SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

రైలు ప్రయాణికులు జాగ్రత్త! ఐడీ జిరాక్స్, ఫోన్‌లో చూపిస్తే సరిపోదు.. అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త రూల్ తప్పనిసరి!

భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ. అయితే, అక్టోబర్ మొదటి తేదీ నుంచి ఈ రైల్వేలో కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. రైలు ప్రయాణీకులు ఈ మార్పుల గురించి ముందుగానే తెలుసుకోవడం ముఖ్యం, లేకపోతే ఇబ్బందులు ఎదురవడమే కాకుండా భారీ జరిమానాలు కూడా చెల్లించాల్సి రావచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Written By Renuka Godugu
Published: Sep 30, 2026, 09:54 AM IST | Updated: Sep 30, 2026, 10:00 AM IST
Image Credit: Indian Railways new rule October 1
Join

భారతీయ రైల్వే రేపటి నుండి కఠినమైన నిబంధనలను అమలు చేయనుంది. ముఖ్యంగా టికెట్ తనిఖీ సమయంలో ఈ రూల్స్ వర్తిస్తాయి. పండుగ సీజన్ కావడంతో చాలా మంది ఊళ్లకు ప్రయాణాలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో కొత్త రైళ్లను ప్రకటించడంతో పాటు కొన్ని రైళ్ల సర్వీసులను పొడిగించారు. అక్టోబర్ 1 నుంచి 31 వరకు దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో కొందరు టికెట్ లేకుండా లేదా మోసపూరిత పద్ధతుల్లో ప్రయాణించే అవకాశం ఉంది. అందుకే, స్పెషల్ కోటాపై ప్రయాణించే వారు తప్పనిసరిగా గుర్తింపు కార్డు వెంట ఉంచుకోవాలని భారతీయ రైల్వే సూచించింది.

రైలు ప్రయాణికులు వివిధ రకాలుగా ప్రయాణిస్తుంటారు. ఒక సమూహంగా ప్రయాణించేటప్పుడు కనీసం ఒకరి వద్దనైనా చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు ఉండాలి. ఒకవేళ కుటుంబంతో కలిసి ప్రయాణిస్తున్నప్పుడు, సభ్యులలో ఎవరికైనా సరైన ఐడెంటిటీ ప్రూఫ్ ఉండేలా చూసుకోవాలి.

పండుగల సమయంలో రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల తనిఖీలు కూడా కఠినంగా ఉంటాయి. రిజర్వేషన్ కోటా ప్రయాణికులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కాబట్టి, అర్హత తెలిపే డాక్యుమెంట్లను వెంట ఉంచుకోవాలి. రైల్వే పాస్ ద్వారా ప్రయాణించే వారు కూడా ఒరిజినల్ డాక్యుమెంట్లను తప్పనిసరిగా కలిగి ఉండాలి.

అన్-రిజర్వ్డ్ టికెట్లతో ప్రయాణించే వారిని కూడా టీటీఈ తన యాప్ ద్వారా తనిఖీ చేయవచ్చు. మీరు రిజర్వేషన్ చేసుకున్నారా లేదా అనేది చెక్ చేసి, నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధించే అవకాశం ఉంది.

సాధారణంగా టికెట్ రిజర్వేషన్ 60 రోజుల ముందుగానే చేసుకోవచ్చు. వీటితో పాటు తత్కాల్ టికెట్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఇతరుల సీట్లలో మోసపూరితంగా ప్రయాణించి రైల్వే ఆదాయానికి నష్టం కలిగించకుండా ఉండటానికి ఈ ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. కాబట్టి, అందరూ సరైన టికెట్లతోనే ప్రయాణించాలి. టికెట్ లేకుండా లేదా రిజర్వేషన్ లేకుండా ప్రయాణించే వారికి భారీ జరిమానా విధించాలని రైల్వే నిర్ణయించింది.

మీ వద్ద సరైన ఫోటో ఉన్న వ్యాలీడ్ ఐడి కార్డు ఉండటం మంచిది. ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, స్కూల్ లేదా కాలేజీ ఐడి కార్డు, ఫోటో ఉన్న బ్యాంక్ పాస్‌బుక్ లేదా క్రెడిట్ కార్డు వంటి గుర్తింపు పత్రాలను వెంట ఉంచుకుంటే ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. గ్రూప్ బుకింగ్స్ ఉన్నప్పుడు కూడా ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల సమస్యలు తలెత్తవు

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES