పాన్ కార్డులో పేరు, పుట్టిన తేదీ తప్పుగా ఉన్నాయా? ఆన్‌లైన్‌లో ఈజీగా అప్‌డేట్ చేసే ప్రాసెస్ ఇదే!
ఆధార్‌కార్డు మాదిరి పాన్ కార్డు కూడా తప్పనిసరి. అయితే, కేవలం ఆదాయపు పన్ను ఫైల్ చేయడానికి మాత్రమే కాదు.. బ్యాంకు ఖాతా ఓపెన్ చేయాలన్నా, పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలకు కూడా తప్పనిసరి. ఈ నేపథ్యంలో మీ పాన్‌కార్డు ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్‌గా ఉండేలా చూసుకోండి. ఆన్‌లైన్‌లో ఈజీగా అప్‌డేట్ చేయొచ్చు.
మీకు పాన్‌కార్డు లేదా? దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఎలాంటి బ్రోకరేజీపై ఆధారపడకుండా ఆన్‌లైన్‌లో సింపుల్‌గా అప్‌డేట్ చేసుకోవచ్చు. పాన్ కార్డు అనేది కేవలం ఆదాయపు పన్ను ఫైల్ చేయడానికి మాత్రమే కాదు.. బ్యాంకు ఖాతా ఓపెన్ చేయడానికి, ఆర్థిక లావాదేవీలకు తప్పనిసరి చేశారు. దీంతో మీరు ఆధార్ కార్డుతోపాటు పాన్ కార్డు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, పాన్ కార్డులో మీ పేరు, పుట్టినతేదీ, ఇంటి పేరులో తప్పులు ఉండకుండా చూడండి. ఆధార్ కార్డు, పాన్ కార్డు ఒకేవిధంగా వివరాలు కలిగి ఉండాలి. పాన్ కార్డు అప్‌డేట్ ఎంతో సులభం. ఇంట్లో నుంచే మీరు పాన్ కార్డ్ అప్‌డేట్ చేసుకోవచ్చు.
కొత్త పాన్ కార్డుకు దరఖాస్తు చేసే విధానం..
మొదటగా NSDL లేదా UTIITSL అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
ఆ తర్వాత అప్లై ఆన్‌లైన్ ట్యాబ్‌లో కొత్త పాన్ కార్డ్ ఆప్షన్ ఎంచుకోండి.
ఇక్కడ వ్యక్తిగత వివరాలు నమోదు చేయండి. ఆ తర్వాత మీకు టోకెన్ నెంబర్ జారీ అవుతుంది.
ఈకేవైసీ ద్వారా సబ్మిట్ చేయండి.
అయితే, దీనికి మీ ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్‌తో రిజిస్టర్ అయి ఉండాలి. అక్కడ మీరు రూ.1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక నెంబర్ జనరేట్ అవుతుంది. దీని ఆధారంగా మీ కొత్త పాన్ కార్డు స్టేటస్ ట్రాక్ చేయవచ్చు.
పాన్ కార్డులో కరెక్షన్స్..
పాన్‌కార్డులో మీ ఏవైనా వివరాలు తప్పుగా ఉంటే కూడా సరిచేసుకోవచ్చు.
దీనికి కూడా అధికారిక వెబ్‌సైట్ NSDL లేదా UTIITSL ఓపెన్ చేయండి.
అక్కడ చేంజ్ లేదా కరెక్షన్ సెలక్ట్ చేయండి
ఇక్కడ మీ కరెక్ష్ వివరాలు నమోదు చేయండి.
మీకు అప్‌డేట్ కావాలా? అనే ఒక చెక్ బాక్స్ ఉంటుంది. దాన్ని టిక్ చేయండి.
Read Also: అలర్ట్.. రేపటి నుంచి కొత్త రూల్స్.. SBI ఏటీఎం ఛార్జీలు, LPG గ్యాస్ సబ్సిడీలో భారీ మార్పులు!
అక్కడ సంబంధించిన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి మీ సరైన వివరాలు ఇవ్వండి. చివరగా ఫీజు చెల్లిస్తే అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. ఇక మీరు పాన్ కార్డుకు దరఖాస్తు చేసినా, లేదా అప్‌డేట్ చేసుకోవచ్చు. మీ రిజిస్టర్డ్ ఈమెయిల్‌కు e-PAN కూడా వస్తుంది. ఇక ఫిజికల్ పాన్ కార్డు స్పీడ్ పోస్ట్ ద్వారా కేవలం 15 నుంచి 20 రోజుల్లో డెలివరీ అవుతుంది.