• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /ఛార్జింగ్ టెన్షన్‌కు చెక్ పెట్టనున్న OnePlus కొత్త ఫోన్.. 9000mAh బ్యాటరీతో అదరగొట్టే ఫీచర్లు!

ఛార్జింగ్ టెన్షన్‌కు చెక్ పెట్టనున్న OnePlus కొత్త ఫోన్.. 9000mAh బ్యాటరీతో అదరగొట్టే ఫీచర్లు!

OnePlus Nord 7: ఎంతో శక్తివంతమైన 9000mAh భారీ బ్యాటరీతో వన్‌ప్లస్ నార్డ్ 7 స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఇది 80W ఛార్జింగ్ సపోర్ట్‌తో విడుదల కాబోతోంది. అయితే, దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 25, 2026, 17:47 IST|Updated: Nov 25, 2026, 17:49 IST
joinshare
ఛార్జింగ్ టెన్షన్‌కు చెక్ పెట్టనున్న OnePlus కొత్త ఫోన్.. 9000mAh బ్యాటరీతో అదరగొట్టే ఫీచర్లు!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
ఛార్జింగ్ టెన్షన్‌కు చెక్ పెట్టనున్న OnePlus కొత్త ఫోన్.. 9000mAh బ్యాటరీతో అదరగొట్టే ఫీచర్లు!

ఛార్జింగ్ టెన్షన్‌కు చెక్ పెట్టనున్న OnePlus కొత్త ఫోన్.. 9000mAh బ్యాటరీతో అదరగొట్టే ఫీచర్లు!

2

ఉదయం కల్లు గీత.. ఆ తర్వాత స్కూల్.. తండ్రి లేని లోటును భర్తీ చేస్తున్న చిన్నారి చరణ్!

3

Maharashtra: నా పిల్లను చంపుతావా..?.. చిరుత పులి కూనపై శునకం ప్రతీకారం.. మహారాష్ట్రలో ఆసక్తికర ఘటన..

4

IPL 2027 Auction: ఐపీఎల్‌ ఎంట్రీకి అండర్-19 ఆసియా కప్ హీరో రెడీ.. వేలంలోకి సెహ్వాగ్ వారసుడు..!

5

శీతాకాలంలో విటమిన్ డి లోపం ఎందుకు వస్తుంది? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

OnePlus Nord 7: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వన్‌ప్లస్.. తన పాపులర్ నార్డ్ సిరీస్‌లో మరో కొత్త మోడల్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.  వన్‌ప్లస్ నార్డ్ 7 పేరుతో రాబోతున్న ఈ ఫోన్ అధికారిక ప్రకటనకు ముందే దీనికి సంబంధించిన ఫోటోలతో పాటు కీలక ఫీచర్లు సోషల్‌ మీడియాలో లీక్‌ అయ్యాయి.. ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ఈ ఫోన్‌కు సంబంధించిన లైవ్ ఫొటోలను షేర్‌ చేశారు. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం...

లీక్‌ అయిన ఫోటోస్‌ గమనిస్తే.. వన్‌ప్లస్ నార్డ్ 7 డిజైన్‌లో కంపెనీ కొత్త ప్రయోగం చేసినట్లు తెలుస్తోంది. ఫోన్ వెనుక భాగంలో నిగనిగలాడే ఫినిషింగ్‌తో పాటు అద్భుతమైన టీల్ గ్రీన్  ఫ్రేమ్ కూడా ఉంటుంది. పెద్ద కెమెరా మాడ్యూల్‌లో నిలువుగా ఉండడమే కాకుండా రెండు సెన్సార్లు ఉన్నట్లు తెలుస్తోంది.. వాటి పక్కనే ఫ్లాష్, పొడవైన RGB లైట్ స్ట్రిప్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ వస్తోంది. ఇందులో ప్రత్యేకమైన లైట్‌ కాల్ అలర్ట్‌లు, నోటిఫికేషన్లు లేదా గేమింగ్ ఎఫెక్ట్‌ల కోసం ఉపయోగించే అవకాశం ఉంది. ఇక ముందు భాగంలో సన్నని బెజెల్స్‌తో కూడిన ఫ్లాట్ డిస్‌ప్లే, మధ్యలో పంచ్-హోల్ సెల్ఫీ కెమెరా కూడా లభిస్తోంది.

లీక్‌ ఫీచర్స్‌ ఇవే..
ఈ ఫోన్‌లో ఎంతో శక్తివంతమైన 9000mAh భారీ బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది.. దీనికి తోడు ఫాస్ట్‌ ఛార్జింగ్ కోసం 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. అలాగ 144Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన సూపర్ AMOLED డిస్‌ప్లేను కూడా అందుబాటులోకి తీసుకు రాబోతున్నారు.. అంతేకాకుండా మోస్ట్ పవర్‌ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 చిప్‌సెట్‌ ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

నార్డ్ 6తో పోలిస్తే మార్పులు ఇవే..
గత ఏప్రిల్ 2026లో భారత మార్కెట్‌లో విడుదలైన  వన్‌ప్లస్ నార్డ్ 6 స్మార్ట్‌ఫోన్‌తో పోలిస్తే.. రాబోయే నార్డ్ 7లో కొన్ని ప్రత్యేకమైన మార్పులు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. నార్డ్ 6లో స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్‌తో పాటు 165Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే ఉండగా.. కొత్త నార్డ్ 7లో డైమెన్సిటీ 8500 ప్రాసెసర్‌ను కూడా వినియోగించబోతున్నట్లు తెలుస్తోంది.. అయితే, 9000mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్ సపోర్ట్‌ విషయంలో మాత్రం రెండు ఫోన్లు ఒకేలా ఉండే అవకాశం ఉంది. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ధర, ఇతర వివరాలను అధికారికంగా వెల్లడించలేదు..

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Tech News