SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

రైలు ప్రయాణంలో లోయర్ బెర్త్ కావాలా? టికెట్ బుక్ చేసే ముందు ఈ 4 సెట్టింగ్స్ మార్చండి.. కన్ఫామ్‌గా వస్తుంది!

భారతీయ రైల్వేలో ప్రతిరోజు కొన్ని లక్షల మంది ప్రయాణం చేస్తుంటారు. ఇందులో వృద్ధులు, మహిళలు, పిల్లలు అందరూ ఉంటారు. వయసు ఎక్కువగా ఉన్నవారికి, కాళ్ల నొప్పులు వంటి సమస్యలు ఉన్నవారికి తప్పనిసరిగా లోయర్ బెర్త్ అవసరం. కొంతమంది ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కింది బెర్త్‌ను ఇష్టపడతారు. మరికొందరు లోయర్ బెర్త్‌నే కావాలని కోరుకుంటారు. అయితే ఐఆర్‌సీటీసీలో ఈ 4 చిట్కాలు పాటిస్తే లోయర్ బెర్త్ ఖచ్చితంగా లభించే అవకాశం ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం.

Written By Renuka Godugu
Published: Nov 24, 2026, 17:37 IST | Updated: Nov 24, 2026, 17:40 IST
Image Credit: IRCTC Ticket Booking Tips
Join

IRCTC Ticket Booking Tips: రైలు ప్రయాణంలో వృద్ధులు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు, పైకి ఎక్కలేని పరిస్థితిలో ఉన్నవారు లోయర్ బెర్త్‌కు ప్రాధాన్యత ఇస్తారు. అలాంటివారికి ఆ బెర్త్ దొరకకపోతే ఇబ్బందులు పడతారు. ప్రయాణంలో ఇబ్బంది లేకుండా, సమస్యలు రాకుండా ఉండాలంటే దిగువ బెర్త్‌కు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. కొంతమంది ఎప్పుడూ లోయర్ బెర్త్‌నే ఇష్టపడతారు. లోయర్ బెర్త్ ఉంటే లగ్గేజీ పెట్టడం, తీయడం కూడా సులభంగా ఉంటుంది. సౌకర్యంగా కూర్చొవచ్చు. అయితే లోయర్ బెర్త్ అందరికీ ఇవ్వరు. కొన్ని ప్రత్యేక వర్గాలకు మాత్రమే కేటాయిస్తారు. ఐఆర్‌సీటీసీలో రైలు టికెట్ బుక్ చేసేటప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే లోయర్ బెర్త్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

లోయర్ బెర్త్ వివరాలు..
సాధారణంగా ఐఆర్‌సీటీసీలో రైలు టికెట్ బుక్ చేసేటప్పుడు లోయర్ బెర్త్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. బుకింగ్ ప్రక్రియలో బెర్త్ ప్రిఫరెన్స్ దగ్గర వివరాలు నమోదు చేసేటప్పుడు లోయర్ బెర్త్‌ను కూడా ఎంచుకోవాలి. ఇబ్బందులు పడేవారు మాత్రమే దీన్ని ఎంచుకోవడం మంచిది. అయితే లోయర్ బెర్త్ ఎంచుకున్నంత మాత్రాన అది తప్పకుండా లభిస్తుందన్న హామీ ఉండదు. రైల్వే రిజర్వేషన్ వ్యవస్థలో అందుబాటులో ఉంటేనే లోయర్ బెర్త్ కన్ఫర్మ్ అవుతుంది.

రిజర్వేషన్ ఛాయిస్..
ఐఆర్‌సీటీసీ బుకింగ్ ప్రక్రియలో రిజర్వేషన్ ఛాయిస్ అనే ఆప్షన్ ఉంటుంది. అందులో కనీసం ఒక లోయర్ బెర్త్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. రెండు లోయర్ బెర్త్‌లు కావాలని కూడా ఎంచుకోవచ్చు. ఈ ఆప్షన్ ఎంచుకుంటే ఒకటి లభించే అవకాశం ఉంటుంది. అయితే ఎంచుకున్న ప్రతి ఒక్కరికీ ఇస్తారని కాదు. అందుబాటులో ఉండి, అర్హత ఉన్నవారికి మాత్రమే కచ్చితంగా లోయర్ బెర్త్ లభించే అవకాశం ఉంటుంది.

ప్రత్యేక కోటా..
ప్రతి ప్రయాణికుడికీ ఈ ప్రత్యేక కోటా ఉండదు. లోయర్ బెర్త్ కేవలం అర్హులైన ప్రయాణికులకు మాత్రమే కేటాయిస్తారు. ప్రధానంగా సీనియర్ సిటిజన్లు, 45 ఏళ్లు పైబడిన మహిళలు, గర్భిణీ స్త్రీలకు ఈ లోయర్ బెర్త్‌కు ప్రాధాన్యత ఇస్తారు. సాధారణంగా స్లీపర్ క్లాస్‌లో ఒక కోచ్‌లో గరిష్టంగా 7 లోయర్ బెర్త్‌లు, ఏసీ 3 టైర్‌లో గరిష్టంగా 5, సెకండ్ టైర్‌లో గరిష్టంగా 4 లోయర్ బెర్త్‌లు ఈ వర్గాలకు కేటాయిస్తారు. బుక్ చేసేటప్పుడు ప్రయాణికుల్లో వృద్ధులు లేదా 45 ఏళ్లు పైబడినవారు ఉంటే, అందుబాటులో ఉన్నప్పుడు వారికి లోయర్ బెర్త్ కేటాయిస్తారు.

ఇప్పుడే బుక్ చేయండి..
ప్రయాణికుల వివరాలు నమోదు చేసేటప్పుడు వారి వయసు, పేరు, లింగం వంటి వివరాలను రెండుసార్లు సరిచూసుకోవాలి. సీనియర్ సిటిజన్లు, 40 ఏళ్లు పైబడిన గర్భిణీ స్త్రీలు లోయర్ బెర్త్‌కు అర్హులైతే వారికి కేటాయిస్తారు. అయితే ఒక గ్రూప్ మొత్తానికి లోయర్ బెర్త్ ఎంచుకునే అవకాశం ఉండదు, గ్రూప్‌గా ప్రయాణించిన వారందరికీ కూడా అది లభించదు. ఆ సీట్లు అందుబాటులో ఉంటేనే కేటాయిస్తారు.

రైలు టికెట్ బుక్ చేసేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కరికీ లోయర్ బెర్త్ కేటాయించరు. అందుబాటులో ఉన్న సీట్లు, ప్రయాణికుల వర్గం, రిజర్వేషన్ వ్యవస్థ నియమాల ఆధారంగానే కేటాయిస్తారు. మీరు వృద్ధులు లేదా పెద్దవారితో ప్రయాణిస్తుంటే, నిజమైన అవసరం ఉంటే లోయర్ బెర్త్ కేటాయించే అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా అందుబాటులో ఉంటేనే ఇస్తారు. ముందుగా బుక్ చేసుకున్నవారికి ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి, టికెట్ బుక్ చేయాల్సినప్పుడు వీలైనంత త్వరగా బుక్ చేసుకోవడం మంచిది. అర్హత ఉంటే మొదట మీకే సీటు కేటాయించే అవకాశం ఉంటుంది.

టికెట్ కన్ఫర్మ్ అయినంత మాత్రాన లోయర్ బెర్త్ కేటాయించినట్లు కాదు. ఎప్పటికప్పుడు పీఎన్ఆర్ స్టేటస్‌లో మీ వివరాలు తనిఖీ చేసుకోవచ్చు. అక్కడ మీకు ఏ బెర్త్ కేటాయించారో అప్‌డేట్ అవుతుంది. మీరు ఎంచుకున్నంత మాత్రాన అదే బెర్త్ కేటాయించినట్లు కాదు, పీఎన్ఆర్ స్టేటస్‌లో కనిపించే సమాచారమే తుది వివరం.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES