• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /కింగ్ కోబ్రాతో చేతిపై కాటు వేయించుకున్న యువకుడు.. వీడియో వైరల్!

కింగ్ కోబ్రాతో చేతిపై కాటు వేయించుకున్న యువకుడు.. వీడియో వైరల్!

Cobra Viral Video: తాజాగా సోషల్ మీడియాలో ఒక వ్యక్తి కోబ్రాను మెడలో వేసుకుని.. తన మరో చేతితో కాటు వేయించుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అయితే, పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Reported ByDharmaraju DhurishettyEdited ByDharmaraju Dhurishetty
Published: Sep 24, 2026, 02:15 PM IST|Updated: Sep 24, 2026, 02:17 PM IST
joinshare
కింగ్ కోబ్రాతో చేతిపై కాటు వేయించుకున్న యువకుడు.. వీడియో వైరల్!
Image Credit: జీ తెలుగు న్యూస్..

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Cobra Viral Video: సోషల్ మీడియాలో లైకులతో పాటు వ్యూస్‌ కోసం కొంతమంది యువకులు ఎంతటి ప్రమాదకరమైన విన్యాసాలకైనా తెగబడుతూ వస్తున్నారు. ప్రాణాలనే పణంగా పెడుతూ చేసే కొన్ని రకాల పిచ్చి పనులు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. తాజాగా ఒళ్లు గగుర్పొడిచే రీతిలో ఒక యువకుడు అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రాతో చేసిన ప్రమాదకర విన్యాసం సోషల్ మీడియాను షేక్‌ చేస్తోంది. అయితే, దీనికి సంబంధించిర పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళితే... ఒక యువకుడు ఎంతో ప్రమాదకరైన కింగ్ కోబ్రా పామును ఏకంగా తన మెడ చుట్టూ వేసుకుని కనిపించడం మీకు చూడొచ్చు. అంతటితో ఆగకుండా.. ఒక చేత్తో ఆ పాము తల భాగాన్ని పట్టుకుని.. కావాలనే తన మరో చేతి వైపు దానిని తీసుకెళ్లడం చూసిన సోసల్‌ మీడియా వినియోగదారులు షాక్‌ అయిపోయారు.. తీవ్ర కోపంతో ఉన్న ఆ కోబ్రా యువకుడి చేతిపై ఎంతో బలంగా కాటు వేయడం మీరు గమనించవచ్చు. పాము పళ్లు గుచ్చుకోవడంతో ఆ యువకుడి చేతి నుంచి రక్తం కారడం కూడా వీడియోలో స్పష్టంగా చూడొచ్చు.

అక్కడే ఉన్న మరొక వ్యక్తి ఈ దృశ్యాన్ని ఏమాత్రం ఆపకుండా తన దగ్గర ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ క్లిప్ కాస్తా ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు ఎక్స్, ఫేస్‌బుక్‌లలో విపరీతంగా చక్కర్లు కొడుతూ వైరల్‌గా ప్రస్తుతం మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్షణాల్లో ప్రాణం తీసే విషమున్న కింగ్ కోబ్రాతో ఇలాంటి వెర్రి చేష్టలేంటి?.. అని కొంతమంది కామెంట్లు పెడుతుంటే.. మరికొంతమంది సోషల్ మీడియా క్రేజ్ కోసం ఇంతలా ప్రాణాలతో చెలగాటమాడాలా? అంటూ ఘాటుగా కామెంట్లు చేస్తూ వస్తున్నారు. ఆ సమయంలో అపస్మారక స్థితిలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని.. రీల్స్‌ కోసం ఇలాంటి పనులు చేయడం ఆత్మహత్యాయత్నంతో సమానమని చాలా మంది నిపుణులు హెచ్చరిస్తూ వస్తున్నారు.

 

 

 

 

View this post on Instagram

 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Anil Ranagatte (@naralemurgeshnaralemurgesh)

కింగ్ కోబ్రా వంటి వన్యప్రాణులను హింసించడంతో పాటు వాటితో ప్రమాదకర స్టంట్లు చేయడం వన్యప్రాణి సంరక్షణ చట్టం (Wildlife Protection Act) ప్రకారం.. నాన్-బెయిలబుల్ నేరమని అటవీశాఖ అధికారులు కొంతమంది  ఈ వీడియో ట్యాగ్‌ చేస్తూ కామెంట్లు కూడా పెడుతున్నారు. ఈ వీడియో ఎక్కడ రికార్డ్ అయిందనే.. దానిపై అధికారులు ఆరా తీస్తున్నట్లు కూడా తెలుస్తోంది.. ఇలాంటి పిచ్చి చేష్టలను సోషల్ మీడియాలో ప్రోత్సహించకూడదని.. వాటిని చూసి ఇతరులు అనుసరించే ప్రమాదముందని సైబర్ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు..
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News