SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఎల్పీజీ గ్యాస్ కస్టమర్లకు బిగ్ అప్‌డేట్.. అక్టోబర్ 1 నుండి ఆ తప్పు చేస్తే సిలిండర్ డెలివరీ కాదు!

సెప్టెంబర్ నెల ముగింపు దశకు చేరుకుంది. అక్టోబర్ ఒకటి నుండి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చేసే అవకాశం ఉంది. అయితే, గ్యాస్ వినియోగదారులు బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ చేయకపోతే ఇకపై గ్యాస్ డెలివరీ అందదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written By Renuka Godugu
Published: Sep 25, 2026, 04:37 PM IST | Updated: Sep 25, 2026, 04:47 PM IST
Image Credit: LPG Cylinder Delivery Rules
Join

LPG Cylinder Delivery Rules: ప్రతి నెలా ఒకటో తేదీన ఆయిల్ గ్యాస్ కంపెనీలు డొమెస్టిక్, కమర్షియల్ సిలిండర్ ధరలను సవరించడం జరుగుతుంటుంది. అక్టోబర్ ఒకటి రాబోతున్న నేపథ్యంలో, ఇప్పుడు బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి చేశారు. మీరు సబ్సిడీలో గ్యాస్ సిలిండర్ పొందాలంటే ఆధార్ అథెంటికేషన్ ఖచ్చితంగా ఉండాలి. లేనిపక్షంలో అక్టోబర్ ఒకటి నుండి సబ్సిడీ లభించదు. మీ కనెక్షన్ డిస్కనెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది.

గ్యాస్ సిలిండర్ సప్లై ఆగిపోతుందా?
ఇప్పటివరకు బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ చేయించుకోని వినియోగదారులు సప్లై ఆగిపోతుందేమోనని గందరగోళంలో ఉన్నారు. అందుకే గతంలో కంపెనీలు పలుమార్లు గడువును పొడిగించాయి. ప్రస్తుతం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఆధార్ అథెంటికేషన్‌ను తప్పనిసరి చేస్తూనే, వివిధ మార్గాల ద్వారా కేవైసీ పూర్తి చేసుకునే అవకాశం కల్పించాయి. ఇంటర్ ఆక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (IVRS), వాట్సాప్ చాట్‌బాట్, మొబైల్ యాప్, కన్స్యూమర్ వెబ్‌సైట్ ద్వారా ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. కేవలం రిజిస్టర్ చేసుకున్న వినియోగదారులు మాత్రమే 5 లేదా 10 కిలోగ్రాముల సిలిండర్లను మార్కెట్ ధరకే పొందగలరు. సబ్సిడీ ప్రయోజనం పొందాలంటే మాత్రం ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి.

ఆధార్ అథెంటికేషన్ చేసుకునే విధానం..
సబ్సిడీ ధరలో గ్యాస్ సిలిండర్ పొందడానికి, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల మొబైల్ యాప్స్ ద్వారా లేదా నేరుగా మీ గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి కేవైసీ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. మీరు ఇండియన్ ఆయిల్, భారత్ గ్యాస్ లేదా హెచ్‌పి గ్యాస్ వాడుతున్నట్లయితే, హెలో బీపీసీఎల్ లేదా హెచ్‌పి పే యాప్ ద్వారా సులభంగా ఈ ఆధార్ అథెంటికేషన్ చేయవచ్చు. అక్కడ ఉన్న వీడియో గైడ్స్ సాయంతో ఈ ప్రక్రియను సులభంగా పూర్తి చేయవచ్చు. అంతేకాకుండా, హోటళ్లలో కూడా ఈ సదుపాయం అందుబాటులో ఉండవచ్చు.

ఈ అథెంటికేషన్ లక్ష్యం ఏంటి?
అర్హత ఉన్న వినియోగదారులకు మాత్రమే సబ్సిడీ ధరలో డొమెస్టిక్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్లను అందించడమే ఈ ఆధార్ అథెంటికేషన్ ప్రధాన లక్ష్యం. దీనివల్ల అసలైన వినియోగదారులకు మాత్రమే సబ్సిడీ అందుతుంది మరియు అనర్హులైన వారు సబ్సిడీ ప్రయోజనాలను పొందకుండా నిరోధించవచ్చు.

గడువు పొడిగింపు..
మొదట జూన్ 3వ తేదీ లోపు ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేయాలని గడువు ఇచ్చారు. ఆ తర్వాత జులై 31, ఆగస్టు 7, 15, 23, 31, సెప్టెంబర్ 7 చివరిగా సెప్టెంబర్ 14 వరకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గడువును పొడిగించాయి. దేశవ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తూ, సుమారు 120 మిలియన్ల గ్యాస్ వినియోగదారులకు ఎస్ఎంఎస్, వాట్సాప్ సందేశాల ద్వారా ఈ సమాచారాన్ని పంపించారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES