• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /నామినీ ఉంటే సులువు.. లేకపోతే ఏంటి పరిస్థితి? బ్యాంక్ ఖాతా డెత్ క్లెయిమ్ ప్రాసెస్, అవసరమైన పత్రాల వివరాలు!

నామినీ ఉంటే సులువు.. లేకపోతే ఏంటి పరిస్థితి? బ్యాంక్ ఖాతా డెత్ క్లెయిమ్ ప్రాసెస్, అవసరమైన పత్రాల వివరాలు!

మన దేశంలో ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతా కలిగి ఉంటారు. సాధారణంగా మనం జీతం వంటి లావాదేవీలు నిర్వహిస్తాం కాబట్టి ఈ ఖాతా తప్పనిసరి. అయితే ఒకవేళ ఖాతాదారుడు మరణించిన తర్వాత, ఆ బ్యాంకు ఖాతాను ఎలా క్లెయిమ్ చేయాలి? నామినీ ఉంటే పర్వాలేదు కానీ, ఒకవేళ నామినీ లేకపోయినా లేదా ఏదైనా ఇబ్బంది ఎదురైనా వారసులకు ఆ డబ్బు ఎలా అందుతుందో తెలుసుకుందాం.

Written ByRenuka Godugu
Published: Sep 30, 2026, 10:09 AM IST|Updated: Sep 30, 2026, 10:11 AM IST
joinshare
నామినీ ఉంటే సులువు.. లేకపోతే ఏంటి పరిస్థితి? బ్యాంక్ ఖాతా డెత్ క్లెయిమ్ ప్రాసెస్, అవసరమైన పత్రాల వివరాలు!
Image Credit: Bank account death claim process

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

మీకు బ్యాంకు ఖాతా ఉంటే ఈ విషయం తప్పక తెలిసి ఉండాలి. చనిపోయిన వారి బ్యాంకు ఖాతాల నిర్వహణపై ఆర్‌బీఐ కొన్ని కఠిన నిబంధనలు విధించింది. ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులు లేదా వారసులు డిపాజిట్ చేసిన డబ్బును ఎలా విత్‌డ్రా చేయాలి?, సెటిల్మెంట్ ప్రక్రియ ఎలా పూర్తి చేయాలి అనే అంశాలను వివరించింది. సాధారణంగా మీరు నామినీని రిజిస్టర్ చేసుకుంటే ప్రక్రియ సులభంగా ఉంటుంది, కానీ ఒకవేళ నామినీ అందుబాటులో లేకపోయినా లేదా ఏవైనా పరిస్థితుల్లో లేకపోయినా ఏం చేయాలనేది ముఖ్యం.

ఎవరైనా బ్యాంకు ఖాతాదారుడు మరణించినప్పుడు, వారి బ్యాంకు ఖాతాలోని డబ్బు నామినీకి చేరుతుంది. దీని కోసం ముందుగా డెత్ సర్టిఫికేట్ వంటి చట్టపరమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. అలాగే బ్యాంక్ బ్రాంచ్ లేదా వెబ్‌సైట్ ద్వారా మరణానికి సంబంధించిన వివరాలను తెలుసుకుని, క్లెయిమ్ ఫారమ్ నింపి రిక్వెస్ట్ పెట్టాలి. చివరగా అవసరమైన డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాలి. ఖాతాదారుడి మరణం తర్వాత నామినీ తన గుర్తింపును కూడా నిరూపించుకోవాల్సి ఉంటుంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం, సరైన డాక్యుమెంట్లు సమర్పిస్తే సెటిల్మెంట్ త్వరగా పూర్తవుతుంది. మరణం తర్వాత 15 రోజుల్లోపు డెత్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది, ఆ తర్వాత వెంటనే నామినీ ఖాతాలో డబ్బులు జమ చేస్తారు. అయితే దీనికి కావాల్సిన పూర్తి వివరాల కోసం బ్యాంకు బ్రాంచ్‌ను సంప్రదించడం మంచిది.

ప్రతి ఖాతాకు నామినీ ఉండటం కూడా తప్పనిసరి. ఖాతాదారుడు నామినీని రిజిస్టర్ చేస్తే, మరణానంతరం ఆ డబ్బు నేరుగా నామినీకి అందుతుంది. అందుకే మీరు ఇంకా నామినీని రిజిస్టర్ చేయకపోతే, వెంటనే బ్యాంకును సంప్రదించి ఆ వివరాలను నమోదు చేయండి.
బ్యాంకులో వివరాలు అప్‌డేట్ అయి ఉంటేనే, ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ కుటుంబ సభ్యులకు లేదా వారసులకు డబ్బులు అందుతాయి. అందుకే నామినీ వివరాలను తప్పక అప్‌డేట్ చేయాలని ఆర్‌బీఐ అధికారికంగా సూచించింది. ఒకవేళ నామినీ వివరాలు లేకపోతే, వారసత్వాన్ని నిరూపించుకోవడానికి అనేక పత్రాలు, ఎక్కువ పేపర్ వర్క్ చేయాల్సి వస్తుంది. మీ కుటుంబ సభ్యులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు దాచుకున్న డబ్బును సులభంగా పొందాలంటే, నామినీ వివరాలను తప్పనిసరిగా అప్‌డేట్ చేయండి.

Add Zee News as a Preferred Source
TAGS:
Reserve Bank of India