Theft at Sweet Shop in tuni Kakinada: ఇటీవల చాలా మంది జల్సాలకు అలవాటు పడిన కొంత మంది యువకులు డబ్బుల కోసం అడ్డదార్లు తొక్కుతున్నారు. తరచుగా చోరీలకు పాల్పడుతున్నారు. బంగారం ధరలు పెరిగిన తర్వాత ఇటీవల చోరీల ఘటనలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. సింగిల్ గా ఉన్న వారు, వృద్దులను టార్గెట్ చేసి చోరీలు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం వార్తలలో ఉంటున్నాయి.
వింత దొంగ.. మిఠాయి తింటూ నగదు చోరీ కాకినాడ జిల్లా తునిలో వెలుగు చూసిన ఘటన బొంబాయి స్వీట్స్ దుకాణంలో తాళాలు పగలగొట్టి చొరబడిన దొంగ షాపులో మిఠాయిలు తింటూ.. క్యాష్ కౌంటర్‌లో ఉన్న డబ్బులు చోరీ షాప్‌లో సీసీ కెమెరా చూసి షాక్.. వెంటనే కనెక్షన్ కట్ చేసిన దొంగ షాప్‌లో మొత్తం రూ.4 వేల నగదు చోరీ అయినట్లు యజమాని వెల్లడి షాప్ ఓనర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు
— PulseNewsBreaking (@pulsenewsbreak) October 10, 2026
కొంత మంది చోరీలకు వచ్చి ఇంట్లోని పదార్థాలు తింటు ఉంటారు. మరికొంత మంది తప్పతాగి ఇంట్లోనే పడుకున్న ఘటనలు కూడా వార్తలలో నిలిచాయి. ఈక్రమంలో కాకినాడలోని స్వీట్ షాపులో ఒక వెరైటీ చోరీ నెట్టింట వైరల్గా మారింది.
ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా తునిలో ఒక చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక దొంగ
బొంబాయి స్వీట్స్ దుకాణంలో తాళాలు పగలగొట్టి చొరబడ్డాడు. అంతే కాకుండా అక్కడున్న క్యాష్ కౌంటర్ లోని డబ్బులను తన జేబులో వేసుకున్నాడు.
ఆతర్వాత అక్కడున్న స్వీట్లను చూసి అతని నోట్లో నీళ్లు ఊరాయో ఏంటో కానీ వెంటనే స్వీట్లు తిన్నాడు. మరల సీసీ కెమెరాల కనెక్షన్ ను కట్ చేసి అక్కడి నుంచి పారిపోయాడు. అయితే మరుసటి రోజు స్వీట్ షాప్ ఓనర్ వచ్చిచూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.
షాప్ ఓనర్ పోలీసులతో పాటు సీసీ ఫుటేజీని పరిశీలించగా దొంగ కదలికలు రికార్డు అయ్యాయి. అతను మొత్తం 4 వేల నగదు చోరీ చేసి, స్వీట్ లు తినడం దానిలో స్పష్టంగా రికార్డు అయ్యింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ వింత చోరీకి చెందిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.