• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Uttar Pradesh: రెచ్చిపోయిన ఏనుగు.. ఇనుప గొలుసును తెంచుకుని మావటిపై దాడి.. షాకింగ్ వీడియో..

Uttar Pradesh: రెచ్చిపోయిన ఏనుగు.. ఇనుప గొలుసును తెంచుకుని మావటిపై దాడి.. షాకింగ్ వీడియో..

Elephant attacks on Mahout: మావటిపై ఏనుగు బీభత్సంగా దాడి చేసింది. వారణాసి లో చోటు చేసుకున్న ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేశారు. రెండు కరెంట్ స్తంభాలను కూడా పెకిళించి పడేసినట్లు చెబుతున్నారు.

Written ByInamdar Paresh
Published: Oct 21, 2026, 01:14 PM IST|Updated: Oct 21, 2026, 01:26 PM IST
joinshare
Uttar Pradesh: రెచ్చిపోయిన ఏనుగు..  ఇనుప గొలుసును  తెంచుకుని మావటిపై దాడి.. షాకింగ్ వీడియో..
Image Credit: varanasi elephant attack news

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Poco X8s స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. 100W ఫాస్ట్ ఛార్జింగ్, భారీ బ్యాటరీ, ఫీచర్స్ ప్రత్యేకతలు!

Poco X8s స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. 100W ఫాస్ట్ ఛార్జింగ్, భారీ బ్యాటరీ, ఫీచర్స్ ప్రత్యేకతలు!

2

జగిత్యాలలో పోలీస్ అమరవీరులకు ఘన నివాళులు.. కలెక్టర్, ఎస్పీ ఏమన్నారంటే?

3

Palapitta: పాలపిట్ట బంధించడంపై కమిషనర్‌ సజ్జనార్‌ తీవ్ర ఆగ్రహం.. కఠిన చర్యలకు ఆదేశం

4

పెరిగిన కాలుష్యం.. ఢిల్లీ ప్రభుత్వ కీలక నిర్ణయం..! నవంబర్‌ 1 నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ సహా కఠిన నిబంధనలు అమల్లోకి!

5

CM Revanth reddy: పోలీసు డిపార్ట్ మెంట్ కు భారీ శుభవార్త.. అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం రేవంత్ కీలక ప్రకటన..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Mahout injured in elephant attack on ramlila in Varanasi: సాధారణంగా చాలా మంది  ఉత్సవాలు, పండగల నేపథ్యంలో ఇటీవల ఏనుగులను తీసుకొని వస్తున్నారు. ఇటీవల ఏనుగుల కొన్ని సార్లు జనాలకు భయపడి దాడులు చేస్తున్నాయి. టపాకాయల చప్పుళ్లు, డ్రమ్ ల శబ్దాలకు ఏనుగులు బెదిరిపోయి చుట్టుపక్కల ఉన్న వారిపై దాడి చేసిన ఘటనలు కొకొల్లలు. అయితే కొన్ని సందర్భాల్లో ఏనుగులను కంట్రోల్ చేయడానికి చూసిన మావటి వాళ్లను కూడా ఈడ్చి పడేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా.. ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో ఒక ఏనుగు బీభత్సం సృష్టించింది.

 

🐘 ఇనుప గొలుసు తెంచుకుని.. గంటలపాటు ఏనుగు బీభత్సం 🔹 వారణాసి రామ్‌నగర్ రామలీలా కోసం అజమ్‌గఢ్ నుంచి తెచ్చిన ఏనుగు ధనరాజ్, ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో పంచవటి మైదానంలో చెట్టుకు కట్టిన ఇనుప గొలుసు తెంచుకుంది. 🔹 అదుపు చేయబోయిన మావటి ఛాప్లూను తొండంతో ఎత్తి గోడకు కొట్టి, కింద పడేసి ఛాతీ, తొడ, చేతిపై తొక్కడంతో అతడు తీవ్రంగా గాయపడి, BHU ట్రామా సెంటర్‌లో పరిస్థితి విషమంగా ఉంది. 🔹 పంచవటి-లంక రోడ్డుపైకి దూసుకెళ్లి మార్కెట్ గేట్‌ను పగలగొట్టి, రెండు కరెంట్ స్తంభాలను పెకిలించి, చిన్న దుకాణాలు, టిన్ షెడ్లను నాశనం చేయడంతో కరెంట్ సరఫరా ఆగిపోయింది. 🔹 పోలీసులు, ఫారెస్ట్, NDRF సహా 200 మంది సిబ్బంది రంగంలోకి దిగగా, గోరఖ్‌పూర్ జూ నిపుణులు జైలాజిన్ ట్రాంక్విలైజర్‌తో మత్తు ఇచ్చి రాత్రి ఆలస్యంగా దాన్ని అదుపులోకి తెచ్చారు. #Varanasi #UttarPradesh

— ముచ్చట్లు | Stories • Voices • Views (@muchatlu_) October 21, 2026

 


ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి రామ్ నగర్ లో ఏనుగు రెచ్చిపోయింది.  దసరా నేపథ్యంలో రామ లీలా కోసం 
అజమ్‌గఢ్ నుంచి తెచ్చిన ఏనుగు ధనరాజ్ ఒక్కసారిగా రెచ్చిపోయింది.అప్పటి వరకు కూల్ గా ఉన్న ఏనుగు కాస్త ఇనుప గొలుసును తెంచుకుంది.అక్కడున్న వస్తులను తన తొండంతో ఎత్తిపడేసింది. ఇంతలో మావటి వాడు ఏనుగును కంట్రోల్ చేద్దామని చూడగా అతనిపై కూడా దాడి చేసింది.

 మావటిని తొండంతో ఎత్తి పడేసి, అతని ఛాతీపై తొక్కింది. దీంతో అతను తీవ్రంగా  గాయపడ్డాడు. ఆ తర్వాత ఏనుగు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో స్థానికులు అతడ్ని ఆస్పత్రికి తరలించారు.  అతని పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు  ఆ తర్వాత ఏనుగు పంచవటి-లంక రోడ్డుపైకి దూసుకెళ్లింది. 

మార్కెట్ గేట్‌ను పగలగొట్టి, రెండు కరెంట్ స్తంభాలను పెకిలించి వేసింది. దీంతో చిన్న దుకాణాలు, టిన్ షెడ్లను నాశనం చేయడంతో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. వెంటనే  పోలీసులు, ఫారెస్ట్, NDRF సహా 200 మంది సిబ్బంది రంగంలోకి దిగారు. గోరఖ్‌పూర్ జూ నిపుణులు ప్రత్యేకంగా గంటల వ్యవధిలో అక్కడకు వచ్చి జైలాజిన్ ట్రాంక్విలైజర్‌తో ఏనుగుకు మత్తు ఇచ్చి అదుపులొకి తెచ్చారు. ఈ ఏనుగు బీభత్సంకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
 

Add Zee News as a Preferred Source
TAGS:
National News
Trending News
Telugu News