• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /ఒక్కసారి ఛార్జ్ చేస్తే 950 గంటల స్టాండ్‌బై.. Lava కొత్త ఫోన్ ఫీచర్లు ఇవే!

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 950 గంటల స్టాండ్‌బై.. Lava కొత్త ఫోన్ ఫీచర్లు ఇవే!

Lava Smart 4 Pro: మార్కెట్‌లోకి లావా స్మార్ట్ 4 ప్రో స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో ప్రత్యేకమైన కలర్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది. ముఖ్యంగా ఇది ఎంతో శక్తివంతమైన 7,000mAh లిథియం అయాన్ బ్యాటరీతో విడుదలవ్వడం విశేషం..

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 20, 2026, 14:35 IST|Updated: Nov 20, 2026, 14:37 IST
joinshare
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 950 గంటల స్టాండ్‌బై.. Lava కొత్త ఫోన్ ఫీచర్లు ఇవే!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Lava Smart 4 Pro: భారతీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా.. బడ్జెట్ కస్టమర్స్‌ను దృష్టిలో పెట్టుకుని తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ లావా స్మార్ట్ 4 ప్రోను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది.. ఈ ఫోన్‌లో అద్భుతమైన 7,000mAh భారీ బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. లావా కంపెనీ ఇప్పటివరకు తీసుకొచ్చిన స్మార్ట్‌ఫోన్లన్నింటిలో ఇదే అత్యధిక బ్యాటరీతో అందుబాటులోకి రావడం విశేషం.. అయితే, ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.,

లావా స్మార్ట్ 4 ప్రో స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన స్టోరేజ్‌ వివరాల్లోకి వెళితే... ఇది 4GB ర్యామ్‌తో పాటు 64GB స్టోరేజ్ వేరియంట్‌తో లభిస్తోంది. దీని ధరను కంపెనీ రూ.10,999తో అందుబాటులోకి తీసుకు వచ్చిన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది నీలం బ్లూతో పాటు కోనార్క్ గోల్డ్ అనే రెండు అద్భుతమైన కలర్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది. ఆన్‌లైన్ కాకుండా.. దేశవ్యాప్తంగా ఉన్న లావా ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో మాత్రమే ఈ ఫోన్ ప్రత్యేకంగా అందుబాటులోకి వచ్చిన్నట్లు తెలుస్తోంది..

ఈ ఫోన్‌లోని ఎంతో శక్తివంతమైన 7,000mAh లిథియం అయాన్ బ్యాటరీతో పాటు 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా USB టైప్ సి పోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే.. ఏకంగా 950 గంటల వరకు స్టాండ్‌బై సమయాన్ని.. అలాగే 748 నిమిషాల పాటు యూట్యూబ్ వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుందని కంపెనీ క్లైమ్‌ చేస్తోంది..

ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.75-అంగుళాల HD ప్లస్‌ నాచ్ డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుంది.. అంతేకాకుండా ఇది ఎంతో శక్తివంతమైన UNISOC T610 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉంటుందని కంపెనీ వెల్లడించింది.. 4GB అసలు ర్యామ్‌కు అదనంగా మరో 4GB వర్చువల్ RAM సపోర్ట్‌ కూడా ఉండడంతో మొత్తం 8GB ర్యామ్‌ వరకు పొందవచ్చు. ఇది 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను మైక్రో SD కార్డ్ సపోర్ట్‌తో పాటు 512GB వరకు పెంచుకునే ఛాన్స్‌ కూడా లభిస్తోంది. ఇవే కాకుండా ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.

ఈ ఫోన్ అద్భుతమైన ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్‌ అవుతుందని కంపెనీ వెల్లడించింది. వినియోగదారులకు ఎలాంటి Ads లేదా అనవసరపు యాప్‌ల రాకుండా ఇందులో క్లీన్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను కూడా అందిస్తోంది. దీనికి రెండేళ్ల పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్‌లను కూడా లభిస్తున్నట్లు కంపెనీ క్లైమ్‌ చేస్తోంది. అంతేకాకుండా ఫోన్ కిందపడినా తట్టుకునేలా డ్రాప్, షాక్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌ను పొందినట్లు తెలుస్తోంది..

కెమెరాకు సంబంధించిన ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే.. వెనుకవైపు 13 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు సెల్ఫీల కోసం స్క్రీన్ ఫ్లాష్‌తో 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా లభిస్తోంది. సెక్యూరిటీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్స్‌ను కూడా అందిస్తోంది. ఇవే కాకుండా ఎన్నో ప్రత్యేకమైన ఫీచర్స్‌ కూడా లభిస్తున్నట్లు తెలుస్తోంది. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
Tech News
Telugu News