Madhya Pradesh: ఇదెక్కడి విడ్డూరం.. గాడిదకు నర్సింగ్ సర్టిఫికేట్ జారీ.. అసలు విషయం ఏమిటంటే.?..
Nurse certificate for donkey in mp: ఆన్ లైన్ పోర్టల్ లో గాడిద పేరు మీదుగా నర్సింగ్ సర్టిఫికేట్ కోసం ఒక వ్యక్తి కావాలని అప్లై చేశాడు. అయితే కనీసం దాన్ని గమనించకుండా ఏకంగా అదే పేరుతో సర్టిఫికేట్ కూడా జారీచేయడం తీవ్ర వివాదంగా మారింది. మధ్య ప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ ఘటన వార్తలలో నిలిచింది.
Madhya Pradesh council issues online nursing certificate for donkey: మధ్యప్రదేశ్ లో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఆన్ లైన్ లో నర్సింగ్ సర్టిఫికేట్ లు విచ్చల విడిగా జారీచేయడంపై కొంత మంది విద్యార్థి సంఘాల నాయకులు తీవ్రంగా విమర్శలు చేశారు. కనీసం అభ్యర్థుల విద్యార్హతలు , సర్టిఫికేట్లు తనిఖీలు చేసి జారీ చేయాలని కోరుతున్నారు. అయిన కూడా చాలా వరకు పూర్తిగా నెగ్లీజెన్సీగా సర్టిఫికేట్ల జారీ ప్రక్రియ కొనసాగుతుంది.
ఇక విద్యార్థి సంఘం నేత గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్ కోసం ఆన్ లైన్ పోర్టల్ లో అప్లై చేశాడు. తండ్రి డాంకీ ఫాదర్.. తల్లి డాంకీ మదర్, కులం ఎనిమల్ అని ఫామ్ నింపి ఆన్ లైన్ లో 2,050 లను ఆన్ లైన్ లోఫీజు చెల్లించాడు. అనూహ్యంగా గాడిదకు నర్సింగ్ సర్టిఫికేట్ ను పోర్టర్ విడుదల చేసింది.
కనీసం అప్లై చేసిన ఫామ్ వివరాలు, డిటెయిల్ లు కూడా చూడకుండా పోర్టల్ నుంచి సర్టిఫికేట్ జారీ కావడంపై రచ్చ మొదలైంది. ఒక గాడిదకు కూడా నర్సింగ్ సర్టిఫికేట్ జారీ చేశారంటే మీ గొప్పతనం ఏంటో తెలుస్తుందని విద్యార్థి సంఘాల నాయకులు మండి పడుతున్నారు. ఈఘటన కాస్త ఉన్నతాధికారుల వరకు వెళ్లింది. దీనిపై విచారణకు ఆదేశించారు.
ఈ ఘటనతో.. అసలు నర్సింగ్ సర్టిఫికేట్ ఇంత ఈజీగా వస్తుందా..?.. వీరు రోగులకు ఏవిధమైన ట్రీట్ మెంట్ ఇస్తారు..?.. రోగుల జీవితాలతో ఇదిచెలగాటం ఆడటమేనంటూ విద్యార్థి సంఘాల నాయకులు, స్థానికులు మండిపడుతున్నారు.