SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Cobra Attack Video: వామ్మో.. క్షణాల్లో దాడి చేసిన కింగ్ కోబ్రా.. వైరల్ వీడియో!

Cobra Attack Video: తాజాగా సోషల్ మీడియాలో ఒక వ్యక్తి పాము పట్టుకుంటున్న క్రమంలో అది కాటు వేసింది. దీనికి సంబంధించిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే, దీనిని చూసిన వారు షాక్‌ అవుతున్నారు.

Written By Dharmaraju Dhurishetty
Published: Oct 24, 2026, 01:26 PM IST | Updated: Oct 24, 2026, 01:28 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Cobra Attack Video: సోషల్‌ మీడియాల్లో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్‌ అవుతూ ఉంటాయి.. వాటిలోనూ ప్రమాదకరమైన విషసర్పాలకు సంబంధించిన క్లిప్స్ నెటిజన్లను క్షణాల్లో ఆకర్షిస్తూ ఉంటాయి. తాజాగా అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రాను రెస్క్యూ చేసి.. పట్టుకునేందుకు ప్రయత్నించిన ఓ స్నేక్ క్యాచర్‌పై అది ఒక్కసారిగా దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.. కేవలం క్షణాల వ్యవధిలో ఆ పాము నేరుగా అతని ఎడమ చేతిపై కాటు వేయడం చూసి అందరూ షాక్‌ అవుతున్నారు.

సాధారణంగా గ్రామాలతో పాటు నివాస ప్రాంతాల్లోకి పాములు వచ్చినప్పుడు.. వాటిని సురక్షితంగా పట్టుకుని అడవుల్లో విడిచిపెట్టేందుకు స్నేక్ క్యాచర్లకు సమాచారం అందిస్తూ ఉంటారు.. వైరల్ అవుతున్న ఈ వీడియోలో కూడా సదరు స్నేక్ క్యాచర్.. కింగ్ కోబ్రాను రక్షించే ప్రక్రియలో భాగంగా దాన్ని బంధించేందుకు ప్రయత్నించడం మీరు చూడోచ్చు.. పడగ విప్పి.. అత్యంత ఉగ్రరూపంలో ఉన్న ఆ భారీ నాగుపాము దాని ఉనికిని కాపాడుకునేందుకు ఎంతగా ప్రయత్నిస్తుందో మీరు ఈ వీడియోలో క్లియర్‌గా చూడోచ్చు. అయితే, ఆ పాము కదలికలను అంచనా వేసే క్రమంలో చిన్నపాటి పొరపాటు జరిగినట్లు తెలుస్తోంది.. అది క్షణాల వ్యవధిలో అతనిపై ఏమాత్రం ఊహించని రీతిలో అతని ఎడమ చేతిని గురిచూసి బలంగా దాడి చేయడం మీరు గమనించవచ్చు.

ఈ ఘటనతో అక్కడున్న స్థానికులు భయభ్రాంతులకు గురైట్లు తెలుస్తోంది.. కింగ్ కోబ్రా కాటు వల్ల రక్తనాళాలతో పాటు నాడీ వ్యవస్థపై తక్షణ ప్రభావం చూపేంత తీవ్రమైన విషం శరీరంలోకి చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. పాము కాటు వేసిన వెంటనే స్నేక్ క్యాచర్‌ బాధ, తీవ్రమైన షాక్‌కు గురయ్యాడనేది వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. కాటు వేసిన వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి యాంటీ-వెనమ్ చికిత్స అందించారా లేదా అనే విషయంపై ఇంక పూర్తిగా క్లారిటీ రాలేదు..

ఈ వీడియో చూసిన జంతు ప్రేమికులతో పాటు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు.. ఎంతటి అనుభవం ఉన్నప్పటికీ.. ప్రమాదకరమైన పాములను పట్టుకునేటప్పుడు తప్పకుండా జాగ్రత్తగా ఉండాల్సి అవసరం ఎంతగానో ఉందని నిపుణులు తెలుపుతున్నారు.. వాటిని పట్టుకునే క్రమంలో చేతులకి, కాళ్లకు తొడుగులు ధరించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. అది ప్రాణాలకే ప్రమాదకరంగా మారుతుందనడానికి ఈ ఘటన ఒక స్పష్టమైన హెచ్చరికగా నిలుస్తూ వస్తోంది..
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES