SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

బొమ్మ కారుకు పెట్రోల్ అయిపోయిందట.. బంక్‌కు వెళ్లిన బుడతడు..

Little Boy Viral Video: తాజాగా సోషల్ మీడియాలో ఓ బాలుడికి సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో బాలుడు బొమ్మ కారులో పెట్రోల్‌ పోయించుకునేందుకు బంక్‌ వద్దకు వెళ్లడం, అక్కడ బంక్‌ సిబ్బందితో పెట్రోల్ అడగడం మీరు గమనించవచ్చు. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 19, 2026, 14:40 IST | Updated: Nov 19, 2026, 15:00 IST
Image Credit: Zee Telugu news
Join

Little Boy Viral Video: సోషల్ మీడియాలో ప్రతి రోజు ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే అందరినీ ఆకట్టుకుంటూ ఉంటాయి.. పెదాలపై నవ్వును పుట్టిస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి అద్భుతమైన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. నాగాలాండ్ మంత్రి టెమ్జెన్ ఇమ్నా అలాంగ్ తన  ఎక్స్ ఖాతాలో ఈ వీడియోను షేర్‌ చేశాడు.. ఇప్పుడు ఈ వీడియో విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక చిన్నారి.. తన ఆకుపచ్చ రంగు బొమ్మ కారును లాక్కుంటూ పెద్దవారిలాగే నేరుగా ఒక పెట్రోల్ బంక్ దగ్గరి వెళ్లాడు.. తన బొమ్మ కారులో పెట్రోల్‌ పూర్తిగా అయిపోయిందని.. ట్యాంక్ ఫుల్ చేయాలని అక్కడున్న పెట్రోల్ బంక్ సిబ్బందిని ఎంతో సీరియస్‌గా అడగడం మీరు క్లియర్‌గా చూడొచ్చు. ఆ బాలుడి ముఖంలోని అమాయకపు మాటలు విన్న బంక్ ఉద్యోగి ఒక్కసారిగా ఆశ్చర్యపోవడం మీరు గమనించవచ్చు.. ఆ చిన్నారి ఊహాలోకాన్ని గౌరవిస్తూ.. వెంటనే నవ్వుతూ ఆ ఆటలో ఆ బంక్‌ సిబ్బంది కూడా పాల్పంచుకున్నాడు. నిజమైన వాహనానికి పెట్రోల్ నింపినట్లే ఫ్యూయల్ నాజిల్‌ను తీసుకుని.. ఆ బొమ్మ కారు దగ్గర పెట్టి పెట్రోల్ నింపుతున్నట్లు నటించడం మీరు గమనించవచ్చు..

అయితే, అసలు ట్విస్ట్ ఆ తర్వాతే మొదలవ్వడం మీరు గమనించవచ్చు.. కారులో పెట్రోల్ నింపడం పూర్తవగానే.. ఆ బుడతడు తన జేబులోంచి.. ఒక కరెన్సీ నోటు తీసి పెట్రోల్ బంక్ ఉద్యోగికి ఇచ్చేందుకు ప్రయత్నించడం మీరు గమనించవచ్చు. చిన్నారి అమాయకత్వానికి ఆ ఉద్యోగి మురిపోవడం కూడా మీరు గమనించవచ్చు.. నవ్వుతూ డబ్బులు తీసుకోవడానికి నో చెప్పడం కూడా మీరు చూడొచ్చు.. కానీ ఆ బాలుడు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు... తాను పెట్రోల్ కొట్టించుకున్నాను కాబట్టి కచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టడం కూడా మీరు ఈ వీడియోలో క్లియర్‌గా చూడొచ్చు... చివరకు ఆ చిన్నారి ఆనందం కోసం.. ఆ ఉద్యోగి ఆ నోటును తీసుకోవడం మీరు చూడొచ్చు. డబ్బులు ఇచ్చిన తర్వాత ఏదో పెద్ద పని పూర్తి చేసినంత సంతృప్తితో ఆ బాలుడు తన బొమ్మ కారును తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోవడం మీరు క్లియర్‌గా చూడొచ్చు..

ట్యాంక్ పూర్తిగా ఖాళీ అయిపోయిందట.. అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియోకు వేల సంఖ్యలో వ్యూస్‌తో పాటు లైకులు వచ్చాయి.. ఇంత చిన్న వయసులోనే ఆ బాలుడికి ఉన్న ఆలోచనతో పాటు అన్ని అవగాహన చూసి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తూ వస్తున్నారు.. ఇక తన పని ఒత్తిడిని పక్కన పెట్టి.. ఒక చిన్నారి చిరునవ్వు కోసం ఎంతో ఓపికగా.. ప్రేమగా స్పందించిన పెట్రోల్ బంక్ ఉద్యోగి మంచి మనసును కూడా ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ వీడియో మాత్రం విపరీతంగా వైరల్ అవుతోంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ZEENEWS TRENDING STORIES