Jaier 2 Censor Review: దసరాకు విడులకు కాబోతున్న రజినీకాంత్ ‘జైలర్ 2’ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రాన్ని తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ తెలుగులో విడుదల చేస్తోంది. తాజాగా విడుదలైన ‘జైలర్ 2’ సినిమా మొదటి భాగానికి కొనసాగింపుగా తన కుటుంబానికీ, సమాజానికి ద్రోహం
చేసిన వారిని ఎలా అంతం మొందిచ్చాడనేదే ఈ సినిమా స్టోరీ అని సెన్సార్ వాళ్లు చెబుతున్నారు.
100 నిమిషాల ఫుటేజ్ హుష్ కాకి..
సెన్సార్ వాళ్లు ఈ సినిమా మాస్‌కు గూస్ బంప్స్ తెప్పించడం ఖాయం అంటున్నారు. ఈ సినిమాను దాదాపు 4 గంటల ఫుటెజ్ వచ్చినట్టు సమాచారం.అందులో 100 నిమిషాలు ఫుటేజ్ లేపేసినట్టు సమాచారం. దాన్ని ఆ తర్వాత ఓటీటీ వేదికగా విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఈ సినిమా నిడివి 2 గంటల 45 నిమిషాలు వచ్చినట్టు తెలిపారు. అంతేకాదు కొన్ని రక్తపాత సన్నివేశాలు ఉండటంతో ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు U/A +16 సర్టిఫికేట్ జారీ చేసారు. అంతేకాదు ముత్తువేల్ పాండ్యన్ గా మరోసారి మ్యాజిక్ చేసినట్టు చెబుతున్నారు.
జైలర్ 2లో అదిరిపోయిన హృతిక్ రోషన్ క్యారెక్టర్ ..
టైగర్‌కా హుకుం అన్నట్టుగా ‘జైలర్ 2’లో జైళ్లకు సంబంధించిన కొన్ని సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయని చెబుతున్నరు. మిథున్ చక్రబర్తి క్యారెక్టర్ ఈ సినిమాలో స్పెషల్‌గా ఉండబోతున్నట్టు సమాచారం. . ‘జైలర్’ మూవీలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ కెమియోలు ఈ సినిమాకు కలిసొచ్చాయి. ఈ సినిమాలో కూడా మోహన్‌లాల్, శివరాజ్ కుమార్, హృతిక్ రోషన్, విజయ్ సేతుపతిల కెమియోలు ఈ సినిమాలో మరోసారి ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయని చెబుతున్నారు.
జైలర్ 2 నటీనటులు..
ఈ చిత్రంలో ఇతర ముఖ్యపాత్రల్లో రమ్యకృష్ణ, విద్యాబాలన్, మిర్నా, సూరజ్ వెంజారమూడు ఇతర ముఖ్యపాత్రల్లో నటించనున్నారు. ఇక తెలుగులో ‘జైలర్ 2’ రైట్స్‌ను సితార నాగవంశీ రూ. 90 కోట్లకు కొన్నట్టు సమాచారం. ఇది చాలా ఎక్కువ అని తెలుసు. అది కూడా అడ్వాన్స్‌డ్ పద్థతిలో రిలీజ్ చేస్తున్నారు.