SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

తమ్ముడి గుండుపై అక్క రోటీల తయారీ.. చూస్తే నవ్వాగదు!

Girl Makes Roti On Brother Head Video: తాజాగా సోషల్ మీడియాలో ఓ చిన్నారి అక్క.. తన తమ్ముడి గుండుపై రోటీలు చేస్తున్న ఘటన ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా పొట్ట ఉబ్బిపోయేలా నవ్వుకుంటున్నారు. ఇప్పుడు ఈ వీడియోకి సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకుందాం.

Reported By Dharmaraju Dhurishetty Written By Dharmaraju Dhurishetty
Published: Sep 24, 2026, 03:03 PM IST | Updated: Sep 24, 2026, 03:05 PM IST
Image Credit: Zee Telugu News
Join

Girl Makes Roti On Brother Head Video Viral: సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో రకాల వీడియోలో పాటు వింతలు, విశేషాలు విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. కొన్ని వీడియోలు మాత్రం సోషల్ మీడియా వినియోగదారులను మనసును హత్తుకోవడమే కాకుండా కడుపుబ్బా ఎంతగానో నవ్విస్తూ ఉంటాయి. ముఖ్యంగా అక్కాతమ్ముళ్ల కొట్లాటలతో పాటు వారు రోజు చేసే అల్లరి పనులకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాను అప్పుడప్పుడూ షేక్‌ చేస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి ఒక అల్లరికి సంబంధించిన నవ్వుపుట్టించే వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇంట్లో చపాతీలు చేసే పీట లేకపోతేనేం.. నా తమ్ముడు ఉన్నాడుగా.. అనుకుందో ఏమే ఓ చిన్నారి.. ఏకంగా తమ్ముడి గుండుపైనే పిండి ముద్దను ఉంచి.. రోటీలు సాగదీస్తూ అందరినీ నవ్వుపుట్టించేలా చేస్తోంది చిట్టి పాప..

వైరల్ అవుతున్న ఆ వీడియో వివరాల్లోకి వెళితే.. ఒక చిన్నారి వంటింట్లో సరదాగా రోటీలు చేసే ప్రయత్నం చేయడం మీరు గమనించవచ్చు.. అయితే, రోటీలు రుద్దే పీట బదులు.. పక్కనే కూర్చున్న తన చిన్న తమ్ముడిని వాడుకోవడం మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఇటీవలే గుండు చేయించుకున్న ఆ బుజ్జిబాబుని తన పక్కనే.. భద్రంగా కూర్చోబెట్టుకోవడం మీరు గమనించవ్చు. ఆ తర్వాత చిన్న చిన్న చపాతీ పిండి ముద్దలను తీసుకుని.. ఆ బాలుడి గుండుపై ఉంచడం కూడా మీరు చూడొచ్చు.

ఆ తర్వాత చిన్నారి నెమ్మదిగా.. చపాతీ కర్ర సాయంతో ఆ పిండి ముద్దను గుండుపైనే నెమ్మదిగా సాగదీస్తూ.. చపాతీలా ఒత్తడం మొదలు పెట్టింది. ఇక్కడ అత్యంత విశేషం ఏంటంటే.. అక్క తన తల మీద అంత పని చేస్తున్నా.. ఆ అమాయకపు తమ్ముడు ఏమాత్రం ఏడవకుండా.. గొడవ చేయకుండా నిశ్శబ్దంగా అక్కడే కూర్చొని ఉండటం అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తోంది..

ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు ఎక్స్, ఫేస్‌బుక్‌లలో విపరీతంగా వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు పగలబడి నవ్వుకుంటూ కామెంట్లు చేస్తూ వస్తున్నారు.. అక్కాతమ్ముళ్ల బంధం అంటే ఇదే.. తమ్ముడు దేనికైనా ఉపయోగపడాల్సిందే.. అని అంటూ కొందరు కామెంట్లు చేస్తూ వస్తున్నారు. పాపం ఆ బుడతడి అమాయకత్వం చూడండి.. అక్క ఏం చేసినా కామ్‌గా భరిస్తున్నాడు.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో షేక్‌ చేస్తోంది..

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES