SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

కోబ్రా తలపై మెరిసే నాగమణి.. నిజంగానే ఉందా? వీడియో ఇదే..

Nagamani Video: కింగ్‌ కోబ్రాకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో అత్యంత ప్రమాదకరమైన ఆ పాము తల భాగంలో నాగమణి ఉండడం మీరు గమనించవచ్చు. అయితే, ఈ వీడియోను చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Written By Dharmaraju Dhurishetty
Published: Oct 16, 2026, 04:08 PM IST | Updated: Oct 16, 2026, 04:09 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Nagamani Viral Video: సాధారణంగా కింగ్‌ కోబ్రా పడగ విప్పితేనే.. భయం పుడుతూ ఉంటుంది.. అలాంటిది పురాణాలతో పాటు పాతకాలం నాటి కథల్లో వినే నాగమణిని ఓ పాము తలపై ప్రత్యక్షంగా కనిపిస్తే.. ఎవరైనా ఆశ్చర్యపోవడం ఖాయం.. తాజాగా సోషల్ మీడియాలో అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రాకు సంబంధించిన ఓ రీల్‌ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.. అందులో కనిపిస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియా వినియోగదారులను ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ఈ వీడియో చూసినవారు కామెంట్లు పెడుతున్నారు. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వైరల్ అవుతున్న వివరాల్లోకి వెళితే.. ఓ ఖాళీ మైదానంలో భారీ కింగ్‌ కోబ్రా పడగ విప్పి అత్యంత ప్రమాదకరంగా నిలబడి ఉండడం మీరు గమనించవచ్చు.. దాని పడగ పైభాగంలో ఓ మణి లాంటి మెరిసే.. వస్తువు కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.. సాధారణంగా పాము అటుఇటు కదలికలు చేసినప్పుడు.. ఏవైనా వస్తువులు దాని పడగ భాగం నుంచి జారిపడిపోతాయి.. కానీ ఈ వీడియోలో ఆ కింగ్ కోబ్రా పడగను ఎంతో వేగంగా.. అటూఇటూ ఊపుతూ.. తీవ్ర ఆగ్రహంతో బుసలు కొడుతున్నప్పటికీ, ఆ మణి దాని తల భాగంపైనే అతుక్కుని ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది..

ఈ వీడియో పోస్ట్ అయిన కొద్ది రోజుల్లోనే విపరీతంగా షేర్‌ అవుతోంది. అంతేకాకుండా సోషల్ మీడియాల్లో వేలాది లైకులతో ట్రెండ్ అవుతతూ వస్తోంది.. అయితే, దీనిపై నెటిజన్లు రకాలుగా స్పందిస్తూ వస్తున్నారు.. పురాణాల్లో విన్న నాగమణి నిజంగానే ఉందా? అని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు మాత్రం ఇది ఫేక్ అని కొట్టిపారేస్తూ వస్తున్నారు..

సైన్స్ నిపుణులు అందించిన సమాచారం ప్రకారం.. పాముల తలలో ఎలాంటి మణులు ఉండవని.. కెమెరా ట్రిక్స్‌తో పాటు ఎడిటింగ్, ఏఐ (AI) గ్రాఫిక్స్‌ను వినియోగించి.. దీనిని సృష్టించారని.. లేదంటే పాము తలపై ఏదైనా గమ్ లేదా ఇతర పదార్థాలతో ఆ వస్తువును అతికించి ఆ మూగజీవిని హింసించి ఉండవచ్చని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అయితే, ఈ వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్‌ అవుతూ వస్తోంది.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES