India bloc Protest: ఢిల్లీలో మరోసారి హైటెన్షన్.. పార్లమెంట్ నుంచి ఈసీకి ఇండియా కూటమి ఎంపీల ర్యాలీ.. భారీగా బలగాల మోహరింపు..
India bloc protest in delhi: పార్లమెంట్ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం వరకు ఇండి కూటమి ఎంపీలు ర్యాలీ చేపట్టారు. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ ఈసీకి వెళ్లేమార్గాలను బ్లాక్ చేశారు. ఈ పరిసర ప్రాంతంలో ఇంటర్నేట్ సేవలను సైతం నిలిపివేశారు.
India bloc protest march delhi: దేశ రాజధాని ఢిల్లీ మరోసారి ఆందోళనలతో అట్టుడికిపోతుంది. ముఖ్యంగా ఇండియా కూటమి నేతలు సర్ ప్రక్రియపై సీఈసీ జ్ఞానేష్ కుమార్ ను వెంటనే పదవి నుంచి తప్పించాలని నిరసనలకు దిగారు. పార్లమెంట్ ఆవరణ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం వరకు ఎంపీలు ర్యాలీని నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. ఎక్కడికక్కడ బారికెడ్లను ఏర్పాటు చేసి నిరసన కారులను అదుపుచేయడంపై చర్యలు తీసుకున్నారు.
ముఖ్యంగా... సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను వెంటనే పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఎంపీల ర్యాలీతో పోలీసుల అలర్ట్ అవ్వడంతో పాటు, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. దీంతో మొబైల్ డేటా సైతం నిలిచిపోయింది. సెంట్రల్ ఢిల్లీలో పలు మార్గాలలో రోడ్లను మూసివేశారు. సుమారు 3 వేల మంది పోలీసులతో భదత్ర ఏర్పాటు చేశారు.
ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ సర్ ప్రక్రియలో అక్రమాలు జరిగినట్లు విపక్షాలు నిరసనలకు దిగాయి. అక్రమ రీతిలో భారీగా ఓటర్లను తొలగించినట్లు విపక్షాలు తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నాయి. ఇండియా కూటమి చేపట్టిన ర్యాలీలో.. మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్ గాందీ, ప్రియాంక గాంధీ, అభిషేక్ బెనర్జీ , అఖిలేశ్ యాదవ్ తదితరులు ఆ మార్చ్‌లో పాల్గొననున్నారు.
పార్లమెంట్ మకర ద్వారం వద్దకు ఎంపీలు చేరుకున్నారు. నిర్వాచన్ సదన్ వరకు మార్చ్ నిర్వహించనున్నారు. సర్ ప్రక్రియ నేపథ్యంలో ఫోరమ్-6 దరఖాస్తులో మార్పులు చేసి ఈసీ అక్రమాలకు పాల్పడినట్లు అపోసిషన్ పార్టీల ఎంపీలు ఆరోపిస్తున్నారు. ఓట్ బచావో.. దేశ్ బచావో అంటూ నిరసనలకు దిగారు. దీంతో ఢిల్లీలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది.