత్ వెస్ట్రన్ రైల్వే రిజర్వేషన్ విండో ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు తెరుచుకుంటుంది. ఆ విండో తెరుచుకున్న వెంటనే తత్కాల్ బుకింగ్ కూడా ప్రారంభమవుతుంది. నేరుగా దరఖాస్తు చేసుకుంటే ప్రక్రియ పూర్తవుతుంది. అయితే ఏజెంట్ ద్వారా సమర్పిస్తే ఈ నిబంధన వర్తించదు.

రైల్వే గ్రూప్ టికెట్ బుకింగ్ చేసుకోవాలంటే ప్రయాణికుల వివరాలు తప్పనిసరిగా అందించాలి. ఇందులో పూర్తి పేరు, వయస్సు, లింగం, చిరునామా తదితర వివరాలు కచ్చితంగా ఉండాలి. వీటితో పాటు ఆధార్ కార్డు కాపీని కూడా సమర్పించాలి. అదనంగా ప్రతి పేజీపై సంతకం చేసి స్టాంప్ వేసి ఉండాలి. ఏదైనా సమాచారం తప్పిపోతే రైల్వే రిజర్వేషన్ ప్రక్రియ ఆగిపోయే అవకాశం ఉంది. స్టేషన్ మేనేజర్ లేదా చీఫ్ రిజర్వేషన్ సూపర్‌వైజర్ ఆమోదం లభిస్తే మీకు గ్రూప్ బుకింగ్ టికెట్లు అందినట్టే.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES