SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

గేమింగ్ ప్రియులకు Infinix గుడ్‌న్యూస్.. GT 50 Pro ఫీచర్లు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Infinix Gt 50 Pro: ఇన్‌ఫినిక్స్ (Infinix) త్వరలోనే తమ యూజర్స్‌కి అద్భుతమైన శుభవార్తను అందించబోతోంది. మార్కెట్‌లోకి అద్భుతమైన మొబైల్‌ విడుదల చేయబోతోంది. దీనిని కంపెనీ భారీ బ్యాటరీతో లాంచ్‌ చేసేందుకు సిద్ధమైంది.

Reported By Dharmaraju Dhurishetty
Published: Oct 10, 2026, 12:41 PM IST | Updated: Oct 10, 2026, 12:48 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Infinix Gt 50 Pro: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఇన్‌ఫినిక్స్ (Infinix) గేమింగ్‌ ప్రియులకు త్వరలోనే గుడ్‌న్యూస్‌ చెప్పబోతోంది. త్వరలోనే మార్కెట్‌లో అత్యంత తక్కువ ధరలోనే ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. దీనిని కంపెనీ ఇన్‌ఫినిక్స్ జీటీ 50 ప్రో పేరుతో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. భారత్‌లో అక్టోబర్ 27న అధికారికంగా విడుదల చేయబోతున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. ఈ ఫోన్‌ ప్రముఖ ఈ కామర్స్‌ ఫ్లాట్‌ఫామ్‌ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్‌ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇందులో కంపెనీ గేమింగ్‌ సమయంలో ఫోన్‌ వేడెక్కకుండా ఉండేందుకు హైడ్రోఫ్లో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌ను కూడా అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇందులో లభించే ఫ్లో-ఛానల్ డిజైన్, డ్యూయల్-పంప్ సిస్టమ్‌ ఫోన్‌ వేడిని కూడా తగ్గించేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఇది అద్భుతమైన రంగులో కూడా అందుబాటులో ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల 1.5K అమోలెడ్ (AMOLED) డిస్‌ప్లేతో అందుబాటులోకి రాబోతోంది.. ఇందులో 144Hz హై-రిఫ్రెష్ రేట్‌తో పాటు 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉండడం వల్ల ఎండలోనూ స్క్రీన్ విజిబిలిటీ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. గేమింగ్‌తో పాటు మల్టీ టాస్కింగ్ కోసం ఇందులో మోస్ట్ పవర్‌ఫుల్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్టిమేట్ (MediaTek Dimensity 8400 Ultimate) ప్రాసెసర్‌తో అందుబాటులోకి రాబోతోంది.. ఇది మాలి-G720 గ్రాఫిక్స్ కార్డుతో రాబోతున్నట్లు తెలుస్తోంది.. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత XOS 16 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే 3 ఏళ్ల పాటు ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌గ్రేడ్స్‌తో పాటు 5 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తుందని కంపెనీ తెలిపింది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ అద్బుతమైన డ్యూయల్‌ కెమెరా సెటప్‌తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా ఇది ప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా అదనంగా  8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్ కెమెరాతో ఇది విడుదల కాబోఒతోంది. అలాగే ఫ్రంట్‌ భాగంలో 13 మెగాపిక్సెల్ కెమెరా అందించిన్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన బ్యాటరీ వివరాల్లోకి వెళితే.. ఈ ఫోన్‌ మోస్ట్ పవర్‌ఫుల్‌ 6,500mAh బ్యాటరీని కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీనికి తోడు 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో పాటు 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అందుబాటులో ఉండడం విశేషం.. సెక్యూరిటీ కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా లభిస్తోంది. ముఖ్యంగా భారీ బ్యాటరీ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది చాలా బెస్ట్ ఆప్షన్‌గా భావించవచ్చు.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES