Best Phones Under 10k On Amazon Sale: పండుగల సీజన్ సందర్భంగ ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభించింది. ఇందులో భాగంగా టీవీలతో పాటు ఫ్రిడ్జ్‌లు, అన్ని ఎలక్ట్రిక్ వస్తువులు, స్మార్ట్‌ఫోన్స్‌పై అద్భుతమైన ఆఫర్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఈ సేల్ మంచి స్మార్ట్‌ఫోన్స్ కొనుగోలు చేయాలనుకునేవారికి చాలా చీప్ ధరల్లో మంచి మంచి స్మార్ట్‌ఫోన్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇందులో భాగంగా కొనుగోలు చేస్తే డబుల్ ఆఫర్స్ లభిస్తున్నాయి. ముఖ్యంగా 5000mAh బ్యాటరీలు కలిగిన స్మార్ట్‌ఫోన్స్ ఇప్పుడు రూ.10 వేల లోపే సొంతం చేసుకోవచ్చు. అయితే, ఏయే స్మార్ట్‌ఫోన్ చీప్ ధరల్లో లభిస్తున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
రూ.10 వేల లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్స్..
రెడ్‌మీ 13సి (Redmi 13C):
తక్కువ ధరలో అద్భుతమై డిజైన్‌తో పాటు ప్రీమియం ప్రాసెసర్ కలిగి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి Redmi 13C బెస్ట్ ఆప్షన్‌గా భావించవచ్చు. ఇది ఎంతో అద్భుతమైన 6.74 అంగుళాల 90Hz డిస్‌ప్లేతో పాటు మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కూడా కలిగి ఉండడం విశేషం.. అయితే, ఇది కూడా 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అయితే, ఈ సేల్‌లో భాగంగా రూ. 8,000 ధరతో మాత్రమే అందుబాటులో ఉంది.
రియల్‌మీ సి53 (Realme C53):
ఈ రియల్‌మీ సి53 స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా ఇది 108 మెగాపిక్సెల్ హై-రిజల్యూషన్ కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. ఇది మోస్ట్ పవర్‌ఫుల్ 5000mAh బ్యాటరీతో పాటు 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు ఎన్నో రకాల కొత్త కొత్త ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, ఇది కూడా కేవలం రూ.9 వేలలోపే పొందవచ్చు.
సాంసంగ్ గెలాక్సీ ఎం14 (Samsung Galaxy M14 5G):
ఈ స్మార్ట్‌ఫోన్ కూడా అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో పాటు 5000mAh బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. మంచి బిల్డ్ క్వాలిటీ కోరుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ దాదాపు రూ. 9,500కే కొనుగోలు చేసే అవకాశం కూడా లభిస్తోంది.