మీ మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌తో నిమిషాల్లో పాన్-ఆధార్ లింక్.. స్టెప్-బై-స్టెప్ పూర్తి గైడ్ ఇదే!
ఆధార్‌కార్డు, పాన్‌కార్డు ప్రతి ఒక్కరికీ అవసరం. ఇది మన దేశంలో ఎంతో ముఖ్యమైన డాక్యుమెంట్స్.. బ్యాంకు ఖాతా ఓపెన్ చేయాలన్నా.. ట్యాక్స్ రిటర్న్స్, లోన్ అప్రూవల్ పొందాలన్నా ఈ ఆధార్, పాన్ కార్డు తప్పనిసరి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
How to Link PAN With Aadhaar: ఆధార్ కార్డు మన దేశంలో ఎంతో ముఖ్యమైన పత్రం. అదేవిధంగా పాన్‌కార్డు కూడా ముఖ్యమే. అయితే, ఆధార్ కార్డు, పాన్‌కార్డు కూడా మన దేశంలో ఎంతో ముఖ్యం. ఈ రెండిటినీ లింక్ చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆధార్, పాన్‌కార్డు లింక్ అవ్వకపోతే వెంటనే ఆ పని పూర్తి చేయండి. ప్రభుత్వం కేవైసీ కూడా తప్పనిసరి చేసింది. ఇప్పటికే మీరు ఆధార్, పాన్ కార్డు లింక్ చేస్తే ఓకే కానీ, లేదంటే లింక్ చేయండి. పాన్ కార్డు సీజ్ చేసే అవకాశం కూడా ఉంది. ఇంట్లోనే కూర్చొని కూడా సింపుల్‌గా ఆధార్, పాన్ కార్డు కూడా లింక్ చేయవచ్చు. సింపుల్ స్టెప్స్‌తో ఆ పని పూర్తి చేయవచ్చు.
పాన్, ఆధార్ కార్డు లింక్ చేసే విధానం..
మొదట ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. అక్కడ లింక్ ఆధార్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఆధార్, పాన్ కార్డు నెంబర్స్ నమోదు చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 'I Agree valdate aadhaar details with UIDAI' సెలక్ట్ చేయండి. అప్పుడు పాన్ విజయవంతంగా లింక్ అయింది అనే మెసేజ్ వస్తుంది.
ఎస్‌ఎంఎస్ ద్వారా..
ఆధార్, పాన్ కార్డు ఎస్‌ఎంఎస్ ద్వారా కూడా లింక్ చేయవచ్చు. దీనికి UIDPAN <12 అంకెల ఆధార్ నెంబర్> <10 డిజిట్ పాన్> మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి పంపించండి.
ఈ మెసేజ్ రిక్వెస్ట్ మీరు 567678 లేదా 56161 నెంబర్‌కు పంపించాలి.
ఇ పాన్ ఇంటి నుంచే దరఖాస్తు చేసుకోవడం..
ఆదాయపు పన్ను శాఖ వారి ఇ ఫైలింగ్ పోర్టల్ ఓపెన్ చేయండి.
ఇక్కడ క్విక్ లింక్స్ కనిపిస్తాయి. ఎడమవైపు Instant ePAN ఆప్షన్ కనిపిస్తుంది.
ఇక్కడ Get New ePAN బట్టన్ ప్రెస్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇప్పుడు డిక్లరేషన్ బాకస్ కూడా చెక్ చేసి కంటిన్యూ ఎంపిక చేయండి.
6 డిజిట్ ఓటీపీ మీ మొబైల్ నెంబర్‌కు వస్తుంది. ఇది మీ డీజీ లాకర్‌కు రీడైరెక్ట్ అవుతుంది. మీ పుట్టిన తేదీ, కేవైసీ వివరాలతో వెరిఫై చేయండి.
మీ ఆధార్‌తో ఈమెయిల్ ఐడీ కూడా లింక్ అయ్యేలా చూడాలి. అప్పుడే వ్యాలిడేట్ చేయగలం. అప్పుడు మీ ఆధార్‌లో ఉండే పేరు, పుట్టిన తేదీ వివరాలు, ఫోటో స్క్రీన్‌పై కనిపిస్తుంది.