SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

వంటగ్యాస్ సిలిండర్ బుక్ చేయడం ఇక మరింత ఈజీ.. వాట్సాప్, ఎస్‌ఎంఎస్‌తో నిమిషాల్లో ఇలా బుక్ చేసుకోండి!

మనం ప్రతి నెలా లేదా కొన్నిసార్లు రెండు నెలలకు ఒకసారి ఎల్‌పీజీ గ్యాస్ బుక్ చేసుకుంటూ ఉంటాము. భారత్ గ్యాస్ లేదా ఇతర కంపెనీల సిలిండర్ అయిపోయినప్పుడు, వెంటనే బుక్ చేసుకోవడం కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది. ఫోన్‌ నెంబర్‌ ఏదో తెలీదు. అయితే, వాట్సాప్ ద్వారా మీరు ఎంతో సులభంగా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు. ఆ ప్రక్రియ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Written By Renuka Godugu
Published: Oct 11, 2026, 12:30 PM IST | Updated: Oct 11, 2026, 12:41 PM IST
Image Credit: LPG cylinder booking
Join

ప్రతి ఇంట్లో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ఉంటుంది. ఇళ్లలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను, రెస్టారెంట్లు లేదా ఇతర పెద్ద వ్యాపార సంస్థల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను ఉపయోగిస్తారు. ప్రతి నెల లేదా రెండు నెలలకు ఒకసారి గ్యాస్ రీఫిల్ బుక్ చేయాల్సి ఉంటుంది. దీని కోసం ప్రతిసారీ ఫోన్ నంబర్లు డయల్ చేసే పెద్ద ప్రక్రియ అవసరం లేదు; చాలా సులభంగా వాట్సాప్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు.
గ్యాస్ అయిపోయినప్పుడు కాల్ చేసి ఇబ్బందులు పడకుండా, ఇంట్లోనే కూర్చుని వాట్సాప్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.

మీరు భారత్ పెట్రోలియంఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులు అయితే, ముందుగా 1800224344 అనే నంబర్‌ను మీ కాంటాక్ట్స్‌లో సేవ్ చేసుకోండి. ఆ తర్వాత వాట్సాప్‌లో రిఫ్రెష్ చేసి, ఆ నంబర్‌కు 'Hi' అని పంపండి. అక్కడ మీకు కనిపించే 'Refill Booking' అనే ఆప్షన్‌ను క్లిక్ చేస్తే, కొద్ది సెకన్లలోనే మీ బుకింగ్ పూర్తవుతుంది.

మీ ఇంట్లో ఇండియన్ గ్యాస్ సిలిండర్ ఉంటే, 7588888824 నంబర్‌కు 'Refill' అని మెసేజ్ చేయండి. 
ఒకవేళ మీరు హెచ్‌పి గ్యాస్ వినియోగదారులు అయితే, 9222211222 నంబర్‌కు 'Hi' లేదా 'Book' అని మెసేజ్ పంపాల్సి ఉంటుంది.

ఎస్ఎంఎస్ ద్వారా గ్యాస్ బుక్ చేసే విధానం:
భారత్ గ్యాస్ కస్టమర్లు 'LPG' అని 7715012345 నంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. వెంటనే మీకు బుకింగ్ కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.
అంతేకాదు, వాట్సాప్, ఎస్ఎంఎస్ మాత్రమే కాకుండా, మీ దగ్గర స్మార్ట్‌ఫోన్ ఉంటే Google Pay, PhonePe లేదా Amazon వంటి యాప్‌ల ద్వారా కూడా సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.  ఉమాంగ్‌ యాప్‌ ద్వారా కూడా మీరు ఈ సేవలు పొందవచ్చు. ఈ యాప్‌లను ఓపెన్ చేసి, ఎల్‌పీజీ లేదా గ్యాస్ సిలిండర్ ఆప్షన్‌ను ఎంచుకోండి. మీ గ్యాస్ ఏజెన్సీ వివరాలు, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను నమోదు చేసి 'Book' పై క్లిక్ చేస్తే సరిపోతుంది. కొద్ది నిమిషాల్లోనే మీ బుకింగ్ పూర్తవుతుంది. ఇలా మీరు ఎప్పుడైనా చాలా సులభంగా గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES