SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

iQOO 16 ఫోన్‌ వచ్చేస్తోంది.. భారీగా ధరతో విడుదలయ్యే ఛాన్స్!

iQOO 16 India Launch: భాతర మార్కెట్‌లోకి ఎంతో అద్బుతమైన ఐకూ 16 స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. దీనిని కంపెనీ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అయితే, దీనికి సంబందించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Reported By Dharmaraju Dhurishetty
Published: Oct 07, 2026, 12:22 PM IST | Updated: Oct 07, 2026, 12:24 PM IST
Image Credit: జీ తెలుగు న్యూస్..
Join

iQOO 16 India Launch: స్మార్ట్‌ఫోన్‌ ప్రియులు, ముఖ్యంగా గేమింగ్‌ లవర్స్‌ ఎంతగానో ఇష్టపడే వీవో అనుబంధ బ్రాండ్‌ ఐకూ త్వరలోనే మార్కెట్‌లోకి తమ ఫ్లాగ్‌షిఫ్‌ మొబైల్‌ ఐకూ 16 (iQOO 16)ను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ చైనా మార్కెట్లో ఇప్పటికే లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.. గతంలో అందుబాటులోకి వచ్చిన ఐకూ 15కు సక్సెసర్‌గా ఈ iQOO 16 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిని కంపెనీ ఈసారీ భారీ ధరతో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు లీక్‌ అయిన వివరాలు చెబుతున్నాయి. దీని కారణంగా వినియోగదారులకు మరింత భారీ పడుతుంది. అయితే, దీనికి సంబంధించిన లీక్‌ అయిన వివరాలు ఇప్పుడు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

30 శాతానికి పైగా ధర పెరిగే ఛాన్స్‌!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వివరాల ప్రకారం.. ఐకూ 16 స్మార్ట్‌ఫోన్‌పై ప్రస్తుతం భారతదేశంలో చివరి దశ టెస్టింగ్ జరుపుతుందని.. గతంతో విడుదలైన ఐకూ 15 భారత్‌లో రూ. 72,999 ధరతో అందుబాటుఐకూ 15 భారత్‌లో రూ. 72,999 ధరతో అందుబాటులోకి వచ్చిందని.. త్వరలోనే రాబోతున్న ఐకూ 16 ధర దానికంటే దాదాపు 30 నుంచి 37 శాతం  పెరిగే అవకాశాలు ఉన్నట్లు లీక్‌ అయిన వివరాలు చెబుతున్నాయి. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్‌ భారీ మార్కెట్‌లో అత్యంత ఖరీదైనదిగా లాంచ్‌ అయ్యే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.

అలాగే ఇటీవలే గీక్‌బెంచ్ (Geekbench) వెబ్‌సైట్‌లో కూడా vivo I2607 మోడల్ నంబర్‌తో గ్లోబల్‌ వేరియంట్ కనిపించిన్నట్లు తెలుస్తోంది. ఈ లిస్టింగ్‌లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ సిరీస్ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌తో అందుబాటులోకి రాబోతోంది. అలాగే ఇది అడ్రినో జీపీయూపై పని చేస్తుంది.. లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అయ్యే ఛాన్స్‌లు ఉన్నట్లు తెలుస్తోంది.

ఫీచర్లు, స్పెసిఫికేషన్ల వివరాలు..
ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.85 అంగుళాల 2K ప్లస్‌ సాంసంగ్‌ LTPO అమోలెడ్ ప్యానెల్‌లో పాటు 165Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 10,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ సపోర్ట్‌తో అందుబాటులోకి రాబోతోంది.

ఇది చాలా అద్భుతమైన కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు లీక్‌ అయిన వివరాలు చెబుతున్నాయి. దీని వెనక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 3x జూమ్‌తో 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటోతో ట్రిపుల్ కెమెరా సపోర్ట్‌ కూడా అందుబాటులో ఉంది.. ఫ్రంట్‌ భాగంలో సెల్ఫీల కోసం.. 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కూడా కలిగి ఉంటుంది..

గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇందులో మోస్ట్ పవర్‌ఫుల్ 8,400 mAh భారీ బ్యాటరీతో పాటు 100W అల్ట్రా-ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌తో పాటు 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఇన్‌-డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో పాటు 5G, వై-ఫై, బ్లూటూత్ వంటి కనెక్టివిటీ ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుంది. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES