• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /తీవ్ర గాయాలతో విలవిల్లాడిన నాగుపాము.. ప్రాణాలకు తెగించి స్నేక్ క్యాచర్ చేసిన పని వైరల్!

తీవ్ర గాయాలతో విలవిల్లాడిన నాగుపాము.. ప్రాణాలకు తెగించి స్నేక్ క్యాచర్ చేసిన పని వైరల్!

Injured Cobra Viral News: తీవ్ర గాయాల పాలైన ఒక ప్రమాదకరమైన నాగుపాముకు స్నేక్ క్యాచర్ ప్రథమ చికిత్స చేసిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ వీడియోలో ఆ పాము తీవ్రంగా గాయపడటంతో పసుపు మిశ్రమంతో ఆ పాముకు చికిత్స అందించాడు. ప్రమాదకరమైనప్పటికీ ఇలా చేయడంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి..

Reported ByDharmaraju DhurishettyEdited ByDharmaraju Dhurishetty
Published: Sep 20, 2026, 02:21 PM IST|Updated: Sep 20, 2026, 02:23 PM IST
joinshare
తీవ్ర గాయాలతో విలవిల్లాడిన నాగుపాము.. ప్రాణాలకు తెగించి స్నేక్ క్యాచర్ చేసిన పని వైరల్!
Image Credit: తీవ్ర గాయాలతో విలవిల్లాడిన నాగుపాము.. ప్రాణాలకు తెగించి స్నేక్ క్యాచర్ చేసిన పని వైరల్!

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Injured Cobra Video: సాధారణంగా పాము పేరు వింటేనే చాలామంది భయపడి పరుగులు పెడుతూ ఉంటారు.. అలాంటిది ఎదురుగా ప్రాణాంతక విషమున్న నాగుపాము కనిపిస్తే భయంతో ఏం చేస్తారో ఎవరికీ తెలీదు. కానీ మూగ జీవి ఏ రూపంలో ఉన్న.. ఆపదలో ఉంటే కాపాడాలని మానవత్వానికి ప్రతిరూపంగా నిలిచాడు ఒక స్నేక్ క్యాచర్.. ప్రాణాలకి ముప్పు వాటిల్లే అవకాశం ఉన్న ఏమాత్రం వెనకడుగు వేయకుండా.. తీవ్రంగా గాయపడిన ఒక నాకు పాముకు వైద్యం అందించిన అరుదైన దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. దీనికి సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..


వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళితే.. ఒక భారీ నాగుపాము తల భాగంలో తీవ్ర గాయాలు కావడంతో బాధపడుతూ ఎటు వెళ్లలేని పరిస్థితిలో కనిపించింది. ఆ పాము ఎంత విషపూరితమైనదో తెలిసినప్పటికీ.. అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ దానిని చంపే ప్రయత్నం అస్సలు చేయలేకపోయాడు.. అంతేకాకుండా దానిని తట్టుకోకుండా అలాగే ఉండిపోయాడు.. అలాగని దాని బాధను చూస్తూ ఊరుకోలేదు.. ఆ గాయాన్ని మానిపించేందుకు మన సాంప్రదాయ ఔషధమైన పసుపును మిశ్రమంగా కలుపుకున్నాడు..

పాము దగ్గరకు వెళ్లడం అత్యంత ప్రమాదం కావడంతో.. అతడు తన వద్ద ఉన్న పొడవైన స్నేక్ స్టిక్ సహాయం తీసుకొని.. ఎర్ర చివర పసుపు ముద్దను ఉంచి.. పాముకు కాస్త దూరంగా నిలబడి అత్యంత చాకచక్యంగా దాని తలపై గాయమైన భాగంలో ఎంతో నెమ్మదిగా పూశాడు.. మొదట పాము కాస్త.. ఎంతో ఇబ్బంది పడినప్పటికీ.. అతను నెమ్మదిగా పోస్తూ ఉండడంతో.. అక్కడే కొద్దిసేపు ఉండి ఆ పసుపు మిశ్రమాన్ని మొత్తం పూయించుకోవడం మీరు ఈ వీడియోలో చూడొచ్చు..

మన నిత్యజీవితంలో పసుపును యాంటీసెప్టిక్, యాంటీబయాటిక్ గుణాలున్న ఔషధంగా వినియోగించడం సర్వసాధారణం.. జంతువులతో పాటు సంస్కృపాల గాయాలపై రసాయన మందుల కంటే పసుపు వంటి సహజ సిద్ధమైన పదార్థాలు వేగంగా పనిచేస్తాయని వన్యప్రాణి సంరక్షకులు చెబుతూ ఉంటారు. ఆ స్నేక్ క్యాచర్ కూడా అదే పద్ధతిలో పాముకు ప్రథమ చికిత్స అందించడం విశేషం..

 

 

 

 

View this post on Instagram

 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Manish Kumar Sony (@manishsony_00m)

ఈ వీడియో ఇంస్టాగ్రామ్ తో పాటు ఇతర సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే విపరీతంగా వ్యూసును సంపాదించుకుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. చాలామంది ఈ వీడియో చూసినవారు కామెంట్లు కూడా పెడుతున్నారు. విషమున్న పాము అని చూడకుండా దాని బాధను అర్థం చేసుకొని కాపాడిన ఆ వ్యక్తి నిజమైన హీరో అంటూ కొంతమంది కామెంట్లు పెడుతూ ఉంటే.. మరి కొంతమంది మానవత్వం అంటే మనుషులకే కాదు.. ఇలాంటి మూగజీవుల పట్ల కూడా చూపాలి అంటూ కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి జీవులను కూడా ప్రేమతో ఎలా చూసుకోవాలో ఈ వీడియో నేర్పిస్తుంది అంటూ మరికొంతమంది కామెంట్లు చేయడం విశేషం..
 

ఇది కూడా చదవండి..: చుట్టూ జనం.. మధ్యలో భయంతో వణికిన యువకుడు.. స్నేహితురాలు చేసిన పని వైరల్‌!

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News