• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /క్రీడలు
  • /ఆడేవడన్న.. ఈడేవడన్న.. వైభవ్ సూర్యవంశీకి అడ్డవేడన్న.. 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ..!

ఆడేవడన్న.. ఈడేవడన్న.. వైభవ్ సూర్యవంశీకి అడ్డవేడన్న.. 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ..!

Vaibhav Sooryavanshi Double Century: ఒకే ఇన్నింగ్స్‌లో ఎన్ని రికార్డులు బద్దలు కొట్టొచ్చో చూపించాడు వైభవ్ సూర్యవంశీ. మొదట 28 బంతుల్లో సెంచరీ బాదిన ఈ యువ సంచలనం.. ఆ తరువాత గేర్ మార్చి తన విధ్వంసాన్ని మరింత పెంచాడు. ఏకంగా 53 బంతుల్లో 204 పరుగులు సాధించి డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించాడు. వైభవ్ ఇన్నింగ్స్‌లో 28 సిక్సర్లు ఉండటం విశేషం.

Written ByAshok Krindinti
Published: Nov 24, 2026, 17:32 IST|Updated: Nov 24, 2026, 17:55 IST
joinshare
ఆడేవడన్న.. ఈడేవడన్న.. వైభవ్ సూర్యవంశీకి అడ్డవేడన్న.. 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ..!
Image Credit: Vaibhav Sooryavanshi (Source: BCCI/X)

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
రైలు ప్రయాణంలో లోయర్ బెర్త్ కావాలా? టికెట్ బుక్ చేసే ముందు ఈ 4 సెట్టింగ్స్ మార్చండి.. కన్ఫామ్‌గా వస్తుంది!

రైలు ప్రయాణంలో లోయర్ బెర్త్ కావాలా? టికెట్ బుక్ చేసే ముందు ఈ 4 సెట్టింగ్స్ మార్చండి.. కన్ఫామ్‌గా వస్తుంది!

2

Karnataka: బెంగళూరులో ఘోరం.. లాడ్జీలో ప్రియుడితో గొడవ.. మూడో అంతస్తునుంచి పడి యువతి మృతి..

3

ఆడేవడన్న.. ఈడేవడన్న.. వైభవ్ సూర్యవంశీకి అడ్డవేడన్న.. 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ..!

4

Vaibhav Sooryavanshi: బుడ్డోడు చితక్కొట్టాడు.. 28 బంతుల్లోనే సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డు..!

5

Road Accident: ఏపీలో ఘోర ప్రమాదాలు- 8 మంది మృతి.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Vaibhav Sooryavanshi Double Century: 28 బంతుల్లో సెంచరీ.. 52 బంతుల్లో డబుల్ సెంచరీ.. ఏకంగా 28 సిక్సర్లు.. 7 ఫోర్లు.. స్టేడియం మొత్తం సిక్సర్ల వర్షం.. ప్రేక్షకులే ఫీల్డర్డు.. బౌలర్లకు పట్టపగలే చుక్కలు.. ఇంతకంటే ఏం చెప్పాలి వైభవ్ సూర్యవంశీ విధ్వంసం గురించి.. బ్యాట్ పట్టి క్రీజ్‌లోకి వచ్చాడంటే పరుగుల వరద పారాల్సిందే.. బౌలర్ ఎవరైనా బంతి బౌండరీ దాటాల్సిందే..! ఈ బుడ్డోడి ఆట చూస్తుంటే ప్రత్యర్థి బౌలర్లకు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో  యూఏఈతో జరుగుతున్న 28 బంతుల్లోనే సెంచరీ బాదిన వైభవ్.. 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. మొత్తంగా 53 బంతుల్లో 204 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఏకంగా 28 సిక్సర్లు, 7 ఫోర్లతో విధ్వంసం సృష్టించాడు. దీంతో ఈ మ్యాచ్‌లో యూఏఈ విధించిన 250 పరుగుల లక్ష్యాన్ని భారత్ 14.2 ఓవర్లలోనే ఛేదించింది. 

ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యూఏఈ.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ హర్‌ప్రీత్ సింగ్ భాటియా (130) సెంచరీతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్ బాసిల్ హమీద్ (36) మినహా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు. భారత్ బౌలర్లలో అర్షద్‌ ఖాన్ నాలుగు వికెట్లు తీయగా.. హర్షిత్ రాణా, సూయన్ష్‌, హర్ష్‌ దూబే, షాబాద్ అహ్మద్ తలో వికెట్ తీశారు.

అనంతరం లక్ష్య ఛేదనలో వైభవ్ విధ్వంసంతో వార్ వన్ సైడ్ అయింది. విధ్వంసకర బ్యాటింగ్‌తో యూఏఈ బౌలర్లకు ఈ రాత్రి కాళరాత్రిగా మార్చాడు. పేసర్ జాహిద్ అలీ వేసిన తొలి ఓవర్లో వరుసగా మూడు సిక్సర్లు బాదాడు. ఆ తరువాత ఎక్కడా జోరు తగ్గించలేదు. కేవలం 16 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్న వైభవ్.. మరో 12 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు. మొదట 16 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న వైభవ్.. ఆ తరువాత కేవలం 28 బంతుల్లోనే సెంచరీ బాదాడు. లిస్ట్ ఏ క్రికెట్‌లో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీగా రికార్డు అయింది. లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన ఆటగాడిగా వైభవ్ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ ఘనత ఆస్ట్రేలియా ఆటగాడు జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ పేరిట ఉండేది. అతడు 2023లో సౌత్ ఆస్ట్రేలియా తరఫున టాస్మానియాపై 29 బంతుల్లో శతకం సాధించాడు. ఇప్పుడు వైభవ్ 28 బంతుల్లోనే సెంచరీ చేసి ఆ రికార్డును అధిగమించాడు.

అంతటితో ఆగకుండా 40 బంతుల్లోనే 150 పరుగుల మార్కును చేరుకున్నాడు. ఆ తర్వాత 52వ బంతికి డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ ఆటగాడు చాడ్ బౌస్ పేరిట ఉండేది. 2024లో కాంటర్‌బరీ తరఫున ఒటాగోపై అతడు 103 బంతుల్లో ద్విశతకం సాధించాడు. ఇప్పుడు వైభవ్ కేవలం 52 బంతుల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు. భారత్ తరఫున గతంలో ఎన్.జగదీశన్ 114 బంతుల్లో డబుల్ సెంచరీ చేశాడు.

వైభవ్ తన ఇన్నింగ్స్‌లో ఏకంగా 28 సిక్సర్లు బాదాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. వైభవ్ మొత్తం స్కోరు 204 పరుగులు కాగా.. స్ట్రైక్ రేట్ 384.91గా నమోదైంది. వైభవ్ దూకుడుతో భారత్ ఎ జట్టు కేవలం ఐదు ఓవర్లలోనే 100 పరుగుల మార్కును దాటడం విశేషం. లిస్ట్-ఏ క్రికెట్‌లో జట్టు తరఫున అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన ఘనతను కూడా భారత్ ఎ సొంతం చేసుకుంది. చివరకు బాసిల్ హమీద్ బౌలింగ్‌లో ఆర్యన్ష్ శర్మకు క్యాచ్ ఇచ్చి వైభవ్ ఔటయ్యాడు. చివరకు భారత్ ఎ జట్టు కేవలం 14.2 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసి ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో టోర్నీలో సెమీ ఫైనల్‌కు చేరింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వైభవ్‌కే దక్కింది.

Add Zee News as a Preferred Source
TAGS:
Cricket