• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /200MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Huawei కొత్త ఫోన్ లాంచ్.. ధర తెలిస్తే షాకే!

200MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Huawei కొత్త ఫోన్ లాంచ్.. ధర తెలిస్తే షాకే!

Huawei Osta O1 Pro: ఎట్టకేలకు మార్కెట్‌లోకి హువావే ఓస్టా ఓ1 ప్రో స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయ్యింది. దీనిని కంపెనీ ప్రీమియం డిజైన్‌తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. అంతేకాకుండా ఇందులో కంపెనీ చాలా ప్రత్యేకమైన AI ఫీచర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 21, 2026, 14:57 IST|Updated: Nov 21, 2026, 14:58 IST
joinshare
200MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Huawei కొత్త ఫోన్ లాంచ్.. ధర తెలిస్తే షాకే!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Huawei Osta O1 Pro: ప్రముఖ టెక్ దిగ్గజం హువావే  స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరోసారి వినియోగదారుల కోసం దిమ్మతిరిగే స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ చేసింది.. సాధారణ ఫోన్లకు భిన్నంగా, సరికొత్త వైడ్ యాంగిల్ ఫార్మ్ ఫ్యాక్టర్‌తో హువావే ఓస్టా ఓ1 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ అధికారికంగా లాంచ్‌ చేసింది. అత్యాధునిక AI ఫీచర్లతో పాటు భారీ బ్యాటరీ, శక్తివంతమైన కెమెరా సెటప్‌తో అందుబాటులోకి రావడం వల్ల ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్‌ హాట్‌ టాఫిగ్‌గా మారింది. అయితే, దీనికి సంబంధించిన అన్ని రకాల వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

హువావే ఓస్టా ఓ1 ప్రో స్మార్ట్‌ఫోన్‌ అన్ని మొబైల్స్‌ డిజైన్స్‌ కంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో చాలా ప్రత్యేకమైన యాస్పెక్ట్ రేషియోతో 6.39-అంగుళాల 1.5K ఫ్లాట్ డిస్‌ప్లేను కంపెనీ అందించింది.. స్క్రీన్ అంచులు కేవలం 1.05 మిల్లీమీటర్ల మందంతో సన్నగా ఉండడం విశేషం.. అలాగే ఈ ఫోన్ కేవలం 6.68 మిల్లీమీటర్ల మందంతో చాలా నాజూకుగా.. చేతిలో పట్టుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటుంది..

ఈ స్మార్ట్‌ఫోన్‌లో కంపెనీ ఎంతో అద్భుతమైన హువావే కిరిన్ 9030S చిప్‌సెట్‌ ప్రాసెసర్‌తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. గరిష్టంగా 16GB ర్యామ్‌తో పాటు 1TB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లలో ఇది అందుబాటులో ఉండడం విశేషం.. అలాగే ఇది కొత్త హార్మొనీఓఎస్ 7 ఏఐ పయనీర్ ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో లాంచ్ అయ్యింది.. ఇందులో రోజు పనుల కోసం ప్రత్యేకంగా అనేక అడ్వాన్స్‌డ్ ఏఐ ఫీచర్లను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది..

ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఇందులో అద్భుతమైన 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కూడా అందించారు. అంతేకాకుండా ఇది చాలా అద్భుతమైన RYYB సెన్సార్‌తో కూడిన ఈ కెమెరా తక్కువ వెలుతురులోనూ అద్భుతమైన ఫోటోలు అందిస్తుందని కంపెనీ క్లైమ్‌ చేస్తోంది. దీనికి తోడుగా 50 మెగాపిక్సెల్ RYYB పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, రెడ్ మేపుల్ లెన్స్ కూడా లభించడం విశేషం.. అయితే, ఇందులో అల్ట్రావైడ్ కెమెరాను అందించలేద..

ఇంత సన్నని బాడీలోనూ ఏకంగా 7000mAh భారీ బ్యాటరీని అందుబాటులోకి తీసుకు రావడం విశేషం.. ఈ స్మార్ట్‌ఫోన్‌ స్పీడ్‌గా ఛార్జ్ చేయడానికి.. 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. సెక్యూరిటీ కోసం ఫోన్ పక్కభాగంలో ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది.. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ చైనా మార్కెట్‌లో లాంచ్‌ అయ్యింది. అయితే, ఇది కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.  

దీని బేస్ వేరియంట్ 12GB ర్యామ్‌తో పాటు 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ధర 5,499 యువాన్లతో అందుబాటులో ఉంది. అయితే, ఇది భారత కరెన్సీలో సుమారు రూ. 76,000 మాత్రమే అవుతుంది.. ఇక టాప్ వేరియంట్ 16GB ర్యామ్‌, 1TB స్టోరేజ్‌ వేరియంట్ ధర 8,799 యువాన్లుగా అందుబాటులో ఉంది. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.1,21,000 అవుతుంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Tech News
Telugu News