SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Maharashtra: నా పిల్లను చంపుతావా..?.. చిరుత పులి కూనపై శునకం ప్రతీకారం.. మహారాష్ట్రలో ఆసక్తికర ఘటన..

Mother dog kills leopard cub in maharashtra: మహారాష్ట్ర‌లోని బీడ్ లోని దౌలవడ్గావ్ గ్రామంలో అడవి నుంచి బైటకు వచ్చిన చిరుత కుక్క పిల్లపై దాడిచేసి చంపేసింది. గంటల వ్యవధిలోనే తల్లి శునకం అక్కడకు వచ్చి తన పిల్లను చూసి కోపంతో చెట్లలో ఉన్న చిరుత పిల్లపై దాడి చేసి దాన్ని చంపేసింది. తల్లి శునకం ప్రతీకారం తీర్చుకుందని గ్రామస్తులు వింతగా మాట్లాడుకుంటున్నారు.

Written By Inamdar Paresh
Published: Nov 25, 2026, 17:25 IST | Updated: Nov 25, 2026, 17:50 IST
Image Credit: Mother dog kills leopard cub in maharashtra:
Join

Leopard kills puppy and its mother dog kills leopard cub in Maharashtra: సమాజంలో తల్లిని మించిన దైవంలేదని చెప్తుంటారు. తన పిల్లల కోసం ఎంతటి త్యాగాలు చేసేందుకైన, ఎలాంటి సవాళ్లు ఎదుర్కొనేందుకైన రెడీగా ఉంటుంది. అయితే.. మనుషుల్లోనే కాదు.. నోరు లేని జీవాల్లో సైతం తల్లి ప్రేమ ఒకేలా ఉంటుంది. తన పిల్లల జోలికి వస్తే  నోరులేని జీవాలు సైతం అస్సలు విడిచి పెట్టవు. తమకన్నా ఎంత పెద్ద జీవులతో అయిన ఫైటింగ్ కు రెడీ అయిపోతాయి.  తమ పిల్లల్ని ఇతర జంతువుల బారి నుంచి జాగ్రత్తగా కాపాడుకుంటాయి.

ఈ క్రమంలో మహారాష్ట్రలోని బీడ్ లో ఒక శునకం తల్లి పిల్లను చంపిందని చిరుతపై ప్రతీకారం తీర్చుకుంది.ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఆష్టీ తాలూకా పరిధిలోని దౌలవడ్గావ్ గ్రామంలో అడవి నుంచి ఒక చిరుత పులి బైటకు వచ్చి శునకంపిల్లపై దాడి చేసింది చంపేంది. ఆ తర్వాత కాసేటికి తల్లి శునకం అక్కడకు వచ్చి మరీ విగత జీవిలా మారిన పసికూన చుట్టు తిరుగుతూ చాలా సేపు ఉండిపోయింది. గంటల వ్యవధిలోనే చిరుతను వెనక్కుంటూ అడవిలోకి వెళ్లింది. 

చెట్లలో ఉన్న చిరుత పిల్లపై దాడి చేసి చంపింది.  కొంత మంది గ్రామస్తులు ఈ ఘటన చూసి ఆశ్చర్య పోయారు. మరల గ్రామంలోకి వచ్చి చూడగా కుక్క పిల్ల చనిపోయి ఉంది. దాని చుట్టు శునకం తిరుగుతూ ఉండటం ను గమనించి గంటల వ్యవధిలోనే శునకం ప్రతీకారం తీర్చుకుందని వింతగా  మాట్లాడుకున్నారు.

 వెంటనే ఫారెస్ట్ అధికారులు ఘటన ప్రదేశంకు చేరుకుని కుక్క పిల్ల కళేబరంతో పాటు, చిరుత పిల్ల కళేబరంను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన గురించి గ్రామంలో తల్లి శునకం తన పిల్లను చంపినందుకు ప్రతీకారం తీర్చుకుందని వింతగా మాట్లాడుకుంటున్నారు.ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES